నేటి నుంచి ఏపీలో వానలు | Rains in AP from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఏపీలో వానలు

Published Tue, Sep 24 2024 5:30 AM | Last Updated on Tue, Sep 24 2024 5:30 AM

Rains in AP from today

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

సాక్షి, విశాఖపట్నం: నేటి నుంచి రాష్ట్రంలో వర్షాలు జోరందుకోనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్ల­డించింది. ఇది క్రమంగా ఒడిశా, ఏపీ తీరం వైపు పయనించే సూచనలున్నట్లు తెలిపింది. 

అయితే.. తుపానుగా బలపడే అవకాశాలు లేవనీ.. కేవలం అల్పపీడనం లేదా వాయుగుండంగా మాత్రమే బలపడుతుందని వెల్ల­డించింది. అల్పపీడన ప్రభావంతో నేడు ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement