
ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం
శంషాబాద్: బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణి కుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మంగళ వారం ఉదయం షార్జా నుంచి వచ్చిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా ఓ ప్రయాణికుడి లగేజీలో అరకేజీ బరువున్న బంగారు బిస్కెట్లు బయట పడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.