40 కాలేజీలకు హైకోర్టు నోటీసులు | High Court Notices to 40 Colleges | Sakshi

40 కాలేజీలకు హైకోర్టు నోటీసులు

Published Wed, Jun 14 2017 2:39 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

40 కాలేజీలకు హైకోర్టు నోటీసులు - Sakshi

40 కాలేజీలకు హైకోర్టు నోటీసులు

జీవో 111 పరిధిలో నిర్మాణాలపై ధర్మాసనం 
 
సాక్షి, హైదరాబాద్‌: జీవో 111కు విరుద్ధంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టిన 40 కాలేజీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటితో పాటు అఖిల భారత సాంకేతిక విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, జేఎన్‌టీయూ, హైదరాబాద్‌ పట్ట ణాభివృద్ధి సంస్థ తదితరులకు కూడా నోటీసు లిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, నక్కా బాలయోగితో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులిచ్చింది. 111 జీవో పరిధిలో పలు కాలేజీలు భారీ నిర్మాణాలు చేపట్టినా హెచ్‌ఎండీఏ పట్టించుకోలేదం టూ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ క్వాలిటీ ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి వి.ప్రవీణ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. 
 
నీటి ప్రవాహానికి అడ్డంకులు తగవు... 
పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. పలు కాలే జీలు అధికారంలేని వారి నుంచి అనుమతు లు తీసుకుని జీవో 111 పరిధిలో భారీ భవం తులు నిర్మించాయన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... నీటి ప్రవాహానికి అడ్డంకులు సృష్టించడానికి వీల్లేదంది. నూతన రాజధాని అమరావతి నిర్మాణ ప్రభావం భవిష్యత్తులో కృష్ణానది ప్రవాహంపై ఉండే అవకాశం ఉండొచ్చునని వ్యాఖ్యానించింది. మూడో తరంలో యుద్ధమంటూ వస్తే.. అది నీటి కోసం జరగవచ్చునంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement