చిన్నారి కిడ్నాప్.. గుండెపోటుతో తండ్రి మృతి
- అంత్యక్రియల అనంతరం లభించిన బాలుడి ఆచూకీ
- పోలీసుల అదుపులో నిందితులు
హైదరాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాపయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు కనిపించకపోవడంతో ఆ తండ్రి తెల్లవార్లు గాలించాడు. ఆచూకీ లభిం చకపోవడంతో దిగులు చెంది గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన అంత్యక్రియలు పూర్త రుున కొద్ది సేపటికి ఆ పిల్లాడు పోలీసులకు దొరికాడు. ఈ హృదయ విదారక సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివ రాల ప్రకారం... వినాయక్‌నగర్ ప్రాంతంలో టి.నరేందర్ (39), టి.మాలతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నరేం దర్ టైర్ల కంపెనీలో పనిచేస్తున్నాడు.
చిన్న కుమారుడు నాగచైతన్య (18 నెలలు) శుక్ర వారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా జాడ తెలియక పోవడంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాత్రి తండ్రితో కలిసి వివిధ ప్రాంతాలలో వెతికారు. అరుునా బాలుడి జాడ తెలియకపో వడంతో నరేందర్ ఇంటికి వచ్చి కుప్పకూలాడు. భార్య మాలతి వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే నరేందర్ మృతిచెందారు. బంధు వులు మృతదేహాన్ని పురానాపూల్‌కు తీసుకు వెళ్లి అంతక్రియలు నిర్వహించారు. ఆ తరు వాత కొద్ది సేపటికే బాలుడి ఆచూకీ పోలీసులకు లభించింది.
పోలీసులకు రివార్డు...
16 గంటల్లో కేసును ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్, ఎస్సైలు లక్షీ్ష్మకాంత్, ఎస్‌ఓటి ఎస్సై లాల్, కానిస్టేబుల్ హన్మంతు ఇతర సిబ్బందికి నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
రూ. 20 వేలకు విక్రయం...
ఉడ్డెంగడ్డ ప్రాంతంలోని కల్లు కంపౌండ్‌కు కల్లు తాగేందుకు వచ్చిన కవిత అనే మహిళ ఇంటి ముందు ఆడుకుంటున్న చైతన్యను ఇంటికి తీసుకెళ్లింది. రోడ్డు పక్కన చైతన్య షర్ట్ విప్పి పడేసింది. ఈ దృశ్యాలు మైఫిల్ హోటల్ ప్రాంతంలోని సీసీ కెమె రాలో రికార్డయ్యారుు. వీటిని కానిస్టేబుల్ హన్మంతు గుర్తించి చిన్నారి తల్లికి చూపిం చారు. స్థానికులు కవిత చిరునామా తెలి పారు. అప్పటికే కవిత చైతన్యను తాను పని చేస్తున్న సికింద్రాబాద్‌లోని బాంటియా గార్డెన్ సూపర్‌వైజర్ రాముకు రూ.20 వేలకు విక్రరుుంచింది. రాముకు ముగ్గురు ఆడ పిల్లలే ఉండడంతో మగ పిల్లవాడు ఉంటే తెచ్చి ఇవ్వమని కోరాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్ ప్రాంతంలో కవిత ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో పురానాపూల్ ప్రాంతంలోని రాము ఇంట్లో ఉన్న చైతన్యను స్టేషన్‌కు తరలించారు. కవిత మూడేళ్ల కిందట తన కుమారుడిని రూ.20 వేలకు అమ్మేసింది. మొదటి భర్తతో విడిపోరుు... ప్రస్తుతం మహేశ్‌గౌడ్ అనే మరో వ్యక్తితో జీవిస్తోంది.