హైదరాబాద్: నగరంలో దొంగతనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చోరీలకు పాల్పడే వారు ముఠాలగా ఏర్పడి అందినకాడికి దోచు కెళుతున్నారు. ఇంట్లో ఎవరూ లేనిది గమనించడం, ఆపై ఆ ఇళ్లలో చొరబడి చోరీలకు పాల్పడటం ఈ ముఠాలకు అలవాటైంది. ఇలాంటి ఘటనలు నగరంలో ఏదోచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి.
తాజాగా హైదరాబాద్, సైదరాబాద్ పరిధిలో వరస చోరీలకు పాల్పడుతున్న ముఠాను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకూ ఈ చోరీ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి 13తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
చోరీ ముఠా అరెస్ట్, 13 తులాల బంగారం స్వాధీనం
Published Mon, Dec 30 2013 2:55 PM | Last Updated on Thu, Aug 2 2018 4:05 PM
Advertisement
Advertisement