టీచర్ల సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం | Govt failed to solve the teachers problems | Sakshi
Sakshi News home page

టీచర్ల సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం

Published Mon, Mar 28 2016 11:09 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

Govt failed to solve the teachers problems

సాక్షి,హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ వైయస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్(వైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కె. జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. ఓబుళపతిలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిష్కరించాల్సిన సమస్యలల్లో ప్రధానంగా రెండు విడతల డీఏ, సీపీఎస్‌ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు, పదవ పీఆర్సీలోని అనుబంధ జీవోల విడుదల, పీఆర్సీసీలో రావాల్సిన పది నెలల బకాయిలను పీఎఫ్ ఖాతాలో జమ, పండిట్, పీఈటీ పోస్టుల పదోన్నతి, రూ.398లతో పని చేసిన స్పెషల్ టీచర్లకి నోషనల్ ఇంక్రిమెంట్లు, మున్సిపల్ టీచర్ల అంతర్ మున్సిపాలిటీ బదిలీలు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 010 హెడ్ కింద జీతాలు చెల్లింపు, ఏకీకృత సర్వీసు రూల్స్ రాష్ట్రపతి ఆమోదముద్రతో ఎంఈవో, డివైఈవో, లెక్చరర్స్, డైట్ లెక్చరర్ పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మున్సిపల్ పాఠశాలపై విద్యాశాఖ పెత్తనాన్ని సహించం:ఎంటీఎఫ్
మున్సిపల్ పాఠశాలలో విద్యాశాఖ అపాయింట్‌మెంట్ ఇవ్వడం మున్సిపల్ చట్టానికి వ్యతిరేకమని మున్సిపల్ టీచర్ల ఫెడరేషన్(ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి జే. రమేష్‌లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామన్ సర్వీసు విషయంలో కూడా మున్సిపల్ టీచర్లను చేర్చని కారణంగా విద్యాశాఖ ఇచ్చే ఉత్తర్వులు చెల్లవన్నారు. కౌన్సిల్, స్టాండింగ్ కౌన్సిల్‌కు మాత్రమే మున్సిపల్ పాఠశాలలోని టీచర్ల నియామకం, బదిలీ, సర్వీసు క్రమబద్దీకరణ వంటి వాటిని నిర్వహించే అధికారముందని స్పష్టం చేశారు. విద్యాశాఖ పెత్తనం చెల్లాయించాలంటే రాజ్యాంగ సవరణ జరగాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement