మరణిస్తూ.. జీవితాన్నిచ్చాడు...
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అరుున యువకుడి అవయవాలను అతడి తల్లిదండ్రులు సోమవారం దానం చేశారు. పురాణం శ్రీనివాస్, రమాదేవి దంపతులు యూసుఫ్‌గూడలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు శశాంక్ (17) ప్రగతి డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. ఆదివారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆల్విన్ కాలనీలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించగా.. సోమవారం బ్రెరుున్ డెడ్ అని డాక్టర్లు ప్రకటించారు. ఇతరులకు సహాయం చేయాలని తపనపడే కుమారుడి అవయవాలను ‘జీవన్‌దాన్’ సంస్థ ద్వారా దానం చేయాలని అతడి తల్లిదండ్రులు నిర్ణరుుంచారు. అవయవాలను సేకరించిన అనంతరం గుండెను విమానంలో చెన్నైలోని ఫోర్టీస్ మలర్ ఆస్పత్రికి తరలించారు. కుడి కిడ్నీని నగరంలోని అపోలోకు, ఎడమ కిడ్నీని నిమ్స్‌కు, కార్నియాను ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. లివర్‌ను కాంటినెంటల్ ఆస్పత్రిలోనే ఓ రోగికి అమర్చాలని నిర్ణరుుంచారు.
అన్నింట్లోనూ చురుకుదనం
అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవాడు. శశాంక్ మరణించడం చాలా కలచివేసింది. తను ఎన్‌సీసీ క్యాడెట్ కావడంతో ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని తపన పడేవాడు. అందుకే అవయవదానం చేయాలని నిర్ణరుుంచుకున్నాం.
-శశాంక్ తల్లిదండ్రులు