ఒంటిపూట బడుల రద్దు విడ్డూరం: పీఆర్టీయూ | Half day schools must be continue sayes PRTU | Sakshi
Sakshi News home page

ఒంటిపూట బడుల రద్దు విడ్డూరం: పీఆర్టీయూ

Published Tue, Feb 16 2016 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

Half day schools must be continue sayes PRTU

సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత ఈ వేసవిలో అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తుంటే మరోవైపు విద్యాశాఖ అధికారులు ఒంటిపూట బడులను రద్దు చేస్తామనడం విడ్డూరంగా ఉందని పీఆర్టీయూ టీఎస్ విమర్శించింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు పి.సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరహరి లకా్ష్మరెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రీయ విద్యాలయం మాదిరిగా వచ్చే విద్యా సంవత్సరం సిలబస్‌లు మార్చి 21 నుంచే ప్రారంభించాలని పేర్కొంటున్నందున త్వరితగతిన పుస్తకాలు సరఫరా చేయాలని కోరారు.

 ఒంటిపూట బడులను కొనసాగించాలి: ఎస్టీయూ
 రాష్ట్రంలో వచ్చే వేసవిలో ఒంటిపూట బడులను కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్‌లో ఎస్టీయూ తృతీయ కార్యవర్గ సమావేశం జరిగిన సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించింది. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరింది. సమావేశంలో ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజిరెడ్డి, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement