సుజనా చౌదరికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : కేంద్రమంత్రి సుజనా చౌదరికి హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మారిషస్ కమర్షియల్ బ్యాంకు బకాయిల చెల్లింపులో కోర్టు ధిక్కారం నోటీసులు ఇచ్చింది. ఆరుగురు డైరెక్టర్ల సహా సుజనా చౌదరికి కోర్టు నోటీసులు ఇచ్చింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు మారిషస్‌లోని హేస్టియా అనుబంధ కంపెనీ. ఈ కంపెనీ ఎంసీబీ నుంచి రూ.106 కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణానికి సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది.
అయితే తీసుకున్న అప్పును హేస్టియా తీర్చకపోవడంతో హామీగా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ ఆస్తులు అమ్మి తమ అప్పులు తీర్చేలా ఆదేశాలివ్వాలంటూ ఎంసీబీ హైకోర్టులో కంపెనీ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు... మారిషష్ కమర్షియల్ బ్యాంక్‌కు బకాయి పడ్డ రూ.106 కోట్లు చెల్లించాలని గతంలో ఆదేశించింది. అయితే ఆ మొత్తం చెల్లించకపోవడంతో హైకోర్టు ఇవాళ ధిక్కార నోటీసులు జారీ చేసింది.