సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డిప్యూటీ డీఈవో, ఎంఈవో, డైట్ లెక్చరర్, బీఎడ్ కాలేజీ లెక్చరర్ పోస్టుల్లో ప్రభుత్వ టీచర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న ధర్నా నిర్వహించాలని ప్రభుత్వ టీచర్ల సంఘం (జీటీఏ) నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్‌లో జీటీఏ కార్యవర్గ సమావేశం జరిగింది.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇంత కాలమైనా ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలో విద్యా శాఖ చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాన సురేందర్, మామిడోజు వీరాచారి తెలిపారు.