ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయానికి వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం శనివారం వెల్లడించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయానికి వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం శనివారం వెల్లడించింది. అది చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరదిశగా కదులుతుందని పేర్కొంది. ఆ వాయుగుండం ఈ రోజు తీవ్రవాయుగుండంగా మారి రేపటికి తుపాన్గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దాంతో రాష్ట్రంలోని అన్ని నౌకాశ్రయాల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.