Child Kidnapping
-
అప్పు తిరిగి ఇవ్వ లేదని..
కాచిగూడ: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే 12గంటల్లో కేసును చేధించిన కాచిగూడ పోలీసులు చిన్నారిని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించారు. కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు మండలం డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, ఏసీపీ రఘు, ఇన్స్పెక్టర్ చంద్రకుమార్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ఫుట్‌పాత్‌పై పార్వతమ్మ అనే యాచకురాలు తన మనవరాలు(1.5) శ్రీలక్షి్మతో కలిసి నిద్రించింది. మంగళవారం తెల్లవారుఝామున నిద్ర లేచి చూసేసరికి చిన్నారి కనిపించకపోవడంతో కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఓ మహిళ చిన్నారిని తీసుకుని ఆటోలో అఫ్జల్‌గంజ్ వైపు వెళుతున్నట్లు గుర్తించారు. దీంతో డబీర్‌పురా రైల్వే స్టేషన్ సమీపంలో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ చేసింది తానేనని అంగీకరించింది. కామారెడ్డి జిల్లాకు చెందిన యాచకురాలు దాసరి మంజుల భిక్షాటన కోసం నగరానికి రాకపోకలు సాగించేదని, కిడ్నాప్‌నకు గురైన చిన్నారి శ్రీలక్ష్మి తల్లి మమత ఆమెవద్ద రూ.1500 అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతోనే మంజుల పాపను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు ఆమె మరిది మున్నాతో పాటు ఆమె ఇద్దరు బాలలు సహకరించినట్లు గుర్తించారు. చిన్నారిని ఆమె అమ్మమ్మకు అప్పగించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
Hyderabad: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్
అబిడ్స్: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైన ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బేగంబజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరుడి కుమార్తె ప్రగతిని తీసుకొని శనివారం మధ్యాహ్నం కట్టెలమండిలోని పుట్టింటికి వచ్చింది. కాసేపటి తర్వాత ప్రగతి కట్టెలమండి ముత్యాలమ్మ ఆలయం ముందు ఆడుకుంటాన్నంటూ బయటకు వెళ్లింది. ఆమెతో పాటు ప్రియాంక సోదరి కుమారుడైన రుత్విక్ కూడా వెళ్లాడు. రుత్విక్ ఒక్కడే ఇంటికి రాగా ప్రగతి కనిపించలేదు. వెంటనే కుటుంబ సభ్యులు బాలిక కోసం పరిసరాల్లో గాలించి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు రాత్రి వేళ బాలిక కిడ్నాప్ అయ్యిందని గుర్తించారు.ప్రగతిని ఓ గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుంటూ వెంట తీసుకెళ్తున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
హైదరాబాద్: మేడిపల్లిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నెలల చిన్నారిని ఓ దుర్మార్గుల ముఠా అమ్మకానికి పెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. చిన్నారిని అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పీర్జాదిగుడా కార్పొరేషన్ రామకృష్ణ నగర్లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఈ ఘటన జరిగింది. సుమారు నాలుగు లక్షలకు చిన్నారిని ఇప్పిస్తామని డాక్టర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటగా పదివేలు అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంట్
ద హేగ్: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) శుక్రవారం వెల్లడించింది. ఉక్రెయిన్‌లో పిల్లలను అపహరించిన ఘటనల్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యుద్ధనేరాలకు పాల్పడినట్లు గుర్తిస్తూ ఈ వారెంట్ జారీ చేసినట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పిల్లలను ఇలా చట్టవిరుద్ధంగా మరో దేశానికి తరలించడం యుద్ధనేరమేనని పేర్కొంది. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడి కార్యాలయంలో పిల్లల హక్కుల కమిషనర్‌గా పని చేస్తున్న మారియా అలెక్సేయేవ్నాను సైతం అరెస్టు చేయాలంటూ ఐసీసీ వారెంట్ జారీ చేసింది. -
ట్విస్టులే ట్విస్టులు.. కిడ్నాపర్‌ను పట్టించిన స్టిక్కర్.. ఆపరేషన్ ‘నిమ్రా’ సక్సెస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ కరీంనగర్‌క్రైం: నగరంలో ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నాలుగు గంటల్లోనే కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు బాలికను తల్లిఒడికి చేర్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం కరీంనగర్ సీపీ సత్యనారాయణ వెల్లడించారు. నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన మహమ్మద్ కుత్బుద్దీన్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కూతురు నిమ్రా ఉంది. చదవండి: పెంచి, పెళ్లి చేసుకొని.. హతమార్చాడు సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటూ అదృశ్యమైంది. స్థానికం గా గాలించినా ఆచూకీ తెలియలేదు. పాప ఆటోలో వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో కుత్బుద్దీన్ రాత్రి 9.30 గంటలకు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రంయించాడు. ఏసీపీ తుల శ్రీనివాస్ నేతృత్వంలో ఐదు సివిల్, ఒక టాస్క్‌ఫోర్స్ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ, స్థానికుల సమాచారంతో గంట వ్యవధిలోనే పాపను ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్ సంతోశ్ ఇంటిని గుర్తించారు. అతని ద్వారా నిమ్రా కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లోని తన స్నేహితుడు కొలమద్ది రాములు ఇంట్లో ఉంచాడని తెలుసుకున్నారు. అతని ఇంటికి వెళ్లి పాపను అర్ధరాత్రి దాదాపు 12.45 గంటలకు సురక్షితంగా కాపాడారు. ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ తుల శ్రీనివాసరావు, సీఐలు నటేశ్, దామోదర్‌రెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, రహీంపాషా, టీ.మహేశ్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్,లక్ష్మణ్, జ్ఞానేశ్వర్, దేవేందర్, కానిస్టేబుళ్లు బషీర్ అహ్మద్ ఖాన్, రవీందర్, మల్లయ్య, రాజ్‌కిరణ్, బద్రుద్దీన్, మనోహర్‌లను సీపీ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. నిమ్రాను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు మేనమామ అనుకుని ఎక్కిన నిమ్రా సోమవారం రాత్రి 7 గంటలకు అశోక్‌నగర్ ఉండే ఆటోడ్రైవర్ సంతోశ్ వద్దకు ఇద్దరుమహిళలు వచ్చి బీబీఆర్ ఆసుపత్రి వెళ్లేందుకు కిరాయి మాట్లాడుకున్నారు. వారిది చిన్నగల్లీ కావడంతో ఆటో వెళ్లలేదు. రాత్రి 7.25కి ఆటో(టీఎస్ 02యూసీ 3079)ను కుత్బుద్దీన్ ఇంటి ఎదుట నిలిపాడు. బయట ఆడుకుంటున్న నిమ్రా తన మేనమామ ఆటో అనుకుని ఎక్కింది. సంతోశ్ పక్కనే కూర్చుంది. మద్యంమత్తు లో ఉన్న అతనూ చిన్నారి నిమ్రాను వారించలేదు. ఈలోపు మహిళలురాగానే వారిని బీబీఆర్ ఆసుపత్రి వద్ద దించాడు. తరువాత అతనిలో పాపను అమ్మేసి సొమ్ము చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది. కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లోని తన స్నేహితుడు కొలమ ద్ది రాములుకు పాపను అప్పగించాడు. తెల్లవారి పాపను ఎంతోకొంతకు విక్రయించాలని ఇద్దరూ కలిసి అనుకున్నారుు. ఏమీ తెలియనట్లుగా రాత్రి 11.30 గంటలకు సంతోశ్ తిరిగి ఇల్లు చేరాడు. అప్పటికే కాపుకాసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి మొత్తం విషయం కక్కేశాడు. వన్‌టౌన్ పోలీసులు సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేరాత్రి ఖాజీపూర్‌లోని రాములు ఇంటిని చుట్టుముట్టారు. రాత్రి 12.45 గంటలకు ఏసీపీ తుల శ్రీనివాస్, సీఐ నటేశ్, ఎస్సై శ్రీనివాస్‌లు పాపను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. స్టిక్కర్ పీకేసిన సంతోశ్ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నగరంలో ఆటోలపై స్టిక్కర్లు వేశారు. బీబీఆర్ ఆస్పత్రి వద్ద మహిళలను దించిన సమయంలోనూ సంతోశ్ ఆటోపై స్టిక్కర్ ఉంది. పాపను రాములుకు అప్పగించిన తరువాత స్టిక్కర్‌ను తొలగించాడు. ఆటో నంబరు సరిపోలినా.. వెనక స్టిక్కర్ లేదు. కానీ, స్టిక్కర్ తీసేసిన ప్రాంతం జిగటగా ఉండటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదే ఆటో అని నిర్ధారించుకుని సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిమ్రా అదృశ్యమవగానే.. పాప చిత్రం, వివరాలతో పలు మెసేజ్‌లు నగరంలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో వైరలయ్యాయి. దీంతో పలువురు యువకులు స్వచ్ఛందంగా గాలించారు. పాప ఆచూకీ చిక్కిన సమయంలోనూ వీరంతా పోలీసుల వెంటే ఉండటం గమనార్హం -
Visakhapatnam: చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు
ఆరు బయట ఆడుకునే పిల్లలు.. ఆసుపత్రి వద్ద కని పెంచలేని తల్లులు.. నిద్రపోతున్న చిన్నారులు.. పిల్లలు లేని తల్లిదండ్రులు.. ఇది ఓ ముఠా టార్గెట్. చిన్నారులను ఎత్తుకుపోవడం మరొకరికి విక్రయించడం అదికూడా లక్షల్లో.. చాలా కాలంగా సాగుతున్న ఈ అక్రమ వ్యవహారానికి విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. అరకులో జరిగిన ఓ ఉదంతంతో ఈ మొత్తం వ్యవహారానికి బ్రేక్ పడింది. సాక్షి, విశాఖపట్నం: పెందుర్తి ప్రాంతానికి చెందిన నీలాపు రమణి విక్టోరియా ఆసుపత్రి లో సెక్యూర్టీ గార్డుగా పని చేస్తున్నారు. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన పొలమర శెట్టి రమేష్‌తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. వీరిరువురు కలిసి ఆస్పత్రి వద్ద పిల్లలు కలగని తల్లులకు పిల్లలను ఇస్తే డబ్బులు సంపాదించవచ్చని భావించారు. ఆ క్రమంలో ఈ ఏడాది జూన్ నెలలో క్రాంతి అనే వ్యక్తికి ఓ చిన్నారిని అప్పగించారు. దీనికి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ వ్యవహారం లాభదాయకంగా మారడంతో అరకులో అమ్మ, నాన్న పక్కన అర్ధరాత్రి నిద్రపోతున్న ఓ ఆరు నెలల బాబును కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ బాబును మరొకరికి విక్రయించాలని పథకం వేశారు. కానీ నిందితులు బాబును కిడ్నాప్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఓ మొబైల్‌ని కూడా ఎత్తుకుపోయారు. చదవండి: (నాలుగేళ్ల తర్వాత గల్ఫ్ నుంచి ఇంటికి.. 24 గంటలు గడవకముందే..) తమ పక్కన నిద్రిస్తున్న బాబు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరకు పోలీసులు విచారణలో భాగంగా మొబైల్ ఫోన్ కూడా పోయిందని గుర్తించి టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితుల్లో పెందుర్తికి చెందిన నీలపు రమణి సూత్రధారిగా తేలింది. ఆమె తన సన్నిహితుడు పొలమరశేట్టు రమేష్‌తో తెలిసి ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. ఈ వ్యవహారంలో మొత్తం 12 మందికి భాగస్వామ్యం ఉన్నట్టు విశాఖ పోలీసుల గుర్తించారు. నీలపు రమణి, పొలమరశెట్టి రమేష్‌లను అరెస్ట్ చేసి.. నిందితుల నుంచి నాలుగు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇటీవల కాలంలో అరకులోని బాబుతో పాటు మరో నలుగురిని విక్రయించినట్లు తేలడంతో ఆ చిన్నారులను కూడా తల్లిదండ్రులకు అప్పగించారు. -
చిన్న పిల్లల కిడ్నాప్ రాకెట్ అరెస్టు!
సాక్షి, కృష్ణా: చిన్న పిల్లల కిడ్నాప్ రాకెట్‌ను ఇబ్రహీంపట్నం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చిన్నారుల బతుకులు ఛిద్రం చేసేందుకు వెట్టిచాకిరీకి తరలించే ముఠాగుట్టును పోలీసులు రట్టుచేశారు. ఆరుమంది మైనర్ బాలికలు,ఇద్దరు బాలురను అక్రమంగా తరలిస్తున్నారని సీఐడీ ఎస్ఐ ప్రసాద్ సమాచారం ఇవ్వడంతో... బృందాలుగా విడిపోయిన పోలీసులు వలపన్ని ముఠాను పట్టుకున్నారు. జగదల్ పూర్ నుంచి తిరుపతి, తమిళనాడు ప్రాంతాలకి చిన్నారులను తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. మైనర్లను విజయవాడలోని చైల్డ్ లైనుకు పోలీసులు తరలించారు. రాకెట్ వెనక ఎవరెవరున్నారు, ఎప్పటినుంచి పిల్లల తరలింపు కొనసాగిస్తున్నారు అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
వదంతులకు మరో ప్రాణం బలి
సాక్షి, చాంద్రాయణగుట్ట: పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలని అపోహ పడి కర్ణాటకలో జరిగిన దాడిలో ఓ హైదరాబాద్‌వాసి దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ ఎర్రకుంట ప్రాంతానికి చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ మహ్మద్ ఆజం (32), సల్మాన్, నూర్ మహ్మద్, ఖతర్ దేశస్థుడు సాలం స్నేహితులు. సాలం ఖతర్ నుంచి రావడంతో సరదాగా గడిపేందుకు అంతా కలిసి కర్ణాటకలోని బీదర్ జిల్లా ఉద్గీర్‌కు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం సమయంలో స్థానిక చిన్నారులకు విదేశీ చాక్లెట్లిచ్చారు. ఇది చూసిన స్థానికులు వారిని పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలనుకుని మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఆజం అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు నగరంలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆజంకు భార్య, కుమారుడున్నారు. శనివారం సాయంత్రం ఎర్రకుంట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. బాధిత కుటుంబాలను మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పరామర్శించారు. -
పిల్లల కిడ్నాప్ ముఠా సంచారం..!
పిల్లల కిడ్నాప్ ముఠా సంచరిస్తున్నదా..? మాయమాటలు చెప్పి తీసుకెళుతున్నదా..? కింది వార్త చదివిన తరువాత.. ఈ రెండు ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానమే వస్తుంది. కిడ్నాప్ ఇలా... ఖమ్మంక్రైం: ఓ బాలుడిని కొందరు పకడ్బందీగా కిడ్నాప్ చేశారు. అంతే చాకచక్యంగా వారి నుంచి ఆ బాలుడు తప్పించుకున్నాడు. కల్లూరుకు చెందిన గుండ్ర కుటుంబరావు–అరుణ దంపతుల కుమారుడు ప్రమోద్(11), శనివారం సాయంత్రం జ్యూస్ తాగడానికి సెంటర్‌కు వచ్చాడు. అప్పటికే అక్కడ టాటా ఏస్ వాహనంలో ఆగి ఉంది. అందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళ కూర్చున్నారు. ఆ మహిళ.. ‘‘బాబూ..! ఇలా రా...’’ అని పిలిచింది. ప్రమోద్ వెళ్లాడు. ‘‘నీ పేరేమిటి..? ఏం చదువుతున్నావ్..? మీ ఇల్లు ఎక్కడ..? మాకు చూపిస్తావా..? మమ్మల్ని తీసుకెళతావా..?...’’ ఇలా ఏవేవో కబుర్లు చెబుతోంది. ఆ చిన్నారి సమాధానమిస్తున్నాడు. లోపల కూర్చున్న ఆ ఇద్దరు పురుషులు, చుట్టూ పరిసరాలను గమనిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. మాట్లాడుతూనే.. తన చేతిలోని కర్చీఫ్‌ను ఆ చిన్నారి మొహానికి బలంగా అదిమింది. ఆ కర్చీఫ్‌కు అప్పటికే మత్తు మందు పూసి ఉండడంతో ప్రమోద్ వెంటనే స్పహ కోల్పోవడం, అతడిని ఆ ఇద్దరు పురుషులు వాహనంలో ఎక్కించడం.. క్షణాల్లో జరిగిపోయింది. ఇలా తప్పించుకున్నాడు... ఆ వాహనం ఖమ్మం దగ్గరలో ఉండగా ఆ చిన్నారి ప్రమోద్‌కు మెలకువ వచ్చింది. సరిగ్గా ఆ క్షణాన.. ఆ చిన్నారి మెదడు పాదరసంలా చక్కగా పనిచేసింది. వారికి అనుమానం రాకుండా ఉండేందుకుగాను, అలాగే పడుకుని ఉన్నాడు. క్రీగంటితో (చూసీచూడనట్టుగా) ఆ ముగ్గురిని, పరిసరాలను గమనిస్తూనే ఉన్నాడు. ఖమ్మం బస్టాండ్ వద్ద ఆ వాహనం ఆగింది. ఆ ముగ్గురూ అక్కడ టీ తాగుతున్నారు. వారు ఏమరుపాటుగా ఉండడాన్ని గమనించి, నెమ్మదిగా డోర్ తెరుచుకుని తప్పించుకున్నాడు. బిగ్గరగా ఏడుస్తూ స్టేషన్ రోడ్ వైపు పరుగెత్తుతున్నాడు. ఆ ప్రాంతంలోని రాధాకృష్ణ రెడీమేడ్ షాపు యజమాని, సిబ్బంది గమనించి ఆ బాలుడిని ఆపి, ఏమైందంటూ ఆరా తీశారు. భయంతో వణుకుతూనే.. మాటలు తడబడుతూ జరిగినదంతా చెప్పాడు. ఆ షాపు వారు వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. బాలుడితో కలిసి బస్టాండ్ వద్ద వెతికినప్పటికీ కిడ్నాపర్లుగానీ, వారి వాహనంగానీ కనిపించలేదు. ఆ బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్ఐ రాము ఇచ్చిన సమాచారంతో ప్రమోద్ తల్లిదండ్రులు వచ్చారు. బిడ్డడి కోసం చాలాసేపటి నుంచి వెతుకుతున్నామంటూ వారు భోరున విలపించారు. బిడ్డడిని గుండెలకు హత్తుకున్నారు. ఆ బాలుడిని వారికి ఎస్ఐ రాము అప్పగించారు. ఈ బాలుడిని కాపాడిన రాధాకృష రెడీమేడ్ షాపు యజమాని రాధాకృష్ణను ఎస్ఐలు రాము, ప్రభాకర్‌రావు, ప్రమోద్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
నిజమేదో... అబద్ధమేదో..?
విశాఖ క్రైం: నగర శివారు తగరపువలసలో చిన్నపిల్లలను ఎవరో కిడ్నాప్ చేశారంట...! అదిగో అక్కయ్యపాలెంలో కూడా ఎవరో అగంతకుడు బాలికను కిడ్నాప్ చేశాడంట..! కైలాసపురంలో మూడు రోజుల కిందట ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించాడని స్థానికుల ఆరోపణ. నగరంలో బిహార్ గ్యాంగ్ హల్చల్ చేస్తోందంట..! వంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు వారిని ఇంటి నుంచి బయటకు పంపించేందుకే హడలిపోతున్నారు. అయితే ఇందులో ఏది నిజమో..? ఏది అబద్ధమో..? తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. తగరపువలస కూడలిలో ఇద్దరు వ్యక్తులను స్థానికులు శుక్రవారం పట్టుకొని పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చిన ముఠా సభ్యులంటూ దేహశుద్ధి చేశారు. అయితే తెలుగు మాట్లాడడం రాని వీరు మతిస్థిమితం లేకుండా ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా తిరుగుతున్నారని... వీరి గోడు అర్థం చేసుకోలేని వారు కిడ్నాపర్లు దొరికారంటూ ప్రచారం చేశారని కొందరు వివరిస్తున్నారు. అయితే స్థానికులు వీరిని భీమిలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మరువకముందే అక్కయ్యపాలెంలో మరో వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను పట్టుకోవడంతో కలకలం నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి అక్కయ్యపాలెంలోని వివేకానంద ఆస్పత్రి సమీపంలో సైకిల్‌పై వస్తున్న బాలికను శనివారం ఓ వ్యక్తి పట్టుకోవడం... ఆ బాలిక గట్టిగా అరవడంతో స్థానికులు గుర్తించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసుల కు అప్పగించడంతో వారు విచారిస్తున్నారు. సద రు వ్యక్తి వన్‌టౌన్‌లోని కోటవీధిలో నివాసం ఉం టున్నానని, పేరు బెహరా హరిబాబు అని, కొం డా శ్రీను అనే వ్యక్తి వద్ద వ్యాన్ డైవర్‌గా పని చేస్తున్నానని చెబుతున్నాడు. తీరా పోలీసులు కొండా శ్రీనుని పిలిపించగా పది రోజుల కిందటే తన వద్ద పని మానేశాడని స్పష్టం చేశాడు. దీంతో అసలు ఎక్కడి నుంచి సదరు హరిబాబు వచ్చాడో... ఏ ఉద్దేశంతో ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు విచారిస్తున్నారు. అసలేం జరుగుతోంది..! నగరంలో వరుసగా వదంతులు వ్యాప్తి చెందడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క పిల్లల కిడ్నాప్ గ్యాంగ్‌లు ఉన్నాయని, మరో పక్క మనుషులను కిరాతకంగా చంపే గ్యాంగ్‌లు తిరుగుతున్నాయని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ వదంతులకు ఊతమిచ్చేలా కొన్ని ఘటనలూ జరుగుతున్నాయి. మూడు రోజుల కిందట కైలాసపురం సమీపంలోని కొండవాలు ప్రాంతంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట బిహార్ ముఠాకు చెందిన సభ్యుడిని లాసన్స్ బే కాలనీ వద్ద స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడికి సంబంధించిన వివరాలు ఇప్పటి వరకూ పోలీసులూ వెల్లడించలేదు. మరోవైపు తాజాగా శనివారం నరవ శివారు సత్తివానిపాలెంలో ఓ వ్యక్తి జుత్తు విరబూసుకుని అనుమానాస్పదంగా సంచరించడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి ఒడిశాలోని సంబల్పూర్ నుంచి వచ్చిన మానసికరోగి అని అనుమానిస్తున్నారు. అక్కయ్యపాలెంలో పట్టుబడిన వ్యక్తిని విచారిస్తున్నారు. ఇప్పటిౖనా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి నిజానిజాలు ప్రజలకు వెల్లడించి... వారిలోని భయాందోళనలు తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు. వదంతులు నమ్మొద్దు నగరంలో పిల్లలను కి డ్నాప్ చేస్తున్నట్లు వస్తు న్న వార్తలు నమ్మొద్దు. నగరంలోకి ఎటువంటి గ్యాంగ్‌లూ రాలేదు. అ నుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే 100 నం బర్కు డయల్ చేసి సమాచారం ఇవ్వండి. తక్షణమే చర్యలు తీసుకుంటాం. –ఫకీరప్ప, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ -
చిన్నారి కిడ్నాప్.. గుండెపోటుతో తండ్రి మృతి
- అంత్యక్రియల అనంతరం లభించిన బాలుడి ఆచూకీ - పోలీసుల అదుపులో నిందితులు హైదరాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాపయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు కనిపించకపోవడంతో ఆ తండ్రి తెల్లవార్లు గాలించాడు. ఆచూకీ లభిం చకపోవడంతో దిగులు చెంది గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన అంత్యక్రియలు పూర్త రుున కొద్ది సేపటికి ఆ పిల్లాడు పోలీసులకు దొరికాడు. ఈ హృదయ విదారక సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివ రాల ప్రకారం... వినాయక్‌నగర్ ప్రాంతంలో టి.నరేందర్ (39), టి.మాలతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నరేం దర్ టైర్ల కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు నాగచైతన్య (18 నెలలు) శుక్ర వారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా జాడ తెలియక పోవడంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాత్రి తండ్రితో కలిసి వివిధ ప్రాంతాలలో వెతికారు. అరుునా బాలుడి జాడ తెలియకపో వడంతో నరేందర్ ఇంటికి వచ్చి కుప్పకూలాడు. భార్య మాలతి వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే నరేందర్ మృతిచెందారు. బంధు వులు మృతదేహాన్ని పురానాపూల్‌కు తీసుకు వెళ్లి అంతక్రియలు నిర్వహించారు. ఆ తరు వాత కొద్ది సేపటికే బాలుడి ఆచూకీ పోలీసులకు లభించింది. పోలీసులకు రివార్డు... 16 గంటల్లో కేసును ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, ఎస్సైలు లక్షీ్ష్మకాంత్, ఎస్ఓటి ఎస్సై లాల్, కానిస్టేబుల్ హన్మంతు ఇతర సిబ్బందికి నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. రూ. 20 వేలకు విక్రయం... ఉడ్డెంగడ్డ ప్రాంతంలోని కల్లు కంపౌండ్‌కు కల్లు తాగేందుకు వచ్చిన కవిత అనే మహిళ ఇంటి ముందు ఆడుకుంటున్న చైతన్యను ఇంటికి తీసుకెళ్లింది. రోడ్డు పక్కన చైతన్య షర్ట్ విప్పి పడేసింది. ఈ దృశ్యాలు మైఫిల్ హోటల్ ప్రాంతంలోని సీసీ కెమె రాలో రికార్డయ్యారుు. వీటిని కానిస్టేబుల్ హన్మంతు గుర్తించి చిన్నారి తల్లికి చూపిం చారు. స్థానికులు కవిత చిరునామా తెలి పారు. అప్పటికే కవిత చైతన్యను తాను పని చేస్తున్న సికింద్రాబాద్‌లోని బాంటియా గార్డెన్ సూపర్వైజర్ రాముకు రూ.20 వేలకు విక్రరుుంచింది. రాముకు ముగ్గురు ఆడ పిల్లలే ఉండడంతో మగ పిల్లవాడు ఉంటే తెచ్చి ఇవ్వమని కోరాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్ ప్రాంతంలో కవిత ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో పురానాపూల్ ప్రాంతంలోని రాము ఇంట్లో ఉన్న చైతన్యను స్టేషన్‌కు తరలించారు. కవిత మూడేళ్ల కిందట తన కుమారుడిని రూ.20 వేలకు అమ్మేసింది. మొదటి భర్తతో విడిపోరుు... ప్రస్తుతం మహేశ్‌గౌడ్ అనే మరో వ్యక్తితో జీవిస్తోంది. -
చిన్నారుల కిడ్నాప్‌కు యత్నం : దొంగ అరెస్ట్
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు చిన్నారులను కిడ్నాప్‌కు యత్నించిన ఓ దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్లితే...శంషాబాద్ జెండా చౌరస్తాలో సోమవారం ఉదయం అయేషా ఖానం(9), జయానా ఖానం(5), హన్నా(3) అనే ముగ్గురు చిన్నారులు కిరాణా షాపునకు వెళ్తుండగా ఓ వ్యక్తి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో పిల్లలు కేకలు వేయడంతో భయపడిన సదరు వ్యక్తి పిల్లల్ని వదిలి పరారయ్యాడు. గమనించిన స్థానికులు అతన్ని వెంబడించి పట్టుకుని.. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. నిందితుడు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లక్ష్మణాచారిగా గుర్తించారు. చిన్నారుల తండ్రి మహ్మద్ యూసుఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడిని కిడ్నాప్ చేయించిన తల్లి
లింగంపేట,న్యూస్‌లైన్ : అంగన్వాడీ కేంద్రం నుంచి కిడ్నాప్‌నకు గురైన లింగంపేట మండలంలోని బానాపూర్ గ్రామానికి చెందిన ఆల్లశివ సాయి (5) కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. కుమారుడిని కన్నతల్లే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... బానాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సో మవారం మధ్యాహ్నం భోజనం పెడుతున్న సమయం లో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు అంగన్వాడీ కేంద్రంలో చొరబడి ఆల్లశివ సాయిని ఎత్తుకు పోయారని తండ్రి ఆల్ల సంగయ్య తెలిపారు. మధ్యాహ్నం వే ళ తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)కలిగిన గ్లామర్ వాహనంపై ఒక మగ వ్యక్తి, ఇద్దరు మహిళలు ముసుగులు ధరించి వచ్చారని, అందరూ చూస్తుండగానే బాలుడిని అకస్మాత్తుగా ఎత్తుకెళ్లారని గ్రామస్తులు చెప్పారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆయా బాలమణిపై వారు చేయి చేసుకొని బాలుడిని ఎత్తుకెళ్లారని అంగన్వాడీ కార్యకర్త సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. లిం గంపేట ప్రొబెషనరీ ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి కేసును ఛేదించారు. భర్తతో పడిరాక... బాన్సువాడ మండలం బోల్లక్పల్లి గ్రామానికి చెందిన గంగమణికి బానాపూర్‌కు చెందిన ఆల్ల సంగయ్యతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్థల కారణంగా గంగమణి ఇద్దరు పిల్లలతో కలిసి ఎనిమిది నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల సంగయ్య అత్తగారింటి వద్ద ఉన్న తన కుమారుడు శివసాయిని బలవంతంగా ఇంటికి తెచ్చుకున్నాడు.అప్పటి నుంచి బాలుడు తండ్రి వద్దనే ఉంటున్నాడు. భర్త నుంచి దూరంగా ఉంటున్న గంగమణే బాలుడిని అంగన్వాడీ కేంద్రం నుంచి కిడ్నాప్ చేయించిందని ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కానిస్టేబుల్ రఘు, హోంగార్డు యాదయ్య బోలక్‌పల్లిలో గంగమణి ఇంటి వద్ద శివసాయిని పట్టుకుని గంగమణిని అదుపులోకి తీసుకున్నారు.