రేపటితో హజ్‌ దరఖాస్తుల గడువు ముగింపు | hazz tour applications to close tomorrow | Sakshi
Sakshi News home page

రేపటితో హజ్‌ దరఖాస్తుల గడువు ముగింపు

Published Sun, Feb 5 2017 1:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రేపటితో హజ్‌ దరఖాస్తుల గడువు ముగింపు - Sakshi

రేపటితో హజ్‌ దరఖాస్తుల గడువు ముగింపు

చివరి రోజు కౌంటర్లు పెంచుతాం: హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్‌  
సాక్షి, హైదరాబాద్‌: హజ్‌ యాత్ర–2017కు దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 6వ తేదీ సోమవారంతో ముగుస్తుందని రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఏ షుకూర్‌ తెలిపారు. హజ్‌హౌస్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దరఖాస్తుల స్వీకరణకు హజ్‌హౌస్‌లో సరిపడే కౌంటర్లు ఉన్నాయని, సోమవారం దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో మరిన్ని కౌంటర్లు పెంచుతున్నట్లు తెలిపారు.

దరఖాస్తు చేసుకునేవారు పాస్‌పోర్టు కాపీతో పాటు రూ.300 డీడీని ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంక్‌ల ద్వారా తీయాలన్నారు. దీంతోపాటు వెరిఫికేషన్‌ ప్రక్రియ కోసం కూడా కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 16,860 దరఖాస్తులు అందాయని, ఇందులో కేటగిరీ ఏలో (70 ఏళ్లు పైబడిన వారు) 507, కేటగిరీ బీలో (నాలుగోసారి దరఖాస్తు చేసుకున్నవారు) 2,133, కేటగిరీ సీలో (మొదటిసారి దరఖాస్తు చేసుకున్నవారు) 14,220 దరఖాస్తులు అందాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement