వీసాల గడువు ముగిసినప్పటికీ హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్నవిదేశీయులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు.
వీసా గడువు ముగిసిన విదేశీయుల అరెస్ట్
Published Wed, May 3 2017 11:15 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
హైదరాబాద్: వీసాల గడువు ముగిసినప్పటికీ హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్నవిదేశీయులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం వేకువజామున దాడులు నిర్వహించి వీసా గడువు ముసిగిన 118 మంది విదేశీయులను గుర్తించారు. మెహదీపట్నం, టప్పాచబుత్ర, టోలీచౌకి, లంగర్‌హౌజ్, మంగళ్‌హాట్, గోల్కొండ ప్రాంతాల్లో 15 టాస్క్‌ఫోర్స్ బృందాలు ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించాయి. గుర్తించిన వారిలో సోమాలియా, యెమన్, నైజీరియా, ఖతార్, సౌదీ అరేబియా, అమెరికా దేశాల వారు ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement