సాక్షి, హైదరాబాద్: రుతుపవనాల కారణంగా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ, విదర్భ సరిహద్దుల్లో ఉపరితల ఆవర్తనం ఉండటంతో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలో రెండు మూడు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తద్వారా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. భారత వాతావరణ శాఖ వెల్లడించినట్లుగా జూన్‌లో రుతుపవనాల ప్రభావం తక్కువేనని జూలై నుంచి వర్షాలు ఊపందుకుంటాయని ఆయన చెప్పారు. కాగా, ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా తాండూరులో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వివిధ ప్రాంతాల్లో వర్షపాతం (సెం.మీ.లలో)
ప్రాంతం వర్షపాతం
తాండూరు 7.0
పెద్దేముల్ 6.0
నారాయణ్‌పేట్ 5.0
మాగనూరు 5.0
దామరగిద్ద 4.0
గండేడ్ 4.0
మర్పల్లి 3.0
మక్తల్ 3.0
బొంరాస్‌పేట 3.0
జడ్చర్ల 3.0
సూర్యాపేట 3.0
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
Published Tue, Jun 21 2016 2:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement