తెలంగాణ ట్రాన్స్‌కో జేఎండీగా శ్రీనివాసరావు | JMD srinivasa rao to be appointed as Telangana Transco | Sakshi
Sakshi News home page

తెలంగాణ ట్రాన్స్‌కో జేఎండీగా శ్రీనివాసరావు

Published Sat, May 30 2015 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

JMD srinivasa rao to be appointed as Telangana Transco

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సి.శ్రీనివాసరావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన టీఎస్‌ఎస్‌డీసీఎల్‌లో ఫైనాన్స్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సెలవులో ఉండటంతో ఇన్‌ఛార్జీ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసరావు ఇండియన్ రైల్వే అండ్ అకౌంట్స్ సర్వీసెస్‌కు చెందిన అధికారి.

ఆర్థిక వ్యవహరాల్లో పట్టు ఉండటంతో ఆయనకు ట్రాన్స్‌కో కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం ట్రాన్స్‌కో ఇన్‌ఛార్జీ జేఎండీగా పని చేస్తున్న నర్సింగరావు పనితీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఆయనను ట్రాన్స్‌కోలో ఏదో ఒక విభాగానికి డైరెక్టర్‌గా కొనసాగించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement