హైదరాబాద్ కు మళ్లీ భారీ వర్ష సూచన | heavy rainfall warning again in hyderabad | Sakshi
Sakshi News home page

‘ఆ మూడు రోజులు పాటు భారీ వర్షాలు’

Published Wed, Sep 21 2016 4:02 PM | Last Updated on Wed, Aug 1 2018 4:01 PM

హైదరాబాద్ కు మళ్లీ భారీ వర్ష సూచన - Sakshi

హైదరాబాద్ కు మళ్లీ భారీ వర్ష సూచన

హైదరాబాద్ : మరో మూడు రోజుల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆ నెల 21 నుంచి 23వ తేదీ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ తూర్పు దిశగా మేఘాలు..... దట్టంగా అలుముకున్నట్టు తెలిసింది. వర్ష ప్రభావం నేపథ్యంలో....అవసరమైతే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక హైదరాబాద్తో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.

కాగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం ఇప్పటికే జలమయంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ వర్ష సూచనతో లోతట్టు ప్రాంత ప్రజలు ప్రజానీకం భయాందోళనలకు గురి అవుతుండగా, అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement