పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా ఉందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం గురువారం వెల్లడించింది. ఆ వాయుగుండం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. అది సాధారణం వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.ఆ వాయుగుండం ప్రభావంతో కోస్తాలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.