శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు చిన్నారులను కిడ్నాప్కు యత్నించిన ఓ దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళ్లితే...శంషాబాద్ జెండా చౌరస్తాలో సోమవారం ఉదయం అయేషా ఖానం(9), జయానా ఖానం(5), హన్నా(3) అనే ముగ్గురు చిన్నారులు కిరాణా షాపునకు వెళ్తుండగా ఓ వ్యక్తి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో పిల్లలు కేకలు వేయడంతో భయపడిన సదరు వ్యక్తి పిల్లల్ని వదిలి పరారయ్యాడు. గమనించిన స్థానికులు అతన్ని వెంబడించి పట్టుకుని.. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. నిందితుడు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లక్ష్మణాచారిగా గుర్తించారు. చిన్నారుల తండ్రి మహ్మద్ యూసుఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారుల కిడ్నాప్‌కు యత్నం : దొంగ అరెస్ట్
Published Mon, Jun 20 2016 10:45 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement