‘అందుకే కరెంటు బిల్లులు పెరిగాయి’ | TSSPDCL CMD Raghuma Reddy Comments On Electricity Bills | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ చార్జీలు పెంచలేదు : రఘుమారెడ్డి

Published Sat, Jun 6 2020 5:14 PM | Last Updated on Sat, Jun 6 2020 5:27 PM

TSSPDCL CMD Raghuma Reddy Comments On Electricity Bills - Sakshi

న్యూస్ పేపర్‌లో.. వాట్సాప్‌లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి వాస్తవం కాదు..

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు పెంచలేదని, ఉన్న బిల్లుల ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నామని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నగరంలో మొత్తం 95 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఏప్రిల్, మే నెల వరకు లాక్‌డౌన్ కారణంగా పాత బిల్లు ప్రకారం వసూలు చేశాం. ఈ నెల ఇంటింటికి వెళ్లి రీడింగ్ తీసి బిల్లులు ఇస్తున్నాం. ఈ సమ్మర్‌లో విద్యుత్ వినియోగం పెరిగిన కారణంగా వినియోగదారులకు స్లాబులు మారాయి. 13 శాతం అదనంగా స్లాబులు పెరిగాయి. గృహ వినియోగం పెరిగింది కాబట్టే బిల్లులు పెరిగాయి. అందుకు అనుగుణంగానే చార్జీలు వచ్చాయి. ఏప్రిల్లో 40 శాతం, మే నెలలో 60  శాతం బిల్లులు మాత్రమే వినియోగదారులు చెల్లించారు. ( టెన్త్‌ పరీక్షలు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌)

అయితే గతంలో రీడింగ్ ఈ నెల రీడింగ్ తీసిన తరువాత మధ్యలో వాడిన కరెంట్ మొత్తానికి మీరు కట్టిన బిల్లులో తీసివేసి మాత్రమే బిల్లు వచ్చింది. రీడింగ్‌లో గానీ, బిల్లులో గానీ ఎక్కడా తప్పిదాలు జరగలేదు. న్యూస్ పేపర్‌లో.. వాట్సాప్‌లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి వాస్తవం కాదు. గత ఏడాది కంటే ఈ ఏడాది కరెంట్ వినియోగం 15 శాతం పెరిగింది. ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకే యావరేజ్‌గా బిల్లులు వసూలు చేశాం. ఎక్కడా తప్పిదాలు జరగలేదు. ఒకవేళ జరిగితే దాన్ని మేము పరిష్కరిస్తాం’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement