సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాలను మరింత మెరుగుపరుస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విశ్రాంత ఉద్యోగ దంపతులు డీలక్స్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించొచ్చు. గతంలో వెసులుబాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకే ఉండేది.
ఇక సూపర్ లగ్జరీ, ఆపై రకం బస్సుల్లో 50 శాతం చార్జితో ప్రయాణించొచ్చు. ఈ వసతి జీవితాంతం ఉంటుంది. విశ్రాంత ఉద్యోగి మరణిస్తే భార్య/భర్తకు జీవితాంతం ఆ వెసులుబాటు వర్తిస్తుంది. సర్వీసులో ఉన్న ఉద్యోగులు మరణిస్తే స్పౌజ్‌కు ఈ వెసులుబాటు అన్ని రకాల సిటీ సర్వీసుల్లో కూడా లభిస్తుంది.
ఆర్టీసీ ‘ఉచిత ప్రయాణం’లో మార్పులు
Published Tue, Jun 7 2016 7:14 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement