సాక్షి, హైదరాబాద్: ఒకే ఇంట్లో ఒకటికి మించి విద్యుత్ కనెక్షన్లు ఉన్న సందర్భంలో ఏ ఒక్క కనెక్షన్ బిల్లు చెల్లించకపోయినా, మిగిలిన అన్ని కనెక్షన్లను కట్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుడమారెడ్డి ఆదేశించారు. సంస్థ పరిధిలోని వేర్వేరు చోట్ల ఎవరైనా విద్యుత్ కనెక్షన్లు కలిగి ఉండి, అందులో ఏ ఒక్క కనెక్షన్‌కు బిల్లు చెల్లించకున్నా అన్ని చోట్లా కనెక్షన్లను కట్ చేయాలన్నారు.
ఆయా గృహాలను క్షేత్రస్థాయి సి బ్బంది ప్రతి నెలా తనిఖీ చేసి వేరే కనెక్షన్లుంటే తొల గించాలన్నారు. నష్టాల నుంచి గట్టెక్కడానికి తీసు కోవాల్సిన చర్యలతో ఆయన తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రూ.2,687 కోట్ల నష్టాలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
పాత బిల్లు సవరించి మళ్లీ బిల్లు..
♦కార్యాలయాలు/వాణిజ్య అవసరాలకు గృహ కేటగిరీ కనెక్షన్లు జారీ చేయొద్దు. ఎక్కడైనా జారీ చేసినట్టు గుర్తిస్తే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీకుంటారు. పాత బిల్లులను సవరించి వినియోగదారుల నుంచి వాణిజ్య కేటగిరీ కింద మళ్లీ వసూలు చేస్తారు.
♦ప్రత్యేక వంట గది లేకుంటే గృహాలకు అదనపు విద్యుత్ కనెక్షన్ జారీ చేయరాదు. అలా గుర్తిస్తే బాధ్యులైన సిబ్బందిపై చర్యలతో పాటు ఆ కనెక్షన్లను క్లబ్ చేసి కొత్త శ్లాబుల కింద పాత బిల్లులను సవరించి మళ్లీ వసూలు చేస్తారు.
♦డెవలప్‌మెంట్ చార్జీలు, ఫిక్స్‌డ్ చార్జీల వసూళ్ల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఆర్నెల్లకో సారి ఎల్టీ వినియోగదారులకు అదనపు/అన ధికార లోడ్ క్రమబద్ధీకరణ కోసం నోటిసులివ్వా లి. కనెక్షన్ లోడ్‌కి మించి విద్యుత్ వాడుతున్నట్టు గుర్తిస్తేనే ఈ చార్జీలను విధించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment