
ఆంధ్రుల దయాభిక్షతోనే అధికారం
బీజేపీపై సినీ హీరో శివాజీ ధ్వజం
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కేవలం ఏపీ ప్రజల దయాభిక్షతోనే అని.. ఇప్పుడు ఏరు దాటిన తర్వాత 14వ ఆర్థిక సంఘాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యేక ప్రతిపత్తిపై దాటవేత దోరణి ప్రదర్శిస్తున్నారని సినీ హీరో శివాజీ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికి 10 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌కు రూ.1500 కోట్లు మంజూరు చేయించానని చెప్పుకుంటున్నారని అవి కొత్త రాజధానిలో 1000 కిలోమీటర్లు రోడ్డు వేసేందుకు కూడా సరిపోవన్నారు. సుజనాచౌదరి రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు వచ్చాయని చెబుతున్నారని వాటి వివరాలు చెప్పాలన్నారు.