బంజారాహిల్స్‌ బస్టాపులో పోకిరీ హల్‌చల్ | eve teaser nabbed in banjara hills | Sakshi

బంజారాహిల్స్‌ బస్టాపులో పోకిరీ హల్‌చల్

Oct 27 2015 11:08 AM | Updated on Sep 3 2017 11:34 AM

నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న ఓ బస్ స్టాపులో బస్సు కోసం వేచి చూస్తున్న యువతిని నవీన్ అనే యువకుడు వేధించాడు.

నగరంలో పోకిరీల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. సిటీ బస్సు కోసం వేచి ఉంటున్న యువతులు, మహిళలే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న ఓ బస్ స్టాపులో బస్సు కోసం వేచి చూస్తున్న యువతిని నవీన్ అనే యువకుడు వేధించాడు.

కొంతసేపటి వరకు ఎందుకులే అని ఊరుకున్నా, తర్వాత భరించలేని ఆమె గట్టిగా ఎదురు తిరిగింది. దాంతో స్థానికులు కూడా అతడిని పట్టుకుని, దేహశుద్ధి చేశారు. అనంతరం పోకిరీ నవీన్‌ను పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement