హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ నెల 9వ తేదీలోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ సిట్ ...సుమారు వందకు పైగా అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. 90 రోజుల్లోగా అభియోగాలు దాఖలు చేయని పక్షంలో నిందితులకు బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉంది. దీంతో నయీం కేసులకు సంబంధించి ఒకేరోజు కోర్టులో అభియోగాలు దాఖలు చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది.
మరోవైపు నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలన్నీ సంచలనాత్మకంగానే ఉన్నాయి. రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల అండతో గ్యాంగ్‌స్టర్ అనేక అరాచకాలకు పాల్పడ్డట్టు వెలుగులోకి వచ్చింది. పార్టీలకతీతంగా కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ పోలీసు బాసులు ఇలా అందరికీ గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడింది.
9లోగా నయీం కేసులో ఛార్జ్షీట్ దాఖలు!
Published Wed, Nov 2 2016 2:38 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
Advertisement
Advertisement