సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ సర్వశ్రేయోనిధికి ప్రభుత్వం రూ.50 కోట్లు గ్రాంటుగా ప్రకటించింది. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాలను ధూపదీప నైవేద్యాల పథకం కిందకు తేవటం, బలహీన వర్గాల కాలనీల్లో రామాలయాల నిర్మాణం కోసం ఈ నిధులు వినియోగిస్తారు. బలహీన వర్గాల వాడల్లో రామాలయాల నిర్మాణ పనులకు సంబంధించి దాదాపు రూ.43 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో కనీసం రూ.100 కోట్లు కావాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల సీఎంను కోరారు. ఇక యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.232 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సాంస్కృతిక సారథికి రూ.25 కోట్లు అడగ్గా.. రూ.15 కోట్లు ప్రకటించారు.