చిన్నారి రమ్య మృతి ఘటనతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయింది. వైన్ షాపులు, బార్, రెస్టారెంట్ల యజమానులతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ సమావేశమయ్యారు. బార్, రెస్టారెంట్లలో లోపలా, బయటా సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. హ్యాపీ హవర్స్ అంటూ డిస్కౌంట్ ఇవ్వొదని హెచ్చరించారు.
దీంతోపాటు మైనర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, వయసు ధ్రువీకరణను పరిశీలించిన తర్వాతే మద్యం అమ్మాలని కమిషనర్ చంద్రవదన్ ఆదేశించారు. ఇటీవల పంజాగుట్టలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన చిన్నారి రమ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే.
రమ్య ఘటనతో ఎక్సైజ్ శాఖ అలర్ట్
Published Fri, Jul 15 2016 4:32 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement