వారసత్వ సంపదను పరిరక్షించుకుందాం | should save heritage | Sakshi
Sakshi News home page

వారసత్వ సంపదను పరిరక్షించుకుందాం

Published Wed, Apr 19 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

వారసత్వ సంపదను పరిరక్షించుకుందాం

వారసత్వ సంపదను పరిరక్షించుకుందాం

- జిల్లా పర్యాటక అధికారి పిలుపు
- కలెక్టరేట్‌ నుంచి గోల్‌ గుమ్మజ్‌ వరకు హెరిటేజ్‌ వాక్‌

కర్నూలు(అగ్రికల్చర్‌):  వారసత్వ సంపద పరిరక్షణకు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా పర్యాటక అధికారి, ఇంటాక్‌ కర్నూలు చాప్టర్‌ కార్యదర్శి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురష్కరించుకొని మంగళవారం హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా పర్యాటక అధికారి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.  పర్యాటక శాఖ ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు , ఇంటాక్‌ జిల్లా చాప్టర్‌ సంయుక్తంగా సాంస్కృతిక వారసత్వం, సుస్థిర పర్యాటకం కింద మంగళవారం హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించాయి.


కలెక్టరేట్‌ నుంచి ఆర్కియాలజీ మ్యూజియం, తెలుగు బాప్టిస్ట్‌ చర్చి, కోల్స్‌ కాలేజి, కొండారెడ్డిబురుజు మీదుగా గోల్‌ గమ్మజ్‌ వరకు హెరిటేజ్‌ వాక్‌ సాగింది. ఈ సందర్భంగా వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. చారిత్రక కట్టడాలు, కళాఖండాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. గత చరిత్రపై భావి తరాల వారికి అవగాహన ఏర్పాడాలంటే వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రతినిధులు కె. మద్దయ్య,  రాధశ్రీ, మహేంద్రనాయుడు, కృష్ణచైతన్య, చెన్నయ్య, భాస్కర్, విజయకుమార్, ఆదిశేషులు, ప్రకాశ్‌ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement