విశాఖపట్నం : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలో వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం శ్రీలంక సమీపంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.