అందరూ బాలీవుడ్‌కు వెళ్లండి | Everyone go to Bollywood | Sakshi
Sakshi News home page

అందరూ బాలీవుడ్‌కు వెళ్లండి

Published Wed, Jul 2 2014 12:19 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అందరూ బాలీవుడ్‌కు వెళ్లండి - Sakshi

అందరూ బాలీవుడ్‌కు వెళ్లండి

చిట్‌చాట్
 
బాలీవుడ్ వెళ్లే వారిని వెళ్లనివ్వండి. నేను మాత్రం అటు వైపు వెళ్లను. ఇక్కడున్న హీరోయిన్లంతా బాలీవుడ్‌కు వెళ్లిపోతే దక్షిణాదిలో నాకు పోటీ ఉండదు. అందుకే అందరినీ గో బేబీ గో అంటూ ప్రోత్సహిస్తున్నా.. అంటూ మురిసిపోతోంది బబ్లీబ్యూటీ సమంత. టాలీవుడ్, కోలీవుడ్‌లో నటించే చాలా మంది హీరోయిన్లు ఉత్తరాది నుంచి వచ్చినవారు కావడంతో వారంతా అంతిమంగా బాలీవుడ్‌లో రాణించాలని లక్ష్యం విధించుకుంటారు. కానీ నేను దక్షిణాది నటిని. కాబట్టి నాకు ఇక్కడే ఉండాలని ఉంది. బాలీవుడ్‌కు వెళ్లాలనే కోరిక, ఆతృత ఎంతమాత్రమూ లేవు. అయితే కచ్చితంగా వెళ్లనని మాత్రం చెప్పలేను..

అని తన అంతరంగాన్ని బయటపెట్టిందీ సుందరి. వరుస షూటింగ్‌లు, విడుదలలు, ఆడియో ఫంక్షన్లతో బిజీగా గడుపుతున్న సమంత ఓ స్టార్ హోటల్‌లో మంగళవారం జరిగిన ‘ఐడియా ఫిల్మ్‌ఫేర్ 2013’ అవార్డులకు నామినేట్ అయిన సినిమాల జాబితాను ప్రకటించే కార్యక్రమంలో పాల్గొంది. ఇప్పటికే రెండు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నానని గుర్తుకు తెచ్చుకుంటూ.. ‘ఈ సారి కూడా చాలా మంది పోటీలో ఉన్నారు. వారందరికీ బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ నటిని ఎంపిక చేసే అవకాశం నాకిస్తే నిత్యామీనన్‌కు అవార్డు ఇస్తా’ అని దక్షిణాది నటీమణులపై తన ప్రేమను చెప్పకనే చెప్పిందీ గ్లామర్ గాళ్.
 
 . . : : సుమన్ రెడ్డి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement