హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ల మార్పుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ నెంబర్ నుంచి టీఎస్‌కు మార్చేందుకు అభ్యంతరాలు స్వీకరించేందుకే జిఓ నెం.3ని విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ఈ అంశంపై అభ్యంతరాలు తెలపాలని హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది. వారంరోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను కోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.