
సాక్షి, కృష్ణా: చిన్న పిల్లల కిడ్నాప్ రాకెట్‌ను ఇబ్రహీంపట్నం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చిన్నారుల బతుకులు ఛిద్రం చేసేందుకు వెట్టిచాకిరీకి తరలించే ముఠాగుట్టును పోలీసులు రట్టుచేశారు. ఆరుమంది మైనర్ బాలికలు,ఇద్దరు బాలురను అక్రమంగా తరలిస్తున్నారని సీఐడీ ఎస్ఐ ప్రసాద్ సమాచారం ఇవ్వడంతో... బృందాలుగా విడిపోయిన పోలీసులు వలపన్ని ముఠాను పట్టుకున్నారు. జగదల్ పూర్ నుంచి తిరుపతి, తమిళనాడు ప్రాంతాలకి చిన్నారులను తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. మైనర్లను విజయవాడలోని చైల్డ్ లైనుకు పోలీసులు తరలించారు. రాకెట్ వెనక ఎవరెవరున్నారు, ఎప్పటినుంచి పిల్లల తరలింపు కొనసాగిస్తున్నారు అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.