Raghuma reddy
-
అర్ధరాత్రి కరెంట్ కట్ చేస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్ బిల్లులు చెల్లించాలి, లేకుంటే రాత్రిపూట విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని’ పేర్కొంటూ వినియోగదారులకు కొందరు వ్యక్తులు ఎస్ఎంఎస్లు/ఫోన్ కాల్స్ చేస్తున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిని నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు, డిబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల సమాచారం, ఓటీపీలను తెలపవద్దని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. ఎవరైనా ఈ సమాచారం అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సైబర్ మోసగాళ్లు వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను డ్రా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు/ చెల్లింపుల కోసం తమ సిబ్బంది వినియోగదారుల బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వివరాలు అడగరని స్పష్టం చేశారు. బిల్లు చెల్లించిన రసీదు మాత్రమే అడుగుతారని, బిల్లు చెల్లింపులు జరపడానికి ఎలాంటి వెబ్సైట్ లింకులను ఎస్ఎంఎస్ ద్వారా తాము పంపమని స్పష్టం చేశారు. బిల్లు చెల్లించినా, విద్యుత్ బిల్లు పెండింగ్ ఉందని ఎవరైనా వ్యక్తులు ఫోన్/మెసేజ్ చేస్తే.. బిల్లుల చెల్లింపు వివరాలను సంస్థ వెబ్ సైట్ www. tssouthernpower. com లేదా టీఎస్ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో చెక్‌చేసుకోవచ్చని సూచించారు. ఏమైనా తేడాలుంటే ఆన్లైన్ ద్వారా సంస్థను లేదా సంబంధిత సెక్షన్ ఆఫీసర్(అఉ)ని సంప్రదించి సరిచూసుకోవాలని కోరారు. -
ఒక్క బిల్లు కట్టకున్నా కనెక్షన్లన్నీ కట్
సాక్షి, హైదరాబాద్: ఒకే ఇంట్లో ఒకటికి మించి విద్యుత్ కనెక్షన్లు ఉన్న సందర్భంలో ఏ ఒక్క కనెక్షన్ బిల్లు చెల్లించకపోయినా, మిగిలిన అన్ని కనెక్షన్లను కట్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుడమారెడ్డి ఆదేశించారు. సంస్థ పరిధిలోని వేర్వేరు చోట్ల ఎవరైనా విద్యుత్ కనెక్షన్లు కలిగి ఉండి, అందులో ఏ ఒక్క కనెక్షన్‌కు బిల్లు చెల్లించకున్నా అన్ని చోట్లా కనెక్షన్లను కట్ చేయాలన్నారు. ఆయా గృహాలను క్షేత్రస్థాయి సి బ్బంది ప్రతి నెలా తనిఖీ చేసి వేరే కనెక్షన్లుంటే తొల గించాలన్నారు. నష్టాల నుంచి గట్టెక్కడానికి తీసు కోవాల్సిన చర్యలతో ఆయన తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రూ.2,687 కోట్ల నష్టాలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. పాత బిల్లు సవరించి మళ్లీ బిల్లు.. ♦కార్యాలయాలు/వాణిజ్య అవసరాలకు గృహ కేటగిరీ కనెక్షన్లు జారీ చేయొద్దు. ఎక్కడైనా జారీ చేసినట్టు గుర్తిస్తే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీకుంటారు. పాత బిల్లులను సవరించి వినియోగదారుల నుంచి వాణిజ్య కేటగిరీ కింద మళ్లీ వసూలు చేస్తారు. ♦ప్రత్యేక వంట గది లేకుంటే గృహాలకు అదనపు విద్యుత్ కనెక్షన్ జారీ చేయరాదు. అలా గుర్తిస్తే బాధ్యులైన సిబ్బందిపై చర్యలతో పాటు ఆ కనెక్షన్లను క్లబ్ చేసి కొత్త శ్లాబుల కింద పాత బిల్లులను సవరించి మళ్లీ వసూలు చేస్తారు. ♦డెవలప్మెంట్ చార్జీలు, ఫిక్స్డ్ చార్జీల వసూళ్ల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఆర్నెల్లకో సారి ఎల్టీ వినియోగదారులకు అదనపు/అన ధికార లోడ్ క్రమబద్ధీకరణ కోసం నోటిసులివ్వా లి. కనెక్షన్ లోడ్‌కి మించి విద్యుత్ వాడుతున్నట్టు గుర్తిస్తేనే ఈ చార్జీలను విధించనున్నారు. -
‘అందుకే కరెంటు బిల్లులు పెరిగాయి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు పెంచలేదని, ఉన్న బిల్లుల ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నామని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నగరంలో మొత్తం 95 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఏప్రిల్, మే నెల వరకు లాక్డౌన్ కారణంగా పాత బిల్లు ప్రకారం వసూలు చేశాం. ఈ నెల ఇంటింటికి వెళ్లి రీడింగ్ తీసి బిల్లులు ఇస్తున్నాం. ఈ సమ్మర్లో విద్యుత్ వినియోగం పెరిగిన కారణంగా వినియోగదారులకు స్లాబులు మారాయి. 13 శాతం అదనంగా స్లాబులు పెరిగాయి. గృహ వినియోగం పెరిగింది కాబట్టే బిల్లులు పెరిగాయి. అందుకు అనుగుణంగానే చార్జీలు వచ్చాయి. ఏప్రిల్‌లో 40 శాతం, మే నెలలో 60 శాతం బిల్లులు మాత్రమే వినియోగదారులు చెల్లించారు. ( టెన్త్ పరీక్షలు హైకోర్టు గ్రీన్ సిగ్నల్) అయితే గతంలో రీడింగ్ ఈ నెల రీడింగ్ తీసిన తరువాత మధ్యలో వాడిన కరెంట్ మొత్తానికి మీరు కట్టిన బిల్లులో తీసివేసి మాత్రమే బిల్లు వచ్చింది. రీడింగ్‌లో గానీ, బిల్లులో గానీ ఎక్కడా తప్పిదాలు జరగలేదు. న్యూస్ పేపర్లో.. వాట్సాప్‌లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి వాస్తవం కాదు. గత ఏడాది కంటే ఈ ఏడాది కరెంట్ వినియోగం 15 శాతం పెరిగింది. ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకే యావరేజ్‌గా బిల్లులు వసూలు చేశాం. ఎక్కడా తప్పిదాలు జరగలేదు. ఒకవేళ జరిగితే దాన్ని మేము పరిష్కరిస్తాం’’ అని అన్నారు. -
మూడేళ్లు ఒకే చోట ఉంటే బదిలీ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపి ణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో పనిచేస్తున్న ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెర లేచింది. 2018 మే 31 నాటికి ప్రస్తుత స్థానంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసు కున్న వారితో పాటు 2015–16లో జరిగిన సాధారణ బదిలీల్లో స్థానచలనం పొందిన ఉద్యోగులు ఈ ఏడా ది సాధారణ బదిలీలకు అర్హులు. ఈ మేరకు ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, పీ అండ్ జీ సర్వీసు విభాగాల ఉద్యోగుల సాధారణ బదిలీలకు మార్గదర్శకాలను ప్రక టిస్తూ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితాలను సంబంధిత డివిజన్/సర్కిల్ కార్యాలయాలు జూన్ 4 నాటికి సిద్ధం చేస్తాయి. జాబితాపై అభ్యంతరాలతో పాటు బదిలీల విజ్ఞప్తులను జూన్ 11లోగా పంపాలి. జూన్ 18న బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. ఆ తర్వాత ఎలాంటి బదిలీ ఉత్తర్వులూ జారీ చేయరాదు. క్రమశిక్షణ/విజిలెన్స్ ప్రాతిపదికన జరిపే బదిలీలు మినహాయింపు. స్థాన చలనం పొందిన వారిని జూన్ 25లోగా రిలీవ్ చేయాలి. ఇంజనీరింగ్, అకౌంట్స్ ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాలు ♦ సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈలను సర్కిల్ పరిధి లోని అదే డివిజన్ లేదా ఇతర డివిజన్‌కు సంబంధిత సూపరింటెండింగ్ ఇంజనీర్లు బదిలీ చేయాలి ♦ ఏఈ/ఏఈఈ (సివిల్)లను సర్కిల్/జోన్ పరిధిలోని ఇతర స్థానానికి కార్పొరేట్ కార్యాలయం (సీఓ) బదిలీ చేస్తుంది. సాధ్యం కాకుంటే ప్రస్తుత స్థానంలో కొనసాగిస్తారు ♦ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లను అదే సర్కిల్ లేదా ఇతర సర్కిల్‌కు సీఓ బదిలీ చేస్తుంది ♦ ఏడీఈ, ఆపై కేడర్; ఏఏఓ, ఆపై కేడర్ ఉద్యోగులను అదే సర్కిల్లో లేదా బయటకు సీఓ బదిలీ చేస్తుంది ♦ జీహెచ్ఎంసీ పరిధిలో పని చేస్తున్న ఏఈ/ఏడీఈ, సమాన కేడర్ ఉద్యోగులను జీహెచ్ఎంసీ యూనిట్‌గా సీఓ బదిలీ చేయనుంది ♦ బదిలీలన్నీ ప్రాధాన్య స్థానం నుంచి ప్రాధాన్యత లేని స్థానానికి, ప్రాధాన్యత లేని స్థానం నుంచి ప్రాధాన్య స్థానానికి జరుగుతాయి. ఆపరేషన్, కమర్షియల్, హెచ్‌టీ మీటర్స్ విభాగాల పోస్టులను ప్రాధాన్య పోస్టులుగా; హైదరాబాద్ దక్షిణ సర్కిల్, మెహిదీపట్నం, వికారాబాద్ సర్కిల్, ట్రూప్ బజార్, బేగంబజార్, ఏసీ గార్డ్స్ సబ్ డివిజన్లను అప్రాధాన్యత ప్రాంతాలుగా చూస్తారు ♦ రిక్వెస్ట్/పరస్పర బదిలీ దరఖాస్తులను జూన్ 11లోగా పంపాలి ♦ మహిళా ఉద్యోగులను ప్రస్తుత ప్రాంతంలోని వేరే పోస్టుకు బదిలీ చేస్తారు. సాధ్యం కాకుంటే సమీపంలోని ఇతర ప్రాంతానికి పంపుతారు ♦ 2019 జూన్ 30లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయరు. -
పర్యావరణహిత విద్యుత్‌ను ప్రోత్సహించండి
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో పర్యావరణహిత విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. శుక్రవారం హైటెక్స్‌లో యూబీఎం ఇండియా సంస్థ, పునరుత్పాదక ఇంధన ఎక్స్పో సంయుక్త ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రఘుమారెడ్డి మాట్లాడుతూ.. పునరుత్పాదక విద్యుత్తును ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ముందంజలో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర అవతరణ నాటికి 50 మెగావాట్ల కన్నా తక్కువగా ఉన్న పునరుత్పాదక విద్యుదుత్పత్తి.. ప్రస్తుతం 3,617 మెగావాట్లకు చేరిందన్నారు. 3,336 మెగావాట్ల సౌర ఆధారిత విద్యుదుత్పత్తి సామర్థ్యంతో రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు తెలిపారు. రూఫ్‌టాప్ సౌర విద్యుదుత్పాదన ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సౌర విధానం వినియోగదారులకు చాలా అనుకూలంగా, పారదర్శకంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీఎస్ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, యూబీఎం ఎండీ యోగేశ్ ముద్రాస్ పాల్గొన్నారు. -
రఘుమారెడ్డికి జాతీయ స్థాయి ఉత్తమ రైతు అవార్డు
మహేశ్వరం: కంది పంట సాగు చేసి నాణ్యతతో కూడిన విత్తనాలను తయారు చేసినందుకు మహేశ్వరం మండలం ఘట్టుపల్లి గ్రామానికి చెందిన రైతు కొరుపోలు రఘుమారెడ్డికి జాతీయ స్థాయి ఉత్తమ రైతు అవార్డు దక్కింది. గురువారం కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడా) వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా నగరంలోని సంతోష్‌నగర్‌లో ఉన్న కృషి వి/êన కేంద్రంలో రఘుమారెడ్డికి అవార్డు అందజేశారు. తన పొలంలో రఘుమారెడ్డి కంది పంట పిఆర్‌జీ 176 రకం, ఉలవలు సీఆర్‌హెచ్‌జీ 04 రకం పండించి అధిక దిగుబడి సాధిచడంతో పాటు నాణ్యతతో కూడిన విత్తనాలను ప్రదర్శించారు. అచ్చు పద్ధతిలో కంది, ఉలవల పంటలు సాగు చేసి ఎకరానికి 5.5 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఈ పంటలను క్రిడా అధికారులు పరిశీలించారని, అందరి కంటే ఎక్కువ దిగుబడి సాధించడంతో పాటు అవి నాణ్యతగా ఉండడంతో రఘుమారెడ్డికి అవార్డు అందజేశామని కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంచాలకురాలు ఉషారాణి చెప్పారు. కొత్త పరిశోధనలతో పంటలను పండించి అధిక దిగుబడి సాధించిన రైతులను ప్రోత్సహించి అవార్డు అందజేసి సత్కరిస్తామని ఆమె తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పది మంది రైతులను ఎంపిక చేసి అవార్డులు అందజేశామన్నారు. ఈ సందర్బంగా అవార్డు పొందిన రైతు రఘుమారెడ్డి మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని, మరిన్ని కొత్త పద్ధతులతో పంటలను సాగు చేస్తానని, తాను పాటించిన పద్ధతులను ఇతర రైతులకు తెలియజేస్తానని అన్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో మహేశ్వరం ఏడీఏ రుద్రమూర్తి, మండల వ్యవసాయాధికారి కోటేశ్వరరెడ్డి, ఏఈఓ రాజు పాల్గొన్నారు. -
నిరంతర విద్యుత్‌పై అనుమానాలొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా దిగ్విజయంగా కొనసాగుతోందని, ఇక ముందు కూడా సరఫరా కొనసాగిస్తామని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్‌రావు పేర్కొన్నారు. రైతుల విద్యుదవసరాలకు అనుగుణంగా, డిమాండ్ ఎంతకు చేరినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై అనుమానాలు అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర కరెంట్ సరఫరాకు శనివారం నాటికి 50 రోజులు నిండిన నేపథ్యంలో రఘుమారెడ్డి, గోపాల్‌రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగానికి మేలు చేయాలన్న సంకల్పంతోనే నిరంతర విద్యుత్‌ను అమలు చేస్తున్నామని, దీనిపై కేంద్రం నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పారు. కేంద్ర నిబంధనల మేరకు ఏ జిల్లాలో ఎన్ని పంపుసెట్లు ఉన్నాయి, వాటికి ఎంత కరెంట్ అవసరమన్న లెక్కలు తీసి... మొత్తంగా కనీసం 5 శాతం సోలార్ వినియోగం ఉండేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇప్పటికే దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 3,200 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి జరుగుతోందని తెలిపారు. 10 వేల మెగావాట్లు దాటిన డిమాండ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా విద్యుత్ వినియోగం 10 వేల మెగావాట్లు దాటిందని రఘుమారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 7.44కి రాష్ట్ర విద్యుత్ వినియోగం 10,002 మెగావాట్లుగా నమోదైంద న్నారు. వేసవి డిమాండ్ 10,600 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని, డిమాండ్ 11,500 మెగావాట్లకు చేరినా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం నిరంతర విద్యుత్, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాల దృష్ట్యా.. డిస్కమ్‌లు మునిగిపోతున్నాయనే ప్రచారం వాస్తవ విరుద్ధమని రఘుమా రెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న విద్యుత్ కోతలను, పవర్ హాలిడేలను తొలగించామని.. ప్రభుత్వం డిస్కమ్‌లకు పూర్తిస్థాయిలో సహకరిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఏడాది రూ.4,777 కోట్ల మేర సబ్సిడీగా ఇచ్చిందని, మరో రూ.2,498 కోట్లను పెట్టుబడిగా పెట్టిందని, నష్టాల దృష్ట్యా రూ.310 కోట్లను అదనంగా ఇచ్చిందని తెలిపారు. రైతులు జాగ్రత్తగా నీటిని వాడాలి రాష్ట్రంలో 23 లక్షల పంపుసెట్లు ఉండగా.. దాదాపు సగం చోట్ల ఆటోస్టార్టర్లను తొలగించారని, మిగతావారు కూడా తొలగించాలని రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు. అవసరమైన నీటికన్నా అధికంగా వాడితే పంటలకు కూడా నష్టమేనని, జాగ్రత్తగా వాడాలని సూచించారు. 24 గంటల కరెంట్ వద్దని వివిధ చోట్ల నుంచి 10 తీర్మానాలు వచ్చాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. -
విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.95 వేల కోట్లు
మార్చి నుంచి నిరంతరం సరఫరా రఘుమారెడ్డి వెల్లడి జగదేవ్‌పూర్: వచ్చే నాలుగేళ్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.95 వేల కోట్లతో యాక్షన్‌ప్లాన్ తయారు చేశామని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి తెలిపారు. అలాగే 5 వేల సౌరవిద్యుత్ మెగావాట్లకు ప్లాన్ చేశామని, మార్చిలోపు కరెంట్ కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018-19కు నాటికి 24 వేల మెగావాట్ల విద్యుత్ కోసం రూ. 95 వేల కోట్లతో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే రూ.5 వేల కోట్లతో సౌరవిద్యుత్ కోసం ప్లాన్ చేస్తున్నామన్నారు. 2 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ కోసం టెండర్లు పిలిచామన్నారు. రూ. 2 వేల కోట్లతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు కరెంట్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. సీఎం నిర్వహించే అయుత చండీయాగానికి విద్యుత్ సమస్య లేకుండా గజ్వేల్ పరిధిలోని అన్ని సబ్స్టేషన్లలో మరమ్మతు పనులు చేశామని చెప్పారు. -
తెలంగాణ ట్రాన్స్‌కో జేఎండీగా శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సి.శ్రీనివాసరావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన టీఎస్ఎస్డీసీఎల్లో ఫైనాన్స్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సెలవులో ఉండటంతో ఇన్ఛార్జీ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసరావు ఇండియన్ రైల్వే అండ్ అకౌంట్స్ సర్వీసెస్‌కు చెందిన అధికారి. ఆర్థిక వ్యవహరాల్లో పట్టు ఉండటంతో ఆయనకు ట్రాన్స్‌కో కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం ట్రాన్స్‌కో ఇన్ఛార్జీ జేఎండీగా పని చేస్తున్న నర్సింగరావు పనితీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఆయనను ట్రాన్స్‌కోలో ఏదో ఒక విభాగానికి డైరెక్టర్‌గా కొనసాగించే అవకాశముంది. -
13 వేల కోట్లు కావాలి
కేంద్రానికి డిస్కంల ప్రతిపాదనలు ‘సాక్షి’తో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణ, పట్టణ విద్యుదీకరణ పనులకు రూ.13 వేల కోట్లు కావాలని కేంద్రాన్ని కోరాలని డిస్కంలు నిర్ణయించాయి. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్‌ల నుంచి ఈ నిధులు కేటాయించాలని కోరనుంది. ఇందుకు ఈ నెలాఖరున ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ రఘుమారెడ్డి తెలిపారు. ఈ పథకాల విధి విధానాల ఖరారుపై ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరై వచ్చిన అనంతరం ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ పథకాల కింద రూ. 75 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, తెలంగాణలోని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ.13 వేల కోట్ల అంచనాలతో డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి కనీసం రూ.4 వేల కోట్ల నుం చి రూ.5 వేల కోట్లు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రబీ సీజన్, వేసవి అవసరాల దృష్ట్యా సదరన్ రీజియన్‌లో వివిధ కంపెనీల నుంచి 300 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. మే నెలాఖరు వరకు విద్యుత్ కొనుగోలు చేసేలా వివిధ కంపెనీలతో ఈ ఒప్పందం చేసుకున్నామన్నారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న ఎన్టీపీసీ ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సదరన్ రీజియన్‌లో ఎన్టీపీసీ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తును తెలంగాణకు ఇచ్చి.. రత్నగిరి ప్లాంటు విద్యుత్తును వేరే రాష్ట్రాలకు ఇచ్చేలా స్వాపింగ్ కుదిరితే ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన నిర్ణయం మేరకు 500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్లను గురువారం జారీ చేస్తామన్నారు.