Cyclone Warning Centre
-
నేటి నుంచి ఏపీలో వానలు
సాక్షి, విశాఖపట్నం: నేటి నుంచి రాష్ట్రంలో వర్షాలు జోరందుకోనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది క్రమంగా ఒడిశా, ఏపీ తీరం వైపు పయనించే సూచనలున్నట్లు తెలిపింది. అయితే.. తుపానుగా బలపడే అవకాశాలు లేవనీ.. కేవలం అల్పపీడనం లేదా వాయుగుండంగా మాత్రమే బలపడుతుందని వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో నేడు ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. -
రానున్న 48గంటలు.. వెదర్ అప్డేట్
సాక్షి, హైదరాబాద్ / విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్‌లో గత రాత్రి నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అంతే కాకుండా రోడ్లపై నీరు చేరి గుంతలు పడటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందలకు గురయ్యారు. ఇక ఏపీ విషయానికి వస్తే విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మొత్తం మబ్బులతో ముసురు కప్పేసింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. వాటితో పాటు రానున్న 48 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని కారణంగా ఈ నెల 16న మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. అల్ప పీడనాల కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉత్తర తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55-60 కిలోమీటర్లు, ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
రాష్ట్రంలో తగ్గిన సెగలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. సాధారణంకంటే 2 నుంచి 5 డిగ్రీలకు పైగా క్షీణించాయి. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేసవి ఛాయలు కనిపించలేదు. ఈ పరిస్థితి మరో రెండ్రోజులు కొనసాగవచ్చని వాతావరణ అధికారులు చెబుతున్నారు. నిన్నటి దాకా 43 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు మంగళవారం నాటికి 38 డిగ్రీలకంటే తక్కువకు పడిపోయాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురం(రెంటచింతల)లో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకంటే 3.3 డిగ్రీలు తక్కువ. అనంతపురంలో 34 డిగ్రీలు (5.3 డిగ్రీలు తక్కువ) రికార్డయింది. మిగతా ప్రాంతాల్లో 33, 36 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గత నెలరోజుల్లో ఇంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు తూర్పు, దక్షిణ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో అక్కడక్కడ పిడుగులకు ఆస్కారముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో నర్సీపట్నంలో 6, అచ్చంపేట 5, రాచెర్ల 4, పాడేరు, తనకల్, ఆత్మకూరులలో 3, పొదిలి, పులివెందులల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
కోస్తాంధ్రాలో భారీ వర్షాలు
విశాఖపట్నం: ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అది మరింత బలపడి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మారే అవకాశం ఉందని తెలిపింది. దాంతో ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని పేర్కొంది. దీంతో కోస్తా జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. -
రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కదులుతుందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడకక్కడ తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాని తుపాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. -
బంగాళాఖాతంలో స్థిరంగా వాయుగుండం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా ఉందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం గురువారం వెల్లడించింది. ఆ వాయుగుండం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. అది సాధారణం వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.ఆ వాయుగుండం ప్రభావంతో కోస్తాలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
బంగాళాఖాతంలో మరో వాయుగుండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయానికి వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం శనివారం వెల్లడించింది. అది చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరదిశగా కదులుతుందని పేర్కొంది. ఆ వాయుగుండం ఈ రోజు తీవ్రవాయుగుండంగా మారి రేపటికి తుపాన్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దాంతో రాష్ట్రంలోని అన్ని నౌకాశ్రయాల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో నాలుగు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంవల్ల తూర్పు గాలులు బలంగా ఉంటున్నాయి. ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం లేనప్పటికీ శుక్రవారం నాటి వాతావరణం ఆధారంగా అంచనాలు మారుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి నాటి వాతావరణ పరిస్థితుల్ని బట్టి రానున్న 24గంటల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముంది. ఉత్తర కోస్తాంధ్రలో దాదాపు పొడి వాతావరణమే నమోదు కావచ్చునని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఢిల్లీలోని వాతావరణశాఖ కూడా అల్పపీడనం బలపడే అవకాశాలున్నాయని అంచనా వేసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. -
రాగల 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికా కేంద్రం శనివారం వెల్లడించింది. ఆ రుతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదగా అల్పపీడన ద్రోణి మరింత బలపడిందని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.