Depression in Bay of Bengal
-
తమిళనాడు, కోస్తాంధ్రాకు భారీ వర్ష సూచన
సాక్షి, చెన్నై/విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతానికి అనుకొని వాయుగుండం కొనసాగుతుంది. చెన్నై తీరానికి 1440 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది. ఈ వాయుగుండం శనివారం తుపాన్‌గా మారనుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుపాన్‌కు ‘ఫణి’ పేరును ఖరారు చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తుపాన్ తీరం దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్ ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. తుపాన్ తీరం దాటే సమయంలో మాత్రం గంటకు 90 నుంచి 115 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాన్ కారణంగా తమిళనాడు, కోస్తాంధ్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 30, మే 1 తేదీల్లో ఆయా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతోపాటు.. అలలు సాధారణం కంటే ఎక్కువగా ఎగసి పడే అకాశం ఉంది. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు తక్షణమే తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. చదవండి: ‘ఫణి’ దూసుకొస్తోంది వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం -
హైదరాబాద్ కు మళ్లీ భారీ వర్ష సూచన
హైదరాబాద్ : మరో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆ నెల 21 నుంచి 23వ తేదీ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ తూర్పు దిశగా మేఘాలు..... దట్టంగా అలుముకున్నట్టు తెలిసింది. వర్ష ప్రభావం నేపథ్యంలో....అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక హైదరాబాద్‌తో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. కాగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం ఇప్పటికే జలమయంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ వర్ష సూచనతో లోతట్టు ప్రాంత ప్రజలు ప్రజానీకం భయాందోళనలకు గురి అవుతుండగా, అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
రేపటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు
మిర్యాలగూడలో అధికంగా 9 సెంటీమీటర్లు నమోదు హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు కురిశాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా పేరూరులో 8, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో 7, ఏటూరునాగారం, పినపాకల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. గోల్కొండలో 5, ఇబ్రహీంపట్నం, వెంకటాపురం, దేవరకొండ, నల్లగొండల్లో 4 సెంటీమీటర్ల వంతున వర్షం కురిసింది. -
బంగాళాఖాతంలో మరో వాయుగుండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయానికి వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం శనివారం వెల్లడించింది. అది చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరదిశగా కదులుతుందని పేర్కొంది. ఆ వాయుగుండం ఈ రోజు తీవ్రవాయుగుండంగా మారి రేపటికి తుపాన్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దాంతో రాష్ట్రంలోని అన్ని నౌకాశ్రయాల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. -
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం