విశాఖ క్రైం: నగర శివారు తగరపువలసలో చిన్నపిల్లలను ఎవరో కిడ్నాప్ చేశారంట...! అదిగో అక్కయ్యపాలెంలో కూడా ఎవరో అగంతకుడు బాలికను కిడ్నాప్ చేశాడంట..! కైలాసపురంలో మూడు రోజుల కిందట ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించాడని స్థానికుల ఆరోపణ. నగరంలో బిహార్ గ్యాంగ్ హల్‌చల్ చేస్తోందంట..! వంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు వారిని ఇంటి నుంచి బయటకు పంపించేందుకే హడలిపోతున్నారు. అయితే ఇందులో ఏది నిజమో..? ఏది అబద్ధమో..? తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. తగరపువలస కూడలిలో ఇద్దరు వ్యక్తులను స్థానికులు శుక్రవారం పట్టుకొని పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చిన ముఠా సభ్యులంటూ దేహశుద్ధి చేశారు.
అయితే తెలుగు మాట్లాడడం రాని వీరు మతిస్థిమితం లేకుండా ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా తిరుగుతున్నారని... వీరి గోడు అర్థం చేసుకోలేని వారు కిడ్నాపర్లు దొరికారంటూ ప్రచారం చేశారని కొందరు వివరిస్తున్నారు. అయితే స్థానికులు వీరిని భీమిలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మరువకముందే అక్కయ్యపాలెంలో మరో వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
బాలికను పట్టుకోవడంతో కలకలం
నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి అక్కయ్యపాలెంలోని వివేకానంద ఆస్పత్రి సమీపంలో సైకిల్‌పై వస్తున్న బాలికను శనివారం ఓ వ్యక్తి పట్టుకోవడం... ఆ బాలిక గట్టిగా అరవడంతో స్థానికులు గుర్తించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసుల కు అప్పగించడంతో వారు విచారిస్తున్నారు. సద రు వ్యక్తి వన్‌టౌన్‌లోని కోటవీధిలో నివాసం ఉం టున్నానని, పేరు బెహరా హరిబాబు అని, కొం డా శ్రీను అనే వ్యక్తి వద్ద వ్యాన్ డైవర్‌గా పని చేస్తున్నానని చెబుతున్నాడు. తీరా పోలీసులు కొండా శ్రీనుని పిలిపించగా పది రోజుల కిందటే తన వద్ద పని మానేశాడని స్పష్టం చేశాడు. దీంతో అసలు ఎక్కడి నుంచి సదరు హరిబాబు వచ్చాడో... ఏ ఉద్దేశంతో ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు విచారిస్తున్నారు.
అసలేం జరుగుతోంది..!
నగరంలో వరుసగా వదంతులు వ్యాప్తి చెందడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క పిల్లల కిడ్నాప్ గ్యాంగ్‌లు ఉన్నాయని, మరో పక్క మనుషులను కిరాతకంగా చంపే గ్యాంగ్‌లు తిరుగుతున్నాయని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ వదంతులకు ఊతమిచ్చేలా కొన్ని ఘటనలూ జరుగుతున్నాయి. మూడు రోజుల కిందట కైలాసపురం సమీపంలోని కొండవాలు ప్రాంతంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట బిహార్ ముఠాకు చెందిన సభ్యుడిని లాసన్స్ బే కాలనీ వద్ద స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఆ యువకుడికి సంబంధించిన వివరాలు ఇప్పటి వరకూ పోలీసులూ వెల్లడించలేదు. మరోవైపు తాజాగా శనివారం నరవ శివారు సత్తివానిపాలెంలో ఓ వ్యక్తి జుత్తు విరబూసుకుని అనుమానాస్పదంగా సంచరించడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి వచ్చిన మానసికరోగి అని అనుమానిస్తున్నారు. అక్కయ్యపాలెంలో పట్టుబడిన వ్యక్తిని విచారిస్తున్నారు. ఇప్పటిౖనా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి నిజానిజాలు ప్రజలకు వెల్లడించి... వారిలోని భయాందోళనలు తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు.
వదంతులు నమ్మొద్దు
నగరంలో పిల్లలను కి డ్నాప్ చేస్తున్నట్లు వస్తు న్న వార్తలు నమ్మొద్దు. నగరంలోకి ఎటువంటి గ్యాంగ్‌లూ రాలేదు. అ నుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే 100 నం బర్‌కు డయల్ చేసి సమాచారం ఇవ్వండి. తక్షణమే చర్యలు తీసుకుంటాం.
–ఫకీరప్ప, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్
Comments
Please login to add a commentAdd a comment