Lingam Peta
-
తలలేని సీఎం మనకెందుకు?
లింగంపేట (ఎల్లారెడ్డి): దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాటిచ్చారని, వీటిలో ఏ ఒక్కటైనా ఆయన అమలు చేశారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మాట తప్పుడు, మడమ తిప్పుడు కేసీఆర్‌కు పడదని, మాటతప్పితే తల నరుక్కుంటానని చెప్పిన సీఎంకు ఇప్పుడు తల ఉన్నట్టా లేనట్టా అని నిలదీశారు. అందుకే తలకాయ లేని సీఎం కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపించాలని సంజయ్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం బండి సంజయ్ కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అటవీ అధికారులు పాకిస్తాన్, అమెరికా నుంచి రాలేదని, అటవీ, రెవెన్యూ శాఖలతో మాట్లాడి పోడుభూముల సమస్యను పరిష్కంచవచ్చని సూచించారు. ముస్లిం మైనారిటీలు కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నారని, తానెప్పుడూ ఇస్లాం మతాన్ని కించపరలేదని ఆయన తెలిపారు. ధనికరాష్ట్రమైన తెలంగాణను ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రతీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం ఏమీ చేయడంలేదని ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు ఒక వంద పడకల ఆస్పత్రి అని చెప్పి ఇప్పుడు జిల్లాకు వంద మద్యం దుకాణాలు తెరుస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు పాల్గొన్నారు. -
గుట్టుగా నకిలీనోట్ల చలామణి?
లింగంపేట, న్యూస్‌లైన్: లింగంపేట మండల కేంద్రంలో ఐదువందల నకిలీ నోట్ల చలామణి గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2013 అక్టోబర్‌లో ఐదువందల నకిలీనోట్లను చలామణి చేస్తూ లింగంపేటకు చెందిన ఆకుల సత్యం అనే యువకుడు పోలీసులకు చిక్కాడు. దొంగనోట్లపై విచారణ జరిపిన పోలీసులు రూ.1.02 లక్షల విలువైన నకిలీ ఐదువందల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. నకిలీనోట్ల వ్యవహారం సమసి పోయిందని భావిస్తున్న తరుణంలో లింగంపేటకు చెందిన ఓ వ్యాపారి గుట్టుచప్పుడు కాకుండా రూ.5 వందల నకిలీ నోట్లను చలామణి చేస్తున్నాడనీ మళ్లీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం, మక్కల కొనుగోళ్లు చేపట్టే ఓ వ్యాపారి ధాన్యం, మక్కలు విక్రయించిన రైతులకు నకిలీ నోట్లను అంటగడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లింగంపేట మండల కేంద్రానికి చెందిన ఒకరిద్దరు యువకులు నకిలీ నోట్ల చలామణిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లావ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ 5 వందల నోట్ల చలామణి వ్యవహారాన్ని మండల ప్రజలు మరవకముందే, మళ్లీ చలామణి జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏవి అసలు నోట్లో, ఏవి నకిలీ నోట్లో తెలియక ఆందోళన చెందుతున్నారు. వీరు ఈపాటికే సుమారు రూ.15 లక్షల నకిలీ నోట్లను మార్కెట్లో గుట్టుచప్పుడు కాకుండా చలామణి చేసినట్లు సమాచారం. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న నకిలీనోట్ల చలామణిపై పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. -
బాలుడిని కిడ్నాప్ చేయించిన తల్లి
లింగంపేట,న్యూస్‌లైన్ : అంగన్వాడీ కేంద్రం నుంచి కిడ్నాప్‌నకు గురైన లింగంపేట మండలంలోని బానాపూర్ గ్రామానికి చెందిన ఆల్లశివ సాయి (5) కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. కుమారుడిని కన్నతల్లే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... బానాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సో మవారం మధ్యాహ్నం భోజనం పెడుతున్న సమయం లో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు అంగన్వాడీ కేంద్రంలో చొరబడి ఆల్లశివ సాయిని ఎత్తుకు పోయారని తండ్రి ఆల్ల సంగయ్య తెలిపారు. మధ్యాహ్నం వే ళ తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)కలిగిన గ్లామర్ వాహనంపై ఒక మగ వ్యక్తి, ఇద్దరు మహిళలు ముసుగులు ధరించి వచ్చారని, అందరూ చూస్తుండగానే బాలుడిని అకస్మాత్తుగా ఎత్తుకెళ్లారని గ్రామస్తులు చెప్పారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆయా బాలమణిపై వారు చేయి చేసుకొని బాలుడిని ఎత్తుకెళ్లారని అంగన్వాడీ కార్యకర్త సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. లిం గంపేట ప్రొబెషనరీ ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి కేసును ఛేదించారు. భర్తతో పడిరాక... బాన్సువాడ మండలం బోల్లక్పల్లి గ్రామానికి చెందిన గంగమణికి బానాపూర్‌కు చెందిన ఆల్ల సంగయ్యతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్థల కారణంగా గంగమణి ఇద్దరు పిల్లలతో కలిసి ఎనిమిది నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల సంగయ్య అత్తగారింటి వద్ద ఉన్న తన కుమారుడు శివసాయిని బలవంతంగా ఇంటికి తెచ్చుకున్నాడు.అప్పటి నుంచి బాలుడు తండ్రి వద్దనే ఉంటున్నాడు. భర్త నుంచి దూరంగా ఉంటున్న గంగమణే బాలుడిని అంగన్వాడీ కేంద్రం నుంచి కిడ్నాప్ చేయించిందని ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కానిస్టేబుల్ రఘు, హోంగార్డు యాదయ్య బోలక్‌పల్లిలో గంగమణి ఇంటి వద్ద శివసాయిని పట్టుకుని గంగమణిని అదుపులోకి తీసుకున్నారు.