second phase counselling
-
11న ఎంసెట్ రెండో విడత డౌటే!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 11న జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహణపై సాక్షాత్తు అధికారులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వాయిదా పడే అవకాశముందని భావిస్తున్నారు. ఫీజుల వ్యవహారంలో పీటముడి వీడకపోవడమే దీనికి కారణమంటున్నారు. వాస్తవానికి విద్యార్థులకు మొదటి విడత కౌన్సెలింగ్ కన్నా, రెండో విడత అత్యంత కీలకం. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ర్యాంకులపై దాదాపు స్పష్టత వస్తుంది. జాతీయ కాలేజీల్లో కోరుకున్న బ్రాంచ్ రాని విద్యార్థులు రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నిస్తారు. కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెరగడంతో గత కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా వదిలేసుకున్న విద్యార్థులు కూడా రెండో దశపై ఆశలు పెట్టుకుంటారు. ఇతర బ్రాంచీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులు పొందేందుకు ఈ దశ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ తర్వాత డిగ్రీ కాలేజీల్లో చేరే అవకాశం ఉంది. ఫీజుల నిర్ణయం తేలేనా? ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) దోబూచులాడుతోందన్న విమర్శలొస్తున్నాయి. జూలైలో కాలేజీల ఆడిట్ రిపోర్టులు పరిశీలించి, కొత్త ఫీజులు నిర్ణయించిన ఎఫ్ఆర్సీ అంతలోనే యూటర్న్ తీసుకుంది. ఆడిట్ నివేదికలు సరిగ్గా పరిశీలించలేదని భావించడం, మళ్లీ కాలేజీలను పిలిచి ఆడిట్ నివేదికలను ఆమూలాగ్రం పరిశీలించడం, తర్వాత కొన్ని కాలేజీల ఫీజులు తగ్గించడం అనేక సందేహాలకు తావిస్తోంది. రెండోసారి ఆడిట్ నివేదికల్లో కన్పించిన తప్పులు మొదటిసారి ఎందుకు గుర్తించలేకపోయారనే అనుమానాలు అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఫీజులు తగ్గించామని చెబుతున్నప్పటికీ.. 2019తో పోలిస్తే ఎక్కువ కాలేజీల ఫీజులు పెరిగాయని పలువురు అంటున్నారు. రెండుసార్లు పరిశీలించినా, మరోసారి సంప్రదింపులకు 20 కాలేజీలను పిలవడం, ఆ తర్వాత ఏం చేయబోతున్నారో స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఫీజుల వ్యవహారంపై ఎటూ తేల్చకపోవడంతో ఈ ప్రభావం రెండో దశ కౌన్సెలింగ్‌పై పడే అవకాశముంది. ఇలా జాప్యమైతే ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ఈసారి కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. -
ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ రేపటి నుంచే..
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రవేశాల కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 6 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 186 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 64,946 సీట్లు అందుబాటులో ఉండగా, గత నెలలో నిర్వహించిన మొదటి దశ కౌన్సెలింగ్‌లో 52,621 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించింది. మరో 12,325 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. పైగా సీట్లు పొందిన వారిలో 38,705 మంది విద్యార్థులే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, కాలేజీల్లో ప్రవేశాలు పొందారు. దీంతో ఖాళీగా ఉన్న వాటితో పాటు విద్యార్థులు చేరని సీట్లు కలుపుకొని కన్వీనర్ కోటాలో 26,241 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి భర్తీకి ఈ నెల 6 నుంచి రెండో దశ ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుంది. ఈసారి ఇంజనీరింగ్ ప్రవేశాలకు మూడో దశ కౌన్సెలింగ్ కూడా నిర్వహించాలని ఇప్పటికే ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. అయితే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు ఈ నెల 19తో పూర్తి కానున్నాయి. ఆ తర్వాతే మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఇదీ రెండో దశ కౌన్సెలింగ్ షెడ్యూల్.. 6–7–2018 నుంచి 8–7–2018 వరకు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు 7–7–2018 నుంచి 8–7–2018 వరకు: రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 7–7–2018 నుంచి 10–7–2018 వరకు: వెరిఫికేషన్ పూర్తయిన వారికి వెబ్ ఆప్షన్లు 12–7–2018: సీట్ల కేటాయింపు 12–7–2018 నుంచి 14–7–2018: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ 13–7–2018 నుంచి 15–7–2018: సీట్లు లభించిన కాలేజీల్లో రిపోర్టింగ్ 16–7–2018 నుంచి: తరగతులు ప్రారంభం -
ముగిసిన రెండో విడత కౌన్సెలింగ్
రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్ ముగిసిందని ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు వారికి కేటాయించిన పాలిటెక్నిక్ కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని లేకుంటే సీటు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు రిపోర్ట్ చేయక పోవడం వల్ల ఏర్పడే ఖాళీలను అక్టోబర్ 1వ తేదీన నిర్వహించే స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు వివరించారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సమస్యలపై ‘సాక్షి’ సదస్సులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భారీగా మిగిలిన సీట్లు మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీం నో అనడంతో ఈ ఏడాది ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించి, ఇంజనీరింగ్ కోర్సుల్లో సీటు పొందాలని ఆశిస్తున్న వేలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందుబాటులో ఉన్న సీట్లు, ఎంసెట్ అర్హుల సంఖ్య దృష్ట్యా దాదాపు ప్రతి ఒక్కరికి సీటు లభించే అవకాశం ఉన్నప్పటికీ.. కౌన్సెలింగ్‌లో జాప్యం, కళాశాలలకు అనుమతుల నిరాకరణ వంటి కారణాలతో లక్షకుపైగా సీట్లు భర్తీ కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చేయూతగా నిలిచేందుకు ‘సాక్షి’ మరోసారి ముందుకొస్తోంది. కౌన్సెలింగ్‌లో ప్రస్తుత పరిస్థితులకు దారి తీసిన కారణాలు, విద్యార్థుల భవిష్యత్తు కోణంలో ఇప్పటికైనా చేపట్టదగిన చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా.. ఈ నెల 22 నుంచి 25 వరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సదస్సులు నిర్వహించనుంది. ఈ సదస్సుల్లో ప్రముఖ విద్యావేత్తలు పాల్గొననున్నారు. ప్రస్తుత సమస్యకు పరిష్కార మార్గాలను, ప్రత్యామ్నాయాలను సూచించనున్నారు. సదస్సులు జరిగే ప్రాంతాలు- తేదీలు: హైదరాబాద్- సోమవారం, సెప్టెంబర్ 22 (వేదిక: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం) విశాఖపట్నం-మంగళవారం, సెప్టెంబర్ 23 (వేదిక: వైశాఖి ఫంక్షన్ హాల్స్) విజయవాడ-బుధవారం, సెప్టెంబర్ 24 (వేదిక: ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ సెమినార్ హాల్) తిరుపతి-గురువారం, సెప్టెంబర్ 25 (వేదిక: ఎస్వీవర్సిటీ సెనేట్ హాల్) -
విద్యార్థులను ముంచిన ‘విద్యా మండలి’
* సుప్రీంలో రెండో విడత కౌన్సెలింగ్‌ను ప్రస్తావించని ఉన్నత విద్యా మండలి * అదే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థుల పాలిట శాపం * మలి విడత కౌన్సెలింగ్, మేనేజ్మెంట్ కోటా భర్తీకి గడువు పొడిగించాలన్న వినతిని తోసిపుచ్చిన సుప్రీం కోర్టు * తీర్పు ప్రకారం అడ్మిషన్ల గడువు గత నెల 31తో పూర్తి * అగమ్యగోచరంలో తొలి విడతలో సీటు దక్కని 4 వేల మంది * బ్రాంచ్ మార్చుకునే వారికీ అవకాశం లేదు * మేనేజ్మెంట్ సీట్ల భర్తీపైనా స్పష్టత కరువు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఉదాసీనత ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యనభ్యసించాలనుకున్న విద్యార్థుల విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రెండో విడత కౌన్సెలింగ్‌కు అవకాశం లేకుండా చేసింది. మలి విడత కౌన్సెలింగ్, మేనేజ్మెంట్ కోటా భర్తీకి గడువు పొడిగించాలన్న ఉన్నత విద్యామండలి వినతిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు అలస్యం కాకుండా సుప్రీంకోర్టు 2012 డిసెంబరు 13నే సాంకేతిక విద్యకు క్యాలండర్‌ను రూపొందించింది. కళాశాలలు ఏఐసీటీఈ అనుమతికి దరఖాస్తు చేసుకోవడం నుంచి తరగతుల ప్రారంభం వరకు స్పష్టమైన షెడ్యూల్‌ను రూపొందించింది. దానిని ఏఐసీటీఈ నోటిఫై చేసింది. దానిప్రకారం ఏటా జూలై 31లోగా అడ్మిషన్లు పూర్తవ్వాలి. ఆగస్టు 1న తరగతులు ప్రారంభమవ్వాలి. మిగిలిపోయిన సీట్లను ఆగస్టు 15లోగా భర్తీ చేయాలి. ఆ తర్వాత అడ్మిషన్లు చేపట్టకూడదు. దీని ప్రకారం ఈ ఏడాది కూడా అడ్మిషన్లు జరగాలి. అయితే విభజన నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిందని, అధికారుల కేటాయింపు పూర్తి కాలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొత్తగా విధివిధానాలు రూపొందిం చాల్సి ఉందని, అందువల్ల కౌన్సెలింగ్ పూర్తిచేసేందుకు అక్టోబరు 31 వరకు గడువు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇందులో తాము ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని ఏపీ ఉన్నత విద్యామండలి కోరింది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా అడ్మిషన్లు త్వరితగతిన పూర్తిచేయాల్సి ఉందని, ఆగస్టు 31 వరకు గడువు పొడిగిస్తే సరిపోతుందని విన్నవించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వమూ సరేనంది. దాంతో సుప్రీంకోర్టు అడ్మిషన్ల ప్రక్రియ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. దీని ప్రకారం తొలి విడత కౌన్సెలింగ్ గత నెల 31లోపు పూర్తయింది. అయితే, ఆగస్టు 4 నాటి విచారణ సందర్భంగా రెండో విడత కౌన్సెలింగ్ విషయాన్ని ప్రస్తావించలేదు. తొలి విడత కౌన్సెలింగ్‌లో కొందరు విద్యార్థులు వివిధ కారణాల వల్ల సీట్లు పొందలేకపోవచ్చు. సీట్లు పొందిన వారు కూడా బ్రాంచ్, కాలేజి నచ్చక వాటిలో చేరకపోవచ్చు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరైన వారిలో 4 వేల మందికి సీటు రాలేదు. వీరికి రెండో విడత కౌన్సెలింగ్ కూడా లేకుండాపోయింది. అలాగే తొలి విడతలో సీటు పొందినా, ఆ బ్రాంచ్ నచ్చకో, మంచి కాలేజీకోసమో కళాశాలల్లో రిపోర్ట్ చేయని వారూ రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరికీ ఇప్పుడు న్యాయం జరిగే పరిస్థితి లేదు. అంతేగాక విద్యార్థులు వదిలేసిన సీటును కళాశాలలు మరొకరికి ఇవ్వలేని పరిస్థితీ ఎదురవుతుంది. దానిని మేనేజ్మెంట్ కోటాగా మార్చుకున్నా.. దాని గడువూ గత నెల 31తో ముగిసింది. కీలకమైన ఇలాంటి సాంకేతిక అంశాలను ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టులో ప్రస్తావించనే లేదు. 65 వేల సీట్లు మిగిలిపోయాయన్న ధ్యాసే తప్ప, విద్యార్థులు నష్టపోతున్న విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించలేదు. వాదనలూ వినిపించలేదు. ఆగస్టు 4 నాటి విచారణకు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్, రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. వారు ఆనాడే ఈ విషయం ప్రస్తావించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. మేనేజ్మెంట్ కోటా పరిస్థితేమిటి? బి- కేటగిరీ (మేనేజ్మెంట్ కోటా) సీట్ల భర్తీకి ఏపీ ఉన్నత విద్యామండలి గత నెల 22న నోటిఫికేషన్ జారీచేసింది. వ్యక్తిగతంగా లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఈనెల 3లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చంది. ఈ నెల 5న మెరిట్ జాబితా, 7న ఎంపికైన వారి జాబితాలు ఇస్తామని, 9న వీటిని ఉన్నత విద్యామండలి ధృవీకరిస్తుందని పేర్కొంది. ఎంపికైన విద్యార్థులకు 12న ఇంటర్వ్యూ ఉంటుందని, 15న అడ్మిషన్లకు చివరి తేదీ అని ప్రకటించింది. కానీ, రెండో విడత కౌన్సెలింగ్, మేనేజ్మెంట్ కోటా భర్తీ ప్రక్రియల గడువును ఈ నెల 30 వరకు పొడిగించాలన్న ఉన్నత విద్యామండలి అభ్యర్థనను సుప్రీం కోర్టు గురువారం తోసిపుచ్చింది. దీంతో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ల పరిస్థితేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ సీట్లు చెల్లుబాటు కావా? అడ్మిషన్లు నిర్వహిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందా వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అడ్మిషన్లలో సీటు పొందలేని విద్యార్థులో, బ్రాంచ్ మార్చుకోవాలని భావిస్తున్న వారో సుప్రీం కోర్టును ఆశ్రయించడమొక్కటే ఇప్పుడున్న అవకాశమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కాగా సుప్రీం కోర్టు తీర్పు కాపీని పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రెండో విడత కౌన్సెలింగ్‌పై తదుపరి చర్యలు చేపడతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. -
ఇంజనీరింగ్ కాలేజీలకు చుక్కెదురు
* తాజా కౌన్సెలింగ్‌కు ఆదేశాలివ్వలేమన్న హైకోర్టు * ఈ దశలో అటువంటి ఉత్తర్వులు సాధ్యం కాదని స్పష్టీకరణ * రెండో దశ కౌన్సిలింగ్ చేపట్టే ఉద్దేశం లేదన్న అడ్వొకేట్ జనరల్ * ప్రవేశాల్లో ఆలస్యం కోర్టు ధిక్కారమేనని నివేదన సాక్షి, హైదరాబాద్: వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగింపునకు గురై, కోర్టులో సానుకూల ఉత్తర్వులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏ, బీ కేటగిరీల్లో ప్రవేశాల కల్పన నిమిత్తం తమకు అనుమతినివ్వడంతో పాటు, తమ కాలేజీలకు తాజాగా కౌన్సిలింగ్ లేదా అనుబంధ కౌన్సిలింగ్ నిర్వహించేలా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ), హైదరాబాద్‌ను ఆదేశించాలని కోరుతూ ఇంజనీరింగ్ కాలేజీలు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ దశలో అటువంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎంత మాత్రం సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో రెండో దశ కౌన్సిలింగ్‌లోనైనా తమకు స్థానం దక్కుతుందని ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల ఆశలపై తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి నీళ్లు చల్లారు. ఆగస్టు 31లోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాల అమలులో భాగంగా రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహించే ఉద్దేశమేదీ తమకు లేదని ఏజీ రామకృష్ణారెడ్డి కోర్టుకు తేల్చి చెప్పారు. ఏజీ చెప్పిన ఈ కీలక అంశాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు చేసిన అభ్యర్ధనను తోసిపుచ్చారు. నిబంధనల మేర బోధనా సిబ్బంది ఉన్న కాలేజీలను కౌన్సిలింగ్ జాబితాలో చేర్చాలని ఇదే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా జేఎన్టీయూ ఏ మాత్రం పట్టించుకోలేదని, దానిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, తమ కాలేజీలకు తాజా లేదా అనుబంధ కౌన్సిలింగ్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైజయంతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మరో 23 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో హౌజ్ మోషన్ రూపంలో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశాయి. వీటిని జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారించారు. హామీ ఇచ్చినా పట్టించుకోలేదు... ఈ నెల 25న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు పిటిషనర్ కాలేజీలన్నీ కూడా రూ.100 స్టాంప్ పేపర్లపై యూనివర్సిటీ కోరిన ప్రకారం లోపాలను సవరించుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని కాలేజీల తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి తెలిపారు. నిబంధనల మేర తమ కాలేజీలన్నీ కూడా బోధనా సిబ్బందిని కలిగి ఉన్నందున వాటికి తాజాగా లేదా అనుబంధ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్ల భర్తీకి అవకాశమివ్వాలన్నారు. అలస్యం కోర్టు ధిక్కారమే.. తరువాత జేఎన్టీయూ తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆగస్టు 31లోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ప్రవేశాల ప్రక్రియలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా అది కోర్టు ధిక్కారమే అవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను యథాతథంగా అమలు చేస్తున్నామని, అందులో భాగంగా రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహించే ఉద్దేశమేదీ తమకు లేదని ఆయన కోర్టుకు నివేదించారు. -
నేటినుంచి రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ, న్యూస్‌లైన్ : ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడల్లో గురువారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. సీట్లు, కళాశాల వివరాలతో కూడిన సీట్మ్యాట్రిక్స్ యూనివర్సిటీ వెబ్సైట్ హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్‌లో ఉంచారు.