ప్రజలపై రూ.18,500 కోట్ల భారం పడకుండా ఆపగలిగాం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించడం బీఆర్‌ఎస్ సాధించిన విజయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల భారం పడకుండా ఆపగలిగి నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ మంగళవారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఈఆర్సీ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు జరపాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
పది సంవత్సరాల్లో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా, కేవలం 10 నెలల్లోనే రూ.18,500 కోట్ల విద్యు త్ చార్జీల పెంపు ప్రతి పాదనలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని ఈఆర్సీని ఒప్పించగలిగినట్టు తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు స్వయంగా తనతోపాటు విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి , ఇతర సీనియర్ నాయకులు రాష్ట్ర ఈఆర్సీని కలిసి విద్యుత్ చార్జీల పెంపును ఆపాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొని ప్రజల తరఫున వాదనలు వినిపించారన్నారు.
కాంగ్రెస్ నేతలు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యా లను, అవినీతిని ఎత్తి చూపినందుకు కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌పైన ఫ్రస్ట్రేషన్, డెస్పరేషన్‌లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ తమపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమేనని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటా యని, కాంగ్రెస్ పార్టీ చేసే వ్యక్తిగత దాడులు, కుట్రలు, ప్రాపగండా, అబద్ధాలను ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment