యాకుత్‌ఫురా: తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పాతబస్తీలో వారసత్వ కట్టడాల విశిష్టతపై నిర్వహించిన హెరిటేజ్ వాక్ కు పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించింది. చార్మినార్ నుంచి ప్రారంభమైన ఈ వాక్ గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, మీరాలంమండి, పత్తర్‌గట్టి, దివాన్‌దేవిడి, మదీనా బాద్‌షా ఆషూర్‌ఖానా వరకు కొనసాగింది.
ఈ వాక్‌లో పాల్గొన్న పర్యాటకులకు సీనియర్ గైడ్ సూర్యకాంత్ సామ్రాణి కట్టడాల విశిష్టతను వివరించారు.