సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భారీగా మిగిలిన సీట్లు మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీం నో అనడంతో ఈ ఏడాది ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించి, ఇంజనీరింగ్ కోర్సుల్లో సీటు పొందాలని ఆశిస్తున్న వేలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందుబాటులో ఉన్న సీట్లు, ఎంసెట్ అర్హుల సంఖ్య దృష్ట్యా దాదాపు ప్రతి ఒక్కరికి సీటు లభించే అవకాశం ఉన్నప్పటికీ.. కౌన్సెలింగ్‌లో జాప్యం, కళాశాలలకు అనుమతుల నిరాకరణ వంటి కారణాలతో లక్షకుపైగా సీట్లు భర్తీ కాని పరిస్థితి.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చేయూతగా నిలిచేందుకు ‘సాక్షి’ మరోసారి ముందుకొస్తోంది. కౌన్సెలింగ్‌లో ప్రస్తుత పరిస్థితులకు దారి తీసిన కారణాలు, విద్యార్థుల భవిష్యత్తు కోణంలో ఇప్పటికైనా చేపట్టదగిన చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా.. ఈ నెల 22 నుంచి 25 వరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సదస్సులు నిర్వహించనుంది. ఈ సదస్సుల్లో ప్రముఖ విద్యావేత్తలు పాల్గొననున్నారు. ప్రస్తుత సమస్యకు పరిష్కార మార్గాలను, ప్రత్యామ్నాయాలను సూచించనున్నారు.
సదస్సులు జరిగే ప్రాంతాలు- తేదీలు:
హైదరాబాద్- సోమవారం, సెప్టెంబర్ 22 (వేదిక: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం)
విశాఖపట్నం-మంగళవారం, సెప్టెంబర్ 23 (వేదిక: వైశాఖి ఫంక్షన్ హాల్స్)
విజయవాడ-బుధవారం, సెప్టెంబర్ 24 (వేదిక: ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ సెమినార్ హాల్)
తిరుపతి-గురువారం, సెప్టెంబర్ 25 (వేదిక: ఎస్వీవర్సిటీ సెనేట్ హాల్)
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సమస్యలపై ‘సాక్షి’ సదస్సులు
Published Sun, Sep 21 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement