సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో పర్యావరణహిత విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. శుక్రవారం హైటెక్స్‌లో యూబీఎం ఇండియా సంస్థ, పునరుత్పాదక ఇంధన ఎక్స్‌పో సంయుక్త ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రఘుమారెడ్డి మాట్లాడుతూ.. పునరుత్పాదక విద్యుత్తును ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ముందంజలో ఉన్నాయని అన్నారు.
రాష్ట్ర అవతరణ నాటికి 50 మెగావాట్ల కన్నా తక్కువగా ఉన్న పునరుత్పాదక విద్యుదుత్పత్తి.. ప్రస్తుతం 3,617 మెగావాట్లకు చేరిందన్నారు. 3,336 మెగావాట్ల సౌర ఆధారిత విద్యుదుత్పత్తి సామర్థ్యంతో రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు తెలిపారు. రూఫ్‌టాప్ సౌర విద్యుదుత్పాదన ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సౌర విధానం వినియోగదారులకు చాలా అనుకూలంగా, పారదర్శకంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, యూబీఎం ఎండీ యోగేశ్ ముద్రాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment