హైకోర్టు విభజనపై రిజర్వులో తీర్పు
హైదరాబాద్ : హైకోర్టు విభజనపై గురువారం వాదనలు పూర్తయ్యాయి. గత తీర్పును పునసమీక్షించాలన్న పిటిషన్పై తీర్పును ఉమ్మడి హైకోర్టు రిజర్వ్లో ఉంచింది. తెలంగాణ ప్రభుత్వ తరఫున ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ తరఫున ఏజీ వాదనలు వినిపించగా, కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు.
హైకోర్టు విభజనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని తెలిపారు. కాగా హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది.