
పన్ను బకాయిలపై కన్ను...
♦ వసూలుకు వాణిజ్యపన్నుల శాఖ ప్రత్యేక ప్రణాళిక
♦ మొత్తం బకాయిలు రూ.4,114 కోట్లు
♦ 2013 ఏప్రిల్ నుంచి రావలసినవే రూ.1,174 కోట్లు
♦ ఖాతాలో జమగాని ఏపీ వాటా రూ.240 కోట్లు
సాక్షి, హైదరాబాద్: బకాయిల వసూలుకు వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మొత్తం రూ.4,114కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.ఏటా పన్ను వసూళ్ల లక్ష్యా న్ని ప్రభుత్వం భారీగా పెంచుతుండగా ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థల బకాయిలు మా త్రం వసూలు కావడంలేదు. అదే సమయం లో కోర్టు కేసుల కారణంగా పేరుకుపోయిన బకాయిలు కూడా వేల కోట్లలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బకాయిల వసూళ్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ప్రత్యేక అధికారాలు ఇవ్వడంతోపాటు వాణిజ్యపన్నుల శాఖలో ప్రస్తు తం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ నెలలోనే కార్యాచరణ అమలు చేసేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రం విడిపోయాక అప్పటి ఏపీ వాణిజ్య పన్నుల శాఖ నుంచి 58:42 ప్రాతిపదికన తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖకు రావలసిన బకాయిలపై సంది గ్ధత కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోని బేవరేజెస్ కార్పొరేషన్ 2014 మే రెవెన్యూ రూ.1,610 కోట్లలో తెలంగాణ వాటా కింద రూ.676 కోట్లు ఇవ్వాలని 23 మే 2014న జారీ చేసిన జీవోలో స్పష్టం చేశారు. అయితే, ఆ మొత్తం ఏపీబీసీఎల్ నుంచి టీఎస్‌బీసీఎల్‌కు రాలేదు. అయి నా జూన్‌లో మే నెలకు సంబంధించిన ఉమ్మ డి రాష్ట్ర పన్ను (వ్యాట్ బై ఎక్సైజ్) రూ.404 కోట్లు తెలంగాణనే చెల్లించింది. ఇందులో ఏపీ 58 శాతం వాటా రూ.240 కోట్లు ఇప్పటి వరకు రాలేదు. రాష్ట్రంలోని డీలర్లు, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు ఏప్రిల్ 2013 నుంచి జూన్ 2015 వరకు చెల్లించాల్సిన బకాయిలే రూ.1,174.44 కోట్లుగా తేలింది. ఈ మొత్తాన్ని వసూలు చేయడం వాణిజ్యపన్నుల శాఖకు తలనొప్పిగా మారింది.
కోర్టు కేసుల్లోని బకాయిలు విలువ రూ.2,700 కోట్లు
వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 600కు పైగా కేసులున్నాయి. గత కొన్నేళ్లుగా కోర్టుల్లో నానుతున్న ఈ కేసుల విలువ ఏకంగా రూ. 2,700 కోట్లు. ఈ కేసుల వాదనకు ప్రముఖ న్యాయవాదులను నియమిస్తే తప్ప బకాయిలు వచ్చే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టులో ఇప్పుడున్న కౌన్సిల్‌తోపాటు ప్రత్యేకంగా అడ్వకేట్లను నియమించాలని నిర్ణయించారు.