బాలికలదే హవా
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఫస్టియర్ సెకండియర్ ఫలితాల్లో బాలికలే అత్యధిక ఫలితాలు పొందారు. ఇంటర్ ఫస్టియర్లో 59 శాతం బాలికలు ఫలితాలు సాధించగా.. బాలురు 48శాతమే ఫలితాలు రాబట్టారు. సెకండియర్లో మొత్త ఉత్తీర్ణత శాతం 62.70 ఉండగా.. బాలికలు 67శాతం ఫలితాలు సాధించగా బాలురు 58శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా, రంగారెడ్డి జిల్లా ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో టాప్ స్థానాన్ని సాధించింది.