లింగంపేట,న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ కేంద్రం నుంచి కిడ్నాప్‌నకు గురైన లింగంపేట మండలంలోని బానాపూర్ గ్రామానికి చెందిన ఆల్లశివ సాయి (5) కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. కుమారుడిని కన్నతల్లే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివరాలు...
బానాపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సో మవారం మధ్యాహ్నం భోజనం పెడుతున్న సమయం లో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు అంగన్‌వాడీ కేంద్రంలో చొరబడి ఆల్లశివ సాయిని ఎత్తుకు పోయారని తండ్రి ఆల్ల సంగయ్య తెలిపారు. మధ్యాహ్నం వే ళ తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)కలిగిన గ్లామర్ వాహనంపై ఒక మగ వ్యక్తి, ఇద్దరు మహిళలు ముసుగులు ధరించి వచ్చారని, అందరూ చూస్తుండగానే బాలుడిని అకస్మాత్తుగా ఎత్తుకెళ్లారని గ్రామస్తులు చెప్పారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆయా బాలమణిపై వారు చేయి చేసుకొని బాలుడిని ఎత్తుకెళ్లారని అంగన్‌వాడీ కార్యకర్త సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. లిం గంపేట ప్రొబెషనరీ ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి కేసును ఛేదించారు.
భర్తతో పడిరాక...
బాన్సువాడ మండలం బోల్లక్‌పల్లి గ్రామానికి చెందిన గంగమణికి బానాపూర్‌కు చెందిన ఆల్ల సంగయ్యతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్థల కారణంగా గంగమణి ఇద్దరు పిల్లలతో కలిసి ఎనిమిది నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల సంగయ్య అత్తగారింటి వద్ద ఉన్న తన కుమారుడు శివసాయిని బలవంతంగా ఇంటికి తెచ్చుకున్నాడు.అప్పటి నుంచి బాలుడు తండ్రి వద్దనే ఉంటున్నాడు. భర్త నుంచి దూరంగా ఉంటున్న గంగమణే బాలుడిని అంగన్‌వాడీ కేంద్రం నుంచి కిడ్నాప్ చేయించిందని ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కానిస్టేబుల్ రఘు, హోంగార్డు యాదయ్య బోలక్‌పల్లిలో గంగమణి ఇంటి వద్ద శివసాయిని పట్టుకుని గంగమణిని అదుపులోకి తీసుకున్నారు.
బాలుడిని కిడ్నాప్ చేయించిన తల్లి
Published Tue, Dec 10 2013 6:33 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement