Indian Institute of Technology
-
ఐఐటీల్లో మరిన్ని సీట్లు.. కటాఫ్ మేజిక్‌లో మార్పు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లను పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులను విద్యార్థులు కోరుకుంటున్నారని చెప్పాయి. కొన్ని ఆన్లైన్ కోర్సులను కూడా అందించాలనే ప్రతిపాదనను ఐఐటీలు చేశాయి. జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచి్ఛకంగా ఎంచుకున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది కనీసం 4 వేల కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగే వీలుంది. ప్రస్తుతం ఐఐటీల్లో 15 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. ముంబైకి మొదటి ప్రాధాన్యం సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే ముంబై ఐఐటీకి మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఈ కాలేజీని జేఈఈ అడ్వాన్స్ ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిచ్చారు. తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ నిలిచింది. ముంబై ఐఐటీల్లో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని ఐఐటీలు భావిస్తున్నాయి. ఎన్ఐటీల్లో చాన్స్ పెరిగేనా? వచ్చే సంవత్సరం ఎన్ఐటీల్లో కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల కొంతమంది ఐఐటీల్లో చేరతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ 2022లో 1,996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2023లో బాలురకు 3,115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే వీలుంది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్ ను ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం గమనార్హం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. ఈసారి సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
కొత్త సిలబస్‌తో జేఈఈ అడ్వాన్స్డ్–2023
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 పరీక్షలు కొత్త సిలబస్‌తో జరగనున్నాయి. సిలబస్‌లో మార్పులు చేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన జాయింట్ అడ్మిషన్ బాడీ (జేఏబీ) ఇప్పుడు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ jeeadv. ac.in లో పొందుపరిచింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మూడు సబ్జెక్టుల్లోనూ సిలబస్ మార్చింది. 2023 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొత్త సిలబస్‌ను అనుసరించాల్సి ఉంటుంది. పాత సిలబస్‌లోని కొన్ని అధ్యాయాలను తొలగించి, కొత్తగా కొన్ని చేర్చారు. జేఈఈ మెయిన్‌తో అనుసంధానంగా ఉండేలా నూతన సిలబస్‌ను రూపొందించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కోచింగ్ తీసుకోని విద్యార్థులు కూడా విజయం సాధించడం సిలబస్ మార్పు ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. మార్పులు ఇలా జేఈఈ అడ్వాన్స్డ్ గణితంలో కొత్తగా గణాంకాలు (స్టాటిస్టిక్స్)ను జోడించారు. దీనికి బదులుగా త్రిభుజం పరిష్కారం (సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్) అంశాన్ని తొలగించారు. భౌతిక శాస్త్రంలో సెమీకండక్టర్లు, కమ్యూనికేషన్ అంశాలను మినహాయించారు. వీటికి బదులుగా జేఈఈ మెయిన్‌లోని కొన్ని అంశాలు జోడించారు. మెయిన్‌లోని ఫోర్స్డ్ అండ్ డాంపడ్ ఆసిల్లేషన్స్, ఈఎమ్ వేవ్స్, పోలరైజేషన్ అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చారు. అదే విధంగా కెమిస్ట్రీలోనూ మార్పులు చేశారు. సీబీఎస్ఈ విద్యార్థులకు సులువు కొత్త సిలబస్‌లో ఎక్కువగా సీబీఎస్ఈ అంశాలను చేర్చారు. దీనివల్ల సీబీఎస్ఈ విద్యార్థులకు కొంత సులువుగా ఉంటుందని, ఇంటర్మీడియట్ చదివే వారికి కొంత ఇబ్బందికరమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ విద్యార్థులు గతంలోకంటే ఎక్కువ సిలబస్‌ని అనుసరించాల్సి వస్తుందన్నారు. కొత్త సిలబస్ జేఈఈ మెయిన్‌కు అనుసంధానంగా ఉండేలా చేయడం వల్ల మెయిన్‌కి ప్రిపేర్ అయిన వారు అవే అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. సిలబస్‌ను పెంచినప్పటికీ, పరీక్ష సులువుగా మారే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. మెయిన్‌లోని అధ్యాయాలు అడ్వా న్స్‌డ్‌లో చేర్చినందున సిలబస్ పెరిగినట్లు పైకి కనిపించినప్పటికీ, అవే అంశాలు కనుక అంతగా భారం ఉండదని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. ఐఐటీలలో వివిధ కోర్సులు చదవాలనుకొనే వారు కొత్త ఫార్మాట్ ఆధారంగా ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. పరీక్షలు ఇలా.. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీఈఈడీ), అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (యూసీఈఈడీ) కింద ఈ కొత్త పేపర్ నమూనా, సిలబస్ ప్రవేశపెట్టినట్లు జేఏబీ ప్రకటించింది. కొత్త విధానంలో ప్రవేశ పరీక్ష పార్ట్–ఎ, పార్ట్–బిలుగా రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్–ఎ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మూడు విభాగాలలో ప్రశ్నలు ఉంటాయి. న్యూమరికల్ ఆన్సర్ టైప్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (ఎన్ఏటీ, ఎంఎస్క్యూ, ఎమ్సీక్యూ) ఉంటాయి. పార్ట్–బి లో రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒకటి డ్రాయింగ్, మరొకటి డిజైన్ ఆప్టిట్యూడ్. పార్ట్ – బి లోని ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించేలా ఇస్తారు. అభ్యర్థులు దానికి సమాధానాన్ని ఇన్విజిలేటర్ అందించిన జవాబు పుస్తకంలో మాత్రమే రాయాలి. ప్రశ్నలకు సంబంధించిన చిత్రాల డ్రాయింగ్ అందులోనే చేయాలి. -
ఐఐటీల్లో మరో 500 సీట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి సీట్లు పెరిగే అవకాశముంది. గతేడాది (2021–22)లో 16,232 సీట్లు ఉండగా, ఈసారి మరో 500 సీట్లు పెరగవచ్చని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడే నాటికి వీటిని జాబితాలో చేరుస్తారని చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐఐటీలు కొత్త కోర్సుల వైపు అడుగులేస్తున్నాయి. పాఠ్యప్రణాళికలోనూ మార్పులు తెస్తున్నాయి. డిమాండ్ ఉన్న, పారిశ్రామిక అవసరాలు తీర్చగలిగే కోర్సులను విద్యార్థుల ముందుకు తెస్తున్నాయి. ఈ క్రమంలో ఐఐటీలు కొన్ని కొత్త కోర్సులను డిజైన్ చేశాయి. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కోర్సులను గతేడాది కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది కూడా మరికొన్ని పరిశోధనాత్మక ప్రాధాన్యం ఉన్న కోర్సుల వైపు అడుగులు వేస్తున్నారు. స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్, మెడికల్ అనుబంధ సాంకేతిక కోర్సుల వైపు ఐఐటీలు మొగ్గు చూపుతున్నాయి. త్వరలో వీటికి అనుమతి వస్తుందని భావిస్తున్నాయి. మరోవైపు ఇతర ప్రాంతాల్లోని ఐఐటీలు కూడా కొత్త కోర్సులను ముందుకు తెస్తున్నాయి. ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక సంస్థలు కూడా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్ కోర్సులకు రూపకల్పన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటీల్లోనే ఈసారి 500 సీట్లు పెరిగే అవకాశం ఉంది. -
ఆన్లైన్ మీటింగ్.. ఇక నో చీటింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: వర్చువల్ సమావేశాలకు అనుమతి లేకుండా రహస్యంగా హాజరయ్యే వారిని గుర్తించొచ్చని పంజాబ్‌లోని రోపర్ ఐఐటీ ప్రొఫెసర్ అభినవ్ ధాల్ తెలిపారు. ‘ఫేక్‌బస్టర్’ అనే ప్రత్యేకమైన డిటెక్టర్‌ను రోపర్ ఐఐటీ, ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎవరినైనా అపఖ్యాతిపాలు చేయడానికి లేదా ఎగతాళి చేయడానికి సోషల్ మీడియాలో నకిలీ ముఖాలతో పోస్టులు పెట్టినా కూడా కనుగొనవచ్చు. ప్రస్తుతం మహమ్మారి కారణంగా, అధికారిక సమావేశాలు చాలావరకు ఆన్లైన్లో జరుగుతున్నాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ సమయంలో ఒకరిస్థానంలో వేరే వాళ్లు పాల్గొన్నా లేదా అక్రమంగా ఉపయోగించుకున్నా సమావేశ నిర్వాహకుడికి ఈ డిటెక్టర్ సాయంతో తెలిసిపోతుంది. ఉదాహరణకు మోసగాడు మీ సహోద్యోగులలో ఒకరి తరపున వెబ్‌నార్ లేదా వర్చువల్ సమావేశానికి హాజరైతే ఈ టూల్ ద్వారా అతణ్ని గుర్తించవచ్చు. ‘‘అధునాతన కృత్రిమ మేధస్సు పద్ధతుల వల్ల సోషల్ మీడియాలో ఎన్నో అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయి. ఇటువంటివి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. మరింత వాస్తవికంగా మారతాయి. ఇలాంటి మోసాలను గుర్తించకపోతే కష్టమే. మోసగాళ్ల వల్ల భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయి’’ అని ఫేక్బస్టర్ను అభివృద్ధి చేసిన నలుగురు వ్యక్తుల బృందంలో ఒకరైన ప్రొఫెసర్ అభినవ్ ధాల్ తెలిపారు. ఈ పరికరం 90 శాతానికి పైగా కచ్చితత్వాన్ని సాధించిందన్నారు. మిగతా ముగ్గురు సభ్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్ రామనాథన్ సుబ్రమణియన్ , ఇద్దరు విద్యార్థులు వినీత్ మెహతా, పారుల్ గుప్తా ఉన్నారు. గత నెలలో అమెరికాలో ఇంటెలిజెంట్ యూజర్ ఇంటర్ఫేసెస్పై నిర్వహించిన 26వ అంతర్జాతీయ సమావేశంలో ‘‘ఫేక్ బస్టర్: ఏ డీప్ ఫేక్స్ డిటెక్షన్ టూల్ ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్ సినారియోస్’’ అనే పత్రాన్ని సమర్పించారు. నకిలీ వార్తలు, అశ్లీలత, ఇతర ఆన్లైన్ విషయాలను వ్యాప్తి చేయడానికి తారుమారు చేసిన మీడియా కంటెంట్‌ను విస్తృతంగా వాడినట్టు గుర్తించామని ప్రొఫెసర్ ధాల్ తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని అన్నారు. ముఖ కవళికలను మార్చగల స్పూఫింగ్ టూల్స్ ద్వారా మోసగాళ్లు ద్వారా వీడియో–కాలింగ్ సమావేశాల్లోకి చొరబడ్డారని ఆయన అన్నారు. ఈ నకిలీ ముఖ కవళికలను గుర్తించడం కష్టమేనని, ఆ వ్యక్తి నిజమైన వారే అనుకుంటామని పేర్కొన్నారు. ఫలితంగా తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయన్నారు. ఇవి కూడా చదవండి: డ్రైవర్ అవసరం లేని డైమ్లర్స్ భారీ ట్రక్ YouTube Shorts: చేస్తున్నారా.. పర్సు నిండుతుందిలెండి! -
ఆన్లైన్లోనే సెమిస్టర్లు
న్యూఢిల్లీ: కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఇకపై పూర్తిగా ఆన్లైన్ ద్వారానే సెమిస్టర్లను నిర్వహించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)– బాంబే నిర్ణయించింది. విద్యాసంవత్సరం ఆలస్యం కాకుండా ఆన్లైన్ ద్వారానే తరగతులు ప్రారంభించేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలోని మిగతా ఐఐటీలు ఇదే విధానాన్ని అనుసరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఐఐటీ–బాంబే డైరెక్టర్ సుభాశీశ్ ఛౌధురి గురువారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ‘సంస్థ సెనేట్‌లో చర్చించాక.. వచ్చే సెమిస్టర్‌ను ఆన్లైన్లోనే చేపట్టాలని నిర్ణయించాం. విద్యార్థుల ఆరోగ్యం, రక్షణ విషయంలో రాజీ పడబోం’అని తెలిపారు. తమ విద్యాసంస్థలో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నందున ఆన్లైన్లో చదువుకునేందుకు అవసరమైనవి సమకూర్చుకునేందుకు వారికి దాతలు ముందుకువచ్చి, సాయం చేయాలని ఛౌధురి కోరారు. విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను సమీక్షిం చేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ సంప్రదింపులు జరుపుతున్న సమయంలో ఐఐటీ–బోంబే ఈ నిర్ణయం తీసుకుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు సాగే సెమిస్టర్‌కు మిగతా ఐఐటీలు అనుసరించే చాన్సుంది. ఈ విషయమై ఐఐటీ–ఢిల్లీకి చెందిన ఒక అధికారి స్పందించారు. ‘విద్యాసంవత్సరాన్ని ఆలస్యం చేయడం తెలివైన పనికాదు. ఎంతకాలం క్యాంపస్‌లో విద్యార్థులు సురక్షితంగా ఉండగలరనేది మనకు తెలియదు. అందుకే, కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులు వాటిని సమకూర్చుకునేందుకు సాయపడుతూ విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టడమే మంచిది’ అని అభిప్రాయపడ్డారు. -
40 కాలేజీలకు హైకోర్టు నోటీసులు
జీవో 111 పరిధిలో నిర్మాణాలపై ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: జీవో 111కు విరుద్ధంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టిన 40 కాలేజీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటితో పాటు అఖిల భారత సాంకేతిక విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, జేఎన్టీయూ, హైదరాబాద్ పట్ట ణాభివృద్ధి సంస్థ తదితరులకు కూడా నోటీసు లిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, నక్కా బాలయోగితో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులిచ్చింది. 111 జీవో పరిధిలో పలు కాలేజీలు భారీ నిర్మాణాలు చేపట్టినా హెచ్ఎండీఏ పట్టించుకోలేదం టూ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ క్వాలిటీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వి.ప్రవీణ్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. నీటి ప్రవాహానికి అడ్డంకులు తగవు... పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. పలు కాలే జీలు అధికారంలేని వారి నుంచి అనుమతు లు తీసుకుని జీవో 111 పరిధిలో భారీ భవం తులు నిర్మించాయన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... నీటి ప్రవాహానికి అడ్డంకులు సృష్టించడానికి వీల్లేదంది. నూతన రాజధాని అమరావతి నిర్మాణ ప్రభావం భవిష్యత్తులో కృష్ణానది ప్రవాహంపై ఉండే అవకాశం ఉండొచ్చునని వ్యాఖ్యానించింది. మూడో తరంలో యుద్ధమంటూ వస్తే.. అది నీటి కోసం జరగవచ్చునంది. -
ఐఐటీలకు కొత్త డైరెక్టర్లు..
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా ఏర్పడిన ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యాసంస్థల డైరెక్టర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌గా కేఎన్.సత్యనారాయణ, పాలక్కాడ్ ఐఐటీ డైరెక్టర్‌గా పీబీ.సునీల్, బిలాయ్– దుర్గ్ ఐఐటీ డైరెక్టర్‌గా ప్రొ.రజత్ మూనా, గోవా ఐఐటీ డైరెక్టర్‌గా బీకే.మిశ్రా, ధార్వాడ్ ఐఐటీ డైరెక్టర్‌గా ప్రొ.శేషు పసుమర్తి ఎన్నికైనట్లు తెలుస్తోంది. వీరంతా ఐదేళ్ల పాటు డైరెక్టర్లుగా కొనసాగనున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నేతృత్వంలో కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిపాదించిన అభ్యర్థుల జాబితా ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశారు. -
ఐఐటీల్లో 5 శాతం సీట్ల పెంపు
⇒ కసరత్తు చేస్తున్న జాయింట్ అడ్మిషన్ బోర్డు ⇒ త్వరలోనే తుది నిర్ణయం ⇒ ఇకపై ఏటా 5% పెంచే యోచన హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో (ఐఐటీ) సీట్లు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ధన్‌బాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ (ఐఎస్ ఎం) సహా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 500లకు పైగా సీట్లను పెంచేందుకు జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. విదేశీ విద్యార్థుల కోసం ఇప్పటికే ప్రతి ఐఐటీలో 10శాతం సీట్లను పెంచాలని ఐఐటీల కౌన్సిల్ నిర్ణయం తీసుకోగా, దేశీయ విద్యార్థుల కోసం మరో 5 శాతం సీట్లను పెం చేందుకు జేఏబీ కసరత్తు చేస్తోంది. దీనిపై ఐఐటీల కౌన్సిల్‌తోనూ సంప్రదింపులు జరుపు తున్నట్లు తెలిసింది. ఈ మేరకు తెలంగాణలోని ఐఐటీ హైదరాబాద్‌లో 10 సీట్లు, ఏపీలోని తిరుపతి ఐఐటీలో 6 సీట్లు పెంచే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసు కోనుంది. 2017–18 విద్యా సంవత్సరంలో పెం చిన సీట్లలో ప్రవేశాలు చేపట్టాలని జేఏబీ భావి స్తున్నట్లు తెలిసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్షకు దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అందు లో టాప్ 2 లక్షల మందిని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అనుమతిస్తోంది. ఇందులో ర్యాంకు సాధించిన 10 వేల మందికిపైగా మాత్రమే ప్రవేశాలు కల్పి స్తోంది. లక్షలాది విద్యార్థులు పోటీపడుతున్నా సీట్లు తక్కువగా ఉండటంతో చాలా మంది నిరాశకు గురి కావాల్సి వస్తోంది. దీంతో ఏటా 5% మేర సీట్లను పెంచడం ద్వారా విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. -
తిరుపతి ఐఐటీకి కేబినెట్ ఓకే
- మరో ఐదింటీకీ పచ్చజెండా.. - ఏపీలో ఎన్ఐటీ ఏర్పాటు సవరణలకూ ఆమోదం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-తిరుపతి), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తిరుపతి సహా పాలక్కడ్, ధార్వాడ్, భిలాయ్, గోవా, జమ్మూల్లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లను ‘ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ చట్టం-1961’లో చేర్చడానికి అనువుగా ఈ చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఐండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఎస్ఎమ్) ధన్‌బాద్‌ను ఐఐటీగా స్థాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2001 ప్రకారం రిజిస్టర్ అయిన ఏపీలోని ఎన్ఐటీ(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఏర్పాటుకు సంబంధించిన(పశ్చిమగోదావరి జిల్లాలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటైంది) సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు: ► ఐదు రాష్ట్రాల్లో గిరిజనుల జాబితాను సవరించి, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త గిరిజన జాతులను గుర్తించాలనే 2 బిల్లులకు ఆమోదం. ► వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే యూపీ, గుజరాత్‌తోపాటు 5 రాష్ట్రాల్లో రూ.10,736 కోట్ల విలువైన వివిధ రైల్వే అభివృద్ధి పనులకు పచ్చజెండా. ► ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ పునర్నిర్మాణంలో భాగంగా.. ఈ సంస్థ తీసుకున్న రూ. 9వేల కోట్ల రుణ మాఫీ ► తపాలా సేవల ఉద్యోగుల కేడర్ సమీక్షకు ఆమోదం. -
ఏపీ, తెలంగాణ ఐఐటీ సీట్లకు కోత
ఏపీ నుంచి 776 మంది, తెలంగాణ నుంచి 770 మందికి సీట్లు మొత్తం 9,974 సీట్లలో 1,965 మంది రాజస్తాన్ నుంచే రెండో స్థానంలో యూపీ 25 శాతం సీట్లు గ్రామీణులకే. కోట(రాజస్తాన్): దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ఈ ఏడాది ప్రవేశాల్లో ఏపీ, తెలంగాణలకు సీట్ల సంఖ్య బాగా తగ్గింది. ఈ ఏడాది అత్యధిక సీట్లను దక్కించుకున్న రాష్ట్రంగా రాజస్తాన్ అగ్రస్థానంలో నిలి చింది. గతేడాది తొలి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ను వెనక్కి నెట్టేసింది. ఐఐటీ ముంబై రూపొందించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2015 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 18 ఐఐటీలలో మొత్తం 9,974 సీట్లు ఉండగా అందులో ఈసారి రాజస్తాన్ నుంచి 1,965మంది విద్యార్థులు సీట్లు సాధిం చారు. 1,259 మంది విద్యార్థులతో యూపీ రెండోస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి 776 మంది విద్యార్థులు ప్రవేశాలు సాధించగా తెలంగాణ నుంచి 770 మంది ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది ప్రవేశాల్లో విద్యార్థుల విద్య, కుటుంబ నేపథ్యాలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏమిటంటే... ►ఈ ఏడాది సీట్లు పొందిన విద్యార్థుల్లో 25 శాతం మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు. వారంతా హిందీ మీడియంలో ప్రాథమికోన్నత చదువు పూర్తి చేసిన వారున్నారు. ►ఈ ఏడాది 900మంది విద్యార్థినులు ఐఐటీలలో సీట్లు పొందారు. ►సీట్లు సాధించిన విద్యార్థుల్లో 888 మంది విద్యార్థుల త ండ్రులు వ్యవసాయదారులుకాగా, 466మంది తండ్రులు ఇంజనీర్లు, 232మంది తండ్రులు డాక్టర్లు, 1,588 మంది తండ్రులు వ్యాపారస్తులు. ► 6,690 మంది విద్యార్థుల తల్లులు ఓ మోస్తరుగా చదువుకున్న గృహిణులు. ►2,989 మంది విద్యార్థుల తండ్రులు ప్రభుత్వోద్యోగులు కాగా 479 మంది విద్యార్థుల తండ్రులు టీచర్లు. ►1,600 మందికిపైగా విద్యార్థుల తండ్రుల వార్షికాదాయం రూ. లక్ష లోపే ఉంది. ► 1,100 మంది విద్యార్థుల తండ్రులు 10వ తరగతి వరకే చదువుకోగా మరో 250 మంది విద్యార్థుల తండ్రులు, 900 మంది విద్యార్థుల తల్లులు నిరక్షరాస్యులు. -
తిరుపతి ఐఐటీ ప్రారంభం
నేటి నుంచి తరగతులు: ఏపీ మంత్రి గంటా తిరుపతి మంగళం: తిరుపతిలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ని రాష్ట్ర మానవ వనరుల ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. సంస్థ 2015-16 విద్యా సంవత్సరం బుధవారంతో ప్రారంభమైందని, గురువారం నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయని గంటా తెలిపారు. 120 మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతారన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఏపీ సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే తిరుపతిలో ఐఐటీ ప్రారంభించారని చెప్పారు. తిరుపతి ఐఐటీని దేశంలోనే ఉన్నతమైన విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రేణిగుంట రోడ్డులోని కృష్ణతేజ విద్యాసంస్థల ప్రాంగణంలో ఐఐటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా, కళాశాలల్లో ర్యాగింగ్‌ను నిరోధించడానికి ప్రస్తుతమున్న చట్టాలను బలోపేతం చేస్తామని మంత్రి చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ వేసి నిజమైన లబ్ధిదారులకే ఆ పథకం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
750కిపైగా మార్కులొస్తేనే ఐఐటీలో సీటు
* ఇంటర్ కటాఫ్ మార్కులను ప్రకటించిన ఐఐటీ బాంబే * జనరల్, ఓబీసీ విద్యార్థులకు 750 మార్కులు * ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 700 మార్కులు రావాల్సిందే సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్లో సాధించి ఉండాల్సిన కటాఫ్ మార్కులను ఐఐటీ బాంబే ప్రకటించింది. ఐఐటీ ప్రవేశాలకు వివిధ రాష్ట్రాల ఇంటర్ బోర్డుల్లో పరిగణనలోకి తీసుకునే కటాఫ్ మార్కులను వెల్లడించింది. బోర్డులవారీగా కటాఫ్ మార్కుల వివరాలను తమ వెబ్సైట్లో (http://jeeadv.iitb.ac.in) పొందుపరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డులు, రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయాలకు (ఆర్జీయూకేటీ) చెందిన విద్యార్థులు సాధించాల్సిన మార్కులను పేర్కొంది. ఇదీ ప్రాతిపదిక.. ఐఐటీలో సీటు పొందాలంటే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతోపాటు ఇంట ర్మీడియట్‌లో టాప్-20 పర్సంటైల్‌లో లేదా జనరల్, ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ (ఎన్సీఎల్) విద్యార్థులు ఇంటర్లో 75 శాతం మార్కు లు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే 70 శాతం మార్కులను సాధించి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కదాని పరిధిలో ఉన్నా చాలు. అలాంటి విద్యార్థులకే వారి జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో ఒక్కో రకమైన మార్కుల విధానం ఉంది. కాబట్టి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి మార్కులను (500) ప్రామాణికంగా తీసుకొని వివిధ ఇంటర్మీడియట్ బోర్డులలో ప్రతి 500 మార్కులకు టాప్-20 పర్సంటైల్ ఉండాల్సిన మార్కులను, 75 శాతం, 70 శాతంతో పరిగణనలోకి తీసుకునే మార్కులను వెల్లడించింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్లో 1000 మార్కుల విధానం ఉంది. వాటి ప్రకారం కాకుండా ప్రతి 500 మార్కుల కు సాధించాల్సిన మార్కులను వెబ్సైట్లో పొందుపరించింది. అయితే రాష్ట్ర విద్యార్థులు ప్రకటిత మార్కులను రెట్టింపు చేసి లెక్కించుకోవాల్సి ఉంటుందని ఐఐటీ నిపుణుడు ఉమాశంకర్ తెలిపారు. అలా లెక్కించిన వివరాలివీ.. -
విశ్లేషణతో విజయ గమ్యానికి..
ప్రస్తుతం ప్రశ్నలు సమకాలీన పరిణామాల ఆధారంగా వస్తున్నాయి. అందువల్ల ఒక అంశంపై మీడియాలో ఎలా చర్చ జరుగుతుందో చూడగలగాలి. దాన్ని విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. ప్రిపరేషన్‌కు ఉపయోగపడే వెబ్సైట్లను గుర్తించాలి. ఇలాచేస్తే విజయం తథ్యం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి ప్రముఖ సంస్థల్లో చదివిన వారే సివిల్స్ సాధించగలరు! ఈ అభిప్రాయం సత్యదూరం. గత పదేళ్ల సివిల్స్ ఫలితాలు, శిక్షణ కేంద్రాల్లోని అభ్యర్థులను పరిశీలిస్తే అన్ని రకాల విద్యాసంస్థల అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్ల దగ్గరి నుంచి మారుమూల ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చదువుకున్న వారు సైతం సక్సెస్‌ను అందుకుంటున్నారు. ఇటీవలి పరిణామాలను చూస్తే దూరవిద్య ద్వారా చదువుకున్న వారు కూడా సర్వీస్ సాధించిన వారిలో ఉన్నారు. ఒక్క ఇంజనీరింగ్‌కు సంబంధించిన వారే కాదు.. లా, సీఏ, మేనేజ్మెంట్, సైన్స్ ఇలా విభిన్న నేపథ్యాల అభ్యర్థులు సివిల్స్‌లో నెగ్గుతున్నారు. విజయం సాధించిన వారిలో ఐఐటీ, ఐఐఎంలలో చదువుకున్న వారుంటే వారికి ఎక్కువ ప్రచారం లభిస్తోంది. దీనివల్ల ఈ సంస్థల్లో చదువుకున్న వారికే సివిల్స్ అనే అపోహ ఉంది.కొత్తగా ప్రవేశపెట్టిన సిలబస్, రెండు ఆప్షన్లను ఒక ఆప్షన్‌కు తగ్గించడం, మారిన ప్రశ్నల సరళి నేపథ్యంలో ఏ అకడమిక్ నేపథ్యం అయినా, ఏ సంస్థలో చదువుకున్నా ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే సివిల్స్ సర్వీస్‌ను చేజిక్కించుకోవచ్చు. మొదట్నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారే సివిల్స్‌లో విజయం సాధించగలరు? సివిల్స్ రాసేవారిలో ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు ఎక్కువగా ఉంటున్న మాట వాస్తవమేగానీ, కేవలం ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు మాత్రమే పరీక్షలో సక్సెస్‌ను సొంతం చేసుకోగలరు అనేది అవాస్తవం. పరీక్ష రాసే వారిలో ఆంగ్ల మాధ్యమం అభ్యర్థులు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి విజయం సాధించిన వారిలో ఎక్కువ మంది వారు ఉండొచ్చు. పూర్తిగా తెలుగు మీడియంలో రాసిన వారు, తెలుగు లిటరేచర్ ఆప్షన్‌తో పరీక్ష రాసిన వారు చాలా మంది విజయం సాధించారు.తెలుగు మీడియం అభ్యర్థులు కోచింగ్ సెంటర్లో చేరినప్పుడు, అక్కడ ఫ్యాకల్టీ ఇంగ్లిష్‌లో చెప్పే పాఠాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి వారు కొంత శ్రమిస్తే తేలిగ్గానే సమస్యను అధిగమించగలరు. ఒకవేళ సివిల్స్ రాస్తే ఐఏఎస్ సాధించాలి. లేదంటే మరేదైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం చూసుకోవడం మేలు. సాధారణంగా సివిల్ సర్వీస్ అనగానే అందరికీ ఐఏఎస్, ఐపీఎస్ కనిపిస్తాయి. కొద్ది మందికి ఇండియన్ ఫారెన్ సర్వీస్‌పై అవగాహన ఉంటుంది. ఆలిండియా సర్వీసులుగా పేర్కొనే వీటిపై అందరికీ కొద్దోగొప్పో అవగాహన ఉందిగానీ, మిగిలిన సర్వీసుల గురించి అంతగా తెలియదు. 23 సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కాకుండా మిగిలిన సర్వీసుల్లో గ్రూప్ ఏ, గ్రూప్ బీ సర్వీసులున్నాయి. ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఈ సర్వీసులకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వ పాలనలో ఆర్థిక సుపరిపాలన కీలకమవుతోంది. మొత్తం అభివృద్ధి అంతా ఆర్థికాభివృద్ధి చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ ఎక్సైజ్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ) వంటి వాటికి ప్రాధాన్యం పెరిగింది. కొందరైతే ఐఆర్ఎస్కు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పలు కీలక స్థానాల్లో ఈ సర్వీసు అధికారులకు స్థానం కల్పిస్తోంది. గ్రూప్ ఏ సర్వీసుల్లో ఉన్నవారు అనేక రంగాల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్తుంటారు. ఉదాహరణకు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్‌కి చెందిన వారికి వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో అవకాశం లభిస్తుంటుంది. కొత్తగా వచ్చిన ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్‌కు కూడా నెమ్మదిగా ప్రాధాన్యం పెరగొచ్చు. అందువల్ల సివిల్స్‌లో ఇతర సర్వీసుల్లోనూ అద్భుతమైన కెరీర్ ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తీవ్ర రాజకీయ ఒత్తిడి ఉంటుంది. అందువల్ల అటువైపు వెళ్లకపోవడం మంచిది? ప్రభుత్వ పాలన అనేది కచ్చితంగా సామాజిక, రాజకీయ వాతావరణంలో ఉంటుంది. ఇది తప్పదు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఒత్తిడిని నెగిటివ్‌గా కాకుండా సకారాత్మకంగా (పాజిటివ్)గా చూడాలి. అప్పుడే సమర్థవంతమైన అధికారిగా ఎదగగలరు. నియమనిబంధనలకు అనుగుణంగా, నేర్పరితనంతో విధులను నిర్వహిస్తూ కెరీర్‌ను అద్భుతంగా మలచుకోవాలి. తమ పనుల్లో రాజకీయ నేతలు ‘ఇంటర్ఫియర్’ అవుతున్నారనుకోకుండా ఇంటరాక్షన్ అవుతున్నారనుకోవాలి. ఇప్పడు రాజకీయ వ్యవస్థలో పరిపక్వత వచ్చింది. అందువల్ల యువత ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లి, విధుల నిర్వహణను సవాలుగా తీసుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి. సివిల్స్‌లో విజయం సాధించాలంటే రోజుకు 17 గంటలు చదవాలి. సివిల్స్ ఒక్కటే కాదు.. ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధించాలంటే పట్టుదల, కృషి అవసరం. అయితే రోజుకు 17 గంటలు చదవితేనే సివిల్స్ సాధించగలం అనేది అపోహ మాత్రమే. మారిన పరీక్ష విధానంలో సమాధానాల గుర్తింపునకు బట్టీ పద్ధతి పనికి రాదు. ప్రాథమిక అంశాలు తెలిసుండి, వాస్తవ సమాజానికి దగ్గరగా ఉండి, మంచి విశ్లేషణా దృక్పథం ఉంటే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాయొచ్చు. ఏడాది పాటు ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే విజయం సాధించేలా ప్రస్తుత పరీక్ష విధానం, ప్రశ్నల సరళి ఉంది. సివిల్స్‌లో విజయం సాధించాలంటే ఢిల్లీలో కోచింగ్ తీసుకోవాల్సిందే! సివిల్స్‌లో విజయం సాధించిన వారందరూ ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న వారే కాదు కదా! ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న వారందరూ విజయం సాధించడం లేదు కదా! కోచింగ్ అనేది ప్రిపరేషన్ సమయాన్ని తగ్గించేందుకు ఉపకరిస్తుంది. ప్రస్తుతం సివిల్స్ శిక్షణ కేంద్రాలు మారిన సిలబస్‌కు అనుగుణంగా బోధనా వసతులను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. విజయానికి అభ్యర్థి స్వీయ సామర్థ్యం ముఖ్యం. తర్వాతే కోచింగ్. ఢిల్లీలోనే కాదు.. తమకున్న వనరులు ఆధారంగా ఎక్కడైనా కోచింగ్ సెంటర్‌ను ఎంపికచేసుకోవచ్చు. మొదట ప్రిలిమ్స్‌పై దృష్టి సారించి, తర్వాత అందులో విజయం సాధిస్తే మెయిన్స్ ప్రిపరేషన్‌ను ప్రారంభిస్తే మంచిది. ఈ రకమైన భావన విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. యూపీఎస్సీ 2015 కేలండర్ ప్రకారం సివిల్స్ ప్రిలిమ్స్‌ను ఆగస్టు 23న నిర్వహిస్తారు. మెయిన్స్ డిసెంబర్ 18 నుంచి ప్రారంభమవుతుంది. దీన్నిబట్టి చూస్తే రెండింటికీ మధ్య తక్కువ వ్యవధి ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో మెయిన్స్‌కు ప్రిపరేషన్‌ను పూర్తిచేయడం కష్టం. అందువల్ల సిలబస్‌ను సమగ్రంగా పరిశీలించి, ప్రిలిమ్స్‌కు సమాంతరంగా మెయిన్స్‌కు సిద్ధంకావాలి. డిగ్రీలో చదివిన సబ్జెక్టునే ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలి! ఆప్షనల్ సబ్జెక్టు, జనరల్ ఎస్సేల్లో ప్రతిభ కనబరిచిన వారు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. అందువల్ల ఆప్షనల్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే డిగ్రీలో చదివిన సబ్జెక్టునే ఆప్షనల్‌గా తీసుకోవాలని లేదు. దీనికి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు.. తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్టు ప్రిపరేషన్.. జనరల్ స్టడీస్ పేపర్లకు ఉపయోగపడుతుందా? లేదా? అనేది చూడటం; స్వీయ వైఖరి; మంచి ఫ్యాకల్టీ గెడైన్స్ ఏ సబ్జెక్టుకు అందుబాటులో ఉంది; అకడమిక్ నేపథ్యం. ప్రస్తుతం జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్స్‌ను మంచి ఆప్షనల్స్‌గా చెప్పుకోవచ్చు. వీటి ప్రిపరేషన్ జనరల్ స్టడీస్ పేపర్లకు బాగా ఉపయోగపడుతుంది. బెస్ట్ ఆఫ్ లక్ -
అదనపు నైపుణ్యాల కోసం ఆన్లైన్ కోర్సులు
మై క్యాంపస్ లైఫ్ కాశీ.. దేశంలో పరిచయం అక్కర్లేని ఊరు. ఒకవైపు కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి చల్లని చూపులతో.. మరోవైపు పవిత్ర గంగానది ప్రవాహ హోయలతో విలసిల్లుతున్న ఈ నగరం.. ప్రాచీనకాలం నుంచే భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఇక్కడ కొలువుదీరిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎందరో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది. ఇక్కడ బీటెక్.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న భువనగిరి పవన్ ప్రియతమ్ తన క్యాంపస్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారిలా.. ఎక్కువమంది తెలుగు విద్యార్థులే క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. ర్యాగింగ్ జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఐఐటీ-బెనారస్‌లో నాలుగేళ్ల బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లు కలిపి 300 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు ఉన్న సమయంలో తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. బోధనలో భాగంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్, ఐసీటీలను వినియోగిస్తారు. ఫ్యాకల్టీ ఎలాంటి సందేహాలు ఎదురైనా నివృత్తి చేస్తారు. వారంలో మూడు రోజులు గంట చొప్పున ట్యుటోరియల్ సెషన్స్ ఉంటాయి. అధ్యాపకులతోపాటు ప్రతి ఫ్యాకల్టీకి నలుగురు టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. వీరు ట్యుటోరియల్ సెషన్లో విద్యార్థుల సందేహాలకు సమాధానాలిస్తారు. ల్యాబ్ ప్రాక్టికల్స్‌లో కూడా సహాయం చేస్తారు. వివిధ పరిశ్రమలు, విద్యా సంస్థల నుంచి గెస్ట్ లెక్చరర్స్ కూడా వచ్చి వివిధ అంశాలపై ఉపన్యసిస్తారు. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్‌ను అధ్యయనం చేశా సెమిస్టర్‌కు అన్ని ఫీజులు కలుపుకుని దాదాపు రూ.75,000 వరకు ఖ ర్చు అవుతుంది. ప్రతి సెమిస్టర్లో పరీక్షలు ఉంటాయి. సెమిస్టర్ మధ్యలో రెండుసార్లు పీరియాడికల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతి సెమిస్టర్‌కు ఆరు సబ్జెక్టులు, మూడు ల్యాబ్స్ ఉంటాయి. మొదటి ఏడాదిలో ఇంజనీరింగ్ సబ్జెక్టులతోపాటు తప్పనిసరిగా ప్రొఫెషనల్ కమ్యూనికేషన్‌ను అధ్యయనం చేయాలి. ప్రస్తుతం మొదటి ఏడాది విద్యార్థులకు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ బదులుగా హ్యుమానిటీస్‌ను ప్రవేశపెట్టారు. నేను ఇప్పటివరకు 10కి 8.08 సీజీపీఏ సాధించాను. ఆన్లైన్లో కోర్సులు అందించే ఎడెక్స్, కోర్సెరా వెబ్‌సైట్స్‌లో లైనక్స్, నెట్వర్కింగ్ కోర్సులు పూర్తి చేశాను. మైక్రోసాఫ్ట్ నుంచి డేటా స్ట్రక్చర్స్ కోర్సును తప్పకుండా పూర్తి చేయాలి. దేశంలో అన్ని ఐఐటీలు కలిసి ప్రారంభించిన ఎన్పీటీఈఎల్ వెబ్‌సైట్‌ను కూడా చూస్తుంటాను. ఇంక్యుబేషన్ సెంటర్ అందించే సేవలెన్నో విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ కంటే స్టార్టప్స్‌ను నెలకొల్పడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. విద్యార్థుల ఐడియాస్‌ను స్వీకరించి ఉత్తమమైనవాటిని ఎంపిక చేస్తారు. తర్వాత ఫండింగ్ సదుపాయం కూడా కల్పిస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు కూడా అందిస్తారు. పరిశ్రమల నుంచి నిపుణులను ఆహ్వానించి స్టార్టప్స్‌పై అవగాహన కూడా కల్పిస్తారు. ల్యాబ్‌లు మినహా ప్రత్యేకంగా ప్రతి విద్యార్థికీ ఈమెయిల్ ఇస్తారు. క్యాంపస్‌లో జరిగే ఈవెంట్స్‌ను, ముఖ్య విషయాలను మెయిల్ ద్వారా తెలియజేస్తారు. క్యాంపస్‌లో అత్యుత్తమ వసతులు ఉన్నాయి. లేబొరేటరీలు మాత్రం కొంచెం పాతవి. బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్, హ్యాండ్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ మైదానాలు ఉన్నాయి. లైబ్రరీలో వై-ఫై సౌకర్యం ఉంది. అన్ని గ్రంథాలు, జర్నల్స్, మ్యాగజైన్స్ లైబ్రరీలో లభిస్తాయి. ఇక దక్షిణ భారత, ఉత్తర భారత వంట కాలను అందించే క్యాంటీన్లు క్యాంపస్‌లో ఉన్నాయి. ఆహారం రుచికరంగా ఉంటుంది. కలర్‌ఫుల్ ఈవెంట్స్ క్యాంపస్‌లో ప్రతి ఏటా మూడు ఫెస్ట్‌లు నిర్వహిస్తారు. అవి.. టెక్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్. కల్చరల్ ఫెస్ట్‌లో భాగం గా డ్యాన్సులు, పాటలు, డ్రామాలు.. టెక్ ఫెస్ట్‌లో రోబో కాంపిటీషన్స్ ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ సాధించి రెండేళ్లు ఏదైనా కంపెనీలో పనిచేస్తాను. తర్వాత జీఆర్ఈ రాసి విదేశాల్లో ఎంఎస్ చదువుతా. -
బోధనా విధానంలో మార్పు రావాలి : సుధీర్ కుమార్ జైన్
గెస్ట్ కాలమ్ సాంకేతిక విద్య.. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించింది. కానీ ఎన్నో సమస్యలు. ముఖ్యంగా ఏటా లక్షలమంది సర్టిఫికెట్లు అందుకుంటున్నా.. ఉద్యోగ నైపుణ్యాలు లేవనేది ప్రధాన ఆరోపణ. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బోధనలో మార్పులు తెస్తేనే విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు కావాల్సిన నైపుణ్యాలు లభిస్తాయని స్పష్టం చేస్తున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గాంధీనగర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ జైన్. ఐఐటీ-రూర్కీలో 1979లో సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేసి.. తర్వాత కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్, పీహెచ్డీ పట్టా అందుకున్నారు. 1984 నుంచి ఐఐటీ-కాన్పూర్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత ఐఐటీ గాంధీనగర్ వ్యవస్థాపక డెరైక్టర్‌గా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న ప్రొఫెసర్ సుధీర్ కుమార్ జైన్‌తో ఇంటర్వ్యూ.. అన్నిటా మార్పులు అవసరం ఇంజనీరింగ్, సాంకేతిక విద్య విధానంలో మార్పులు తీసుకురావాలనే విద్యావేత్తల అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సిందే. అయితే, ఇదే సమయంలో అన్ని కోర్సులకు సంబంధించిన విధానాల్లోనూ మార్పులు చేయాలి. ముఖ్యంగా ఉన్నత విద్యలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. స్ట్రక్చరల్ విధానంలోని కరిక్యులం, ఫ్యాకల్టీ కొరత, ఇండస్ట్రీ-అకడమిక్ వర్గాల మధ్య ఒప్పందాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వీటిల్లో ముఖ్యమైనవి. వీటిని అధిగమించాలంటే విద్యావేత్తలు, పరిశ్రమ వర్గాలు కలిసి చర్చించి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన విధానాలు సూచించాలి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వంటి వినూత్న విధానాలను ప్రవేశపెట్టాలి. వీటివల్ల విద్యార్థులకు వాస్తవ పరిస్థితులకు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయి. దాంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సంసిద్ధత లభిస్తుంది. ఇండస్ట్రీ - ఇన్స్టిట్యూట్ ఒప్పందాలు ముఖ్యం విద్యార్థులకు క్షేత్ర స్థాయి నైపుణ్యాలు లభించేలా తద్వారా పరిశ్రమ వర్గాల నుంచి గుర్తింపు పొందేలా చేయాలంటే ఇన్స్టిట్యూట్లు పరిశ్రమ వర్గాలతో ఎక్స్ఛేంజ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఐఐటీ- గాంధీనగర్ ప్రారంభించినప్పటి నుంచీ రీసెర్చ్, అకడమిక్స్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలతో నిరంతరం సంప్రదింపులు చేస్తోంది. అండర్ రైటర్స్ లేబొరేటరీ, ది రికో కంపెనీ, నీల్సన్ ఎల్ఎల్సీ వంటి అంతర్జాతీయ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఐఐటీల్లో ఫ్యాకల్టీ కొరతకూ పరిష్కారం ఐఐటీల్లో అందులోనూ కొత్తగా ఏర్పాటైన ఐఐటీలను వేధిస్తున్న సమస్య ఫ్యాకల్టీ కొరత. దీనికి కూడా పరిష్కారం ఉంది. ప్రస్తుత వేతన విధానాలు, ఇతర ప్రోత్సాహకాలను దృష్టిలో పెట్టుకుంటే.. అనుభవజ్ఞులైన వారికంటే యంగ్ టాలెంట్‌కు పెద్దపీట వేయాలి. దీనివల్ల ఫ్యాకల్టీ కొరత తీరడంతోపాటు టీచర్ - స్టూడెంట్స్ మధ్య జనరేషన్ గ్యాప్ కూడా తక్కువగా ఉంటుంది. విద్యార్థులు కూడా తమ టీచర్లతో బిడియం లేకుండా సందేహాలు నివృత్తి చేసుకోగలరు. విద్యా సంస్థలు.. పరిశోధన, అభివృద్ధికి పరిశ్రమ వర్గాలతో ఒప్పందాలు చేసుకుంటే అద్భుత ఫలితాలు సొంతమవుతాయి. ఇవి విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించడంతోపాటు, సామాజిక అవసరాలను తీర్చేందుకు దోహదం చేస్తాయి. ఈ క్రమంలో ఇన్స్టిట్యూట్లు స్పాన్సర్డ్ రీసెర్చ్ కోసం ప్రయత్నించాలి. పరిశ్రమలను మెప్పించే రీతిలో తమ ఇన్స్టిట్యూట్లోని సదుపాయాలు, సౌకర్యాల గురించి వివరించాలి. ఇలాంటి చర్యల ఫలితంగానే ఐఐటీ - గాంధీనగర్‌కు అమెరికాకు చెందిన అండర్ రైటర్స్ లేబొరేటరీస్ నుంచి ఫైర్ ఇంజనీరింగ్ లేబొరేటరీ, ఫైర్ సేఫ్టీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్స్ కోసం ఐదు లక్షల డాలర్ల గ్రాంట్ లభించింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను అకడమిక్ స్థాయిలోనే ప్రస్తుత పారిశ్రామికీకరణ, పోటీ వాతావరణం నేపథ్యంలో విద్యార్థులకు అకడమిక్ స్థాయి నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన కల్పించాలి. ఈ విషయంలో ఇతర ఇన్స్టిట్యూట్లతో పోల్చితే ఐఐటీలు కొంత ముందంజలో ఉన్నాయి. ఐఐటీ- గాంధీనగర్‌లో బీటెక్ స్థాయిలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ఎలక్టివ్‌గా, మైనర్‌గా పొందుపరిచాం. దేశంలో ఇటీవల కాలంలో వ్యక్తమవుతున్న మరో అభిప్రాయం కొత్త ఐఐటీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని! కానీ నా ఉద్దేశంలో పాత ఐఐటీలతో పోల్చితే కొత్త ఐఐటీలకు కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం ఇందులో ముఖ్యమైంది, ప్రస్తావించదగింది. దీనివల్ల ఒక ఇన్స్టిట్యూట్ వృద్ధికి అవసరమైన మార్పులను వేగవంతంగా అమలు చేసే వీలు లభిస్తుంది. అంతేకాకుండా పాత ఐఐటీల్లో లోపాలను పరిశీలించి అవి కొత్త ఐఐటీల్లో తలెత్తకుండా చూడొచ్చు. జాబ్ ప్రొవైడర్స్‌ను రూపొందించడమే లక్ష్యం ఐఐటీ గ్రాడ్యుయేట్స్‌కు జాబ్స్ సొంతమవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ జాబ్ ప్రొవైడర్స్‌ను తీర్చిదిద్దితే వారు మరికొందరికి అవకాశాలు కల్పిస్తారు. ఈ క్రమంలో ఐఐసీ పేరుతో ఇంక్యుబేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం. దీని ప్రధాన ఉద్దేశం ఔత్సాహిక విద్యార్థులు తమ సొంత వెంచర్లు ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించడం. స్టార్టప్స్ దిశగా నడవాలనుకునే విద్యార్థులకు మంచి ప్రోత్సాహమందిస్తున్నాం. విస్తృత కోణంలో ఆలోచిస్తే విభిన్న అవకాశాలు ఐఐటీలకు ఉన్న క్రేజ్‌తో ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో అడుగుపెట్టాలనుకుంటారు. కానీ వివిధ కారణాల వల్ల సీటు కొందరికే లభిస్తోంది. ప్రతిభ ఉంటే అవకాశాలకు ఎలాంటి హద్దులు లేవు అని గుర్తించాలి. ఐఐటీల స్థాయిలోనే దేశంలో మరెన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వాటిలో చేరేందుకు కృషి చేయాలి. కోర్సులో చేరాక.. అభ్యసనం పరంగా స్వతంత్రంగా వ్యవహరించాలి. అన్నీ టీచర్లు చెబుతారు అనుకుంటే పొరపాటు. టీచర్ ఒక అంశం చెబితే దానికి అనుబంధంగా ఉండే అన్ని అంశాలను సొంతంగా నేర్చుకోవాలి. అప్పుడే కెరీర్లో రాణించగలుగుతారు. -
క్యాంపస్ అంబాసిడర్స్
ఐఐటీ - మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - మద్రాస్.. పరిచయం అక్కర్లేని విద్యా సంస్థ. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ఐఐటీ. ఇక్కడ దేశంలోనే ఎక్కువమంది తెలుగు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ వంటి కోర్సులకే పరిమితం కాకుండా ఎంఏ, ఎంఎస్సీ వంటి కోర్సులను అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్న బి.అఖిల్ సాయి తన క్యాంపస్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారిలా.. తెలుగు విద్యార్థులే ఎక్కువ మాది హైదరాబాద్. ఐఐటీ - మద్రాస్‌లో దాదాపు 2000 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఇన్స్టిట్యూట్ తమిళనాడులోనే ఉన్నా.. తమిళ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. ఐదారు క్యాంటీన్లున్నాయి. అన్ని రకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. ఆన్లైన్లోనే నచ్చిన మెస్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఆహారం అంత రుచిగా అనిపించదు. క్యాంపస్‌లో జీవ సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. 250 జింకలు, వందల్లో బ్లాక్‌బక్స్, ఇంకా ఎన్నో రకాల పక్షుల కిలకిలరావాలతో క్యాంపస్ అలరారుతూ ఉంటుంది. ర్యాగింగ్ అసలు లేదు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఎప్పుడూ క్యాంపస్‌లో తిరుగుతుంటుంది. ఆధునిక పద్ధతుల్లో బోధన సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు క్లాసులుంటాయి. ప్రతి సోమవారం ప్రాక్టికల్స్ ఉంటాయి. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. అవసరమైతే ప్రొజెక్టర్, వీడియో కాన్ఫరెన్స్ వంటి అత్యాధునిక సదుపాయాలు వినియోగిస్తారు. రీసెర్చ్ చేస్తూ పాఠాలు చెప్తారు. ఫ్యాకల్టీకి జాతీయస్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. ఐఐటీలు, ఐఐఎస్సీ ప్రవేశపెట్టిన ఎన్పీటీఈఎల్ (నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్సడ్ లెర్నింగ్) ద్వారా వివిధ అంశాలపై ఆన్లైన్ కోర్సులు చేసే సదుపాయం ఉంది. ఇందుకోసం ప్రతి ఒక్క విద్యార్థికీ యూజర్‌నేమ్, పాస్వర్డ్ కేటాయిస్తారు. ఈ ఆన్లైన్ కోర్సులను ఉచితంగా చేయొచ్చు. టీచింగ్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. వీరు కూడా విద్యార్థులకు వివిధ అంశాల్లో సహాయసహకారాలు అందిస్తారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్‌కు 85 శాతం హాజరు తప్పనిసరి. ప్రతి సెమిస్టర్‌కు క్విజ్-1, క్విజ్-2, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. బ్రాంచ్‌ను బట్టి సెమిస్టర్‌కు 24 క్రెడిట్స్ వరకు ఉంటాయి. సౌకర్యాలు అత్యుత్తమం ప్రతి శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. క్యాంపస్‌లో ఉన్న ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్రతివారం ఒక సినిమా ప్రదర్శిస్తారు. ఎక్కువగా ఇంగ్లిష్, హిందీ సినిమాలు చూస్తాం. సెమిస్టర్‌కు ఒకటి రెండుసార్లు తెలుగు సినిమాలు వేస్తారు. ఈ థియేటర్లో 2000 మంది వరకు కూర్చునే సదుపాయం ఉంటుంది. ఇంకా ఆడిటోరియం, తరగతి గదులు, హాస్టల్స్, లైబర్రీ, లేబొరేటరీలు, క్రీడా మైదానాలు అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే పెద్దది ప్రతి ఏటా జనవరిలో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తారు. టెక్‌ఫెస్ట్‌లో భాగంగా రోబో ఫెస్ట్, వర్క్‌షాప్స్, కోడింగ్ వర్క్‌షాప్స్ మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. ప్రముఖ పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు హాజరవుతారు. ఇక కల్చరల్ ఫెస్ట్‌ను సౌతిండియాలోనే పెద్దదిగా చెప్పొచ్చు. ఇది ఐదురోజులపాటు జరుగుతుంది. ప్రఖ్యాత మ్యూజిక్ బాండ్ గ్రూపులను తీసుకొస్తారు. సినీ, క్రీడా రంగాలకు చెందినవారిని కూడా ఆహ్వానిస్తారు. పరిశోధనలకు ప్రోత్సాహం ఎంతో ఇక్కడ పరిశోధనల దిశగా అడుగులు వేయాలనుకునే విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. భారీ విస్తీర్ణంలో రీసెర్చ్ పార్క్ ఉంది. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ కూడా కొలువుదీరింది. స్టార్టప్స్ దిశగా నడవాలనుకునే విద్యార్థులు తమ ఆలోచనలను వివరించి సూచనలు, సలహాలు, ఫండింగ్ పొందొచ్చు. ఇన్నోవేషన్ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులు.. చెన్నై నగరం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపారు. దీని ప్రకారం.. ఏ రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది? ఏ రోడ్లలో ట్రాఫిక్ తక్కువ ఉంది? ఏ రోడ్డు ద్వారా సులువుగా వెళ్లొచ్చు.. ఇలా ప్రజలకు శాటిలైట్ ద్వారా సమాచారం అందుతుంది. దీన్ని త్వరలో అమలు చేయనున్నారు. ఇంకా ఇక్కడ విద్యార్థులు చేసే పరిశోధనలకు పేటెంట్స్ కూడా లభిస్తున్నాయి. పూర్వ విద్యార్థులు కూడా వివిధ అంశాల్లో విద్యార్థులకు సహాయాన్ని అందిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందిన విద్యార్థులకు కనీసం ఏడాదికి రూ.5.5 లక్షలు, గరిష్టం రూ.1.3 కోట్లు లభిస్తున్నాయి. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి విదేశాల్లో ఎంఎస్ చేయాలనుకుంటున్నా. ఎన్ఐటీ - తిరుచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - తిరుచ్చి.. ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో దక్షిణ భారతదేశంలోనే టాప్-5 విద్యా సంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది.త్రిచీ, తిరుచిరాపల్లి వంటి పేర్లతో కావేరీ నదీ ప్రవాహ హోయలతో అలరారుతోంది. ఎన్ఐటీ- తిరుచ్చిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ మూడో ఏడాది చదువుతున్న జి.శివరామ్ క్యాంపస్ లైఫ్‌ను వివరిస్తున్నారిలా.. క్యాంపస్ అంతా వై-ఫై క్యాంపస్‌లో ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. హాస్టల్ కామన్ రూమ్‌లో భాగంగా టీవీ, పత్రికలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంటాయి. క్యాంటీన్లో ఫుడ్ బాగుంటుంది. క్యాంపస్ అంతా వై-ఫై ఉంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు తరగతులు నిర్వహిస్తారు. వారంలో రెండు రోజుల ల్యాబ్ వర్క్. సెమిస్టర్లో 8 సబ్జెక్టులు ఉంటాయి. సెమిస్టర్‌ను బట్టి సబ్జెక్టులు మారుతుంటాయి. నేను ఇప్పటివరకు 10కు 8.3 సీజీపీఏ సాధించాను. స్మార్ట క్లాసెస్ మన తెలుగు విద్యార్థులు దాదాపు 200 మంది వరకు ఉన్నారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. స్మార్ట్ క్లాసెస్, ఆన్లైన్ లెక్చర్లు ఉంటాయి. ఆన్లైన్లో మెటీరియల్ పొందే సౌలభ్యం ఉంది. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారు. ఇండస్ట్రీ ఓరియెంటేషన్‌తో క్లాసులు నిర్వహిస్తారు. సబ్జెక్టుపరమైన సందేహాలు వస్తే ఎప్పుడైనా ఫ్యాకల్టీని సంప్రదించే వీలు ఉంది. ఎంటెక్, పీహెచ్డీ స్టూడెంట్స్ కూడా వివిధ అంశాల్లో సహాయమందిస్తారు. మన పండుగలు బాగా చేస్తాం ప్రతి ఏటా క్యాంపస్‌లో టెక్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తారు. టెక్నికల్ ఫెస్ట్‌లో రోబోటిక్స్ పోటీలు, ఐడియా కాంపిటీషన్స్ ఉంటాయి. ఈ కార్యక్రమాలకు దేశవిదేశాల నుంచి వివిధ అంశాల్లో నిష్ణాతులు హాజరవుతారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా పాటలు, డ్యాన్సులు, నాటకాలు, చిన్నచిన్న స్కిట్స్ ఉంటాయి. క్యాంపస్‌లో అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. ఎవరి రాష్ట్ర పండుగలను వారు ఘనంగా నిర్వహిస్తారు. మేము ఉగాది, సంక్రాంతి, దీపావళి, వినాయకచవితి వంటి పండుగలను బాగా చేస్తాం. విదేశాల్లో ఎంఎస్ చేస్తా క్యాంపస్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. భావి వ్యాపార వేత్తలను తీర్చిదిద్దడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వర్క్‌షాప్స్ జరుగుతుంటాయి. నేను ప్రస్తుతం శాంసంగ్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నా. ఇది రెండునెలలపాటు ఉంటుంది. స్టైఫండ్ కూడా ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సాధించి రెండేళ్లు ఉద్యోగం చేస్తా. తర్వాత విదేశాల్లో ఎంఎస్ చదువుతా. బిట్స్ పిలానీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (బిట్స్) - పిలానీ.. ఇంజనీరింగ్ కోర్సులను అందించే ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో దేశంలోనే నెంబర్‌వన్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు పి.వినయ్‌కుమార్ రెడ్డి. ఎడ్యుకేషన్, పరిశోధనలకు ఇచ్చే ప్రోత్సాహం చాలా బాగుందని తెలిసి బిట్స్‌లో చేరానంటున్న ఆయన తన క్యాంపస్ కబుర్లను చెబుతున్నారిలా.. ఇక్కడే బాగుంది ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ విద్యార్థులకు బిట్స్‌లో మంచి ప్లేస్‌మెంట్స్ ఉంటాయని తెలుసుకున్నా. దాంతో ఇక్కడ చేరా. క్యాంపస్‌లో 200 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. దక్షిణ భారత వంటకాలన్నీ క్యాంటీన్లో లభిస్తాయి. సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు ఉంటాయి. లెక్చర్ సెషన్, ట్యుటోరియల్ సెషన్లలో.. లెక్చర్ సెషన్లో సంబంధిత సబ్జెక్టు థియరీని బోధిస్తారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, ప్రొజెక్టర్ వంటి అత్యాధునిక విధానాలను వినియోగిస్తారు. ట్యుటోరియల్ సెషన్ అంతా ప్రాబ్లమ్ సాల్వ్డ్గా ఉంటుంది. ప్రస్తుతం ఎదురవుతున్న వివిధ సమస్యలను పరిష్కరించే దిశగా శిక్షణనిస్తారు. వారంలో లెక్చర్, ట్యుటోరియల్, ప్రాక్టికల్స్ కలిపి 29 క్లాసులుంటాయి. ఇంజనీరింగ్ సబ్జెక్టులతోపాటే హ్యుమానిటీస్‌ను కూడా తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఇంకా ఆన్లైన్లో కోర్సెరా, ఎడెక్స్ వంటివాటి ద్వారా కోర్సులు అభ్యసిస్తాం. ప్రతి సెమిస్టర్లో మిడ్ సెమిస్టర్, కాంప్రహెన్సివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మెరిట్ స్కాలర్షిప్స్ క్యాంపస్‌లో పుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటివి ఆడుకోవడానికి క్రీడా మైదానాలున్నాయి. ఓపెన్ ఆడిటోరియం, జిమ్‌లు, ప్రపంచంలోనే అన్ని జర్నల్స్‌తో కూడిన లైబ్రరీ, పరిశోధనాలయాలతో క్యాంపస్ విరాజిల్లుతోంది. ఇంకా ఆయా బ్రాంచ్‌ల డిపార్ట్మెంట్లు, క్లబ్‌ల ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతిభావంతులకు మెరిట్ స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. ముగ్గుల పోటీలు పెడతాం రీజినల్ కమిటీ ఆధ్వర్యంలో తెలుగువాళ్లమంతా కలిసి మన తెలుగు పండుగలను వైభవంగా నిర్వహిస్తాం. సంక్రాంతికి ముగ్గులేయడం, గాలిపటాలు ఎగరేయడం వంటి పోటీలు పెడతాం. ఇంకా ఉగాది, వినాయకచవితి వంటి పండుగలను బాగా చేస్తాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్ ఆధ్వరంలో స్టార్టప్స్‌కు ఎంతో ప్రోత్సాహమందిస్తున్నారు. కొత్త స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునేవారు తమ ఆలోచన వివరించి సూచనలు, సలహాలు పొందొచ్చు. కంపెనీల హెడ్లు, మేనేజర్లు క్యాంపస్‌ను సందర్శిస్తుంటారు. వారికి ఆలోచన నచ్చితే ఫండింగ్ చేస్తారు. నేను కోర్సు పూర్తయ్యాక విదేశాల్లో ఎంఎస్ చేయాలనుకుంటున్నా. మీరూ పంపండి! కొత్త ఆశలతో మీరు ఇప్పటికే ఏదో ఒక కళాశాలలో చేరి ఉంటారు. ఇందుకోసం మీరు ఎంతో కష్టపడి ఉండొచ్చు. చాలామంది విద్యార్థులకు కోరుకున్న కోర్సులో ప్రవేశించడం ఎలా? ఎలాంటి కాలేజీలో చేరాలి? ఇలా ఎన్నో సందేహాలు. వీరంతా మీలాంటివారి అనుభవాలు తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. మీ క్యాంపస్ ప్రత్యేకతలు, ఫెస్ట్‌లు, కల్చరల్ ప్రోగ్రామ్స్ వంటి వాటిని మా ద్వారా మీ తోటి విద్యార్థులతో పంచుకోండి.మీ వివరాలను ఈ-మెయిల్ చేయండి. sakshi.ambsdr@gmail.com -
క్యాంపస్ అంబాసిడర్ -వి. భానుప్రకాశ్ -ఐఐటీ - గువహటి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -గువహటి (అసోం).. పరిచయం అక్కర్లేని విద్యా సంస్థ. ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సెకండియర్) చదువుతున్నారు.. వండాన భానుప్రకాశ్. సీఎస్ఈ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆయన తన ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతలను, ఫ్యాకల్టీ విశేషాలను వివరిస్తున్నారిలా.. సీనియర్ల సహకారం ఎంతో ఐఐటీ గువహటి క్యాంపస్ 700 ఎకరాల్లో ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చటి గడ్డి మైదానాలతో అలరారుతుంది. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. మొదట్లో అంతా గజిబిజిగా ఉండేది. సబ్జెక్టులు, పరీక్షలు, ఇతర అన్ని విషయాల్లో సీనియర్లు సహాయం చేసేవారు. కారం ఎక్కువ తినే మన తెలుగు విద్యార్థులకు ఆహారం అంత రుచిగా అనిపించదు. ఇక.. క్యాంపస్ అంతా వై-ఫై ఉంది. లైబ్రరీ, ఆడిటోరియం, లేబొరేటరీలు, ప్లే గ్రౌండ్స చాలా బాగుంటాయి. ప్రతిభావంతులకు స్కాలర్షిప్స్ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు క్లాసులుంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. శని, ఆదివారాలు సెలవు. ప్రతి విద్యార్థికీ యూజర్ నే మ్, పాస్వర్డ్ ఇస్తారు. దీని ద్వారా వెబ్‌లో లాగినై ఆన్లైన్ మెటీరియల్ పొందొచ్చు. విద్యార్థులు కోర్సుపై ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు. విద్యార్థులకు కోర్సు నచ్చకపోతే దానిని తీసేస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. ఏవైనా సందేహాలు వస్తే వెంటనే నివృత్తి చేస్తారు. ఒక్కో సెమిస్టర్లో 5 కోర్సులు, 2 ల్యాబ్ కోర్సులు ఉంటాయి. నేను పరీక్షలో ఇప్పటివరకు పదికి 8.00 సీజీపీఏ సాధించాను. సెమిస్టర్‌కు అన్నీ కలుపుకుని రూ.50,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే తల్లిదండ్రుల వార్షికాదాయాన్ని బట్టి, ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్‌లో తెలుగు విద్యార్థులే ఎక్కువ తెలుగు ఫ్యాకల్టీ 15 మంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. వారు విద్యార్థులతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా ఉగాది. శ్రీరామనవమి, దీపావళి, వినాయకచవితి వంటి పండుగలను బాగా చేస్తాం. ప్రతి ఏటా టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్‌లను కూడా విద్యార్థులే కమిటీలుగా ఏర్పడి నిర్వహిస్తారు. టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా వివిధ పోటీలు, గెస్ట్ లెక్చర్స్ వంటివి ఉంటాయి. దేశ,విదేశాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు క్యాంపస్‌కు విచ్చేస్తారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయి. మూడో ఏడాది వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. రెండు నెలలపాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇందుకోసం ఎన్నో కంపెనీలు క్యాంపస్‌కు వస్తాయి. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌లో రూ.లక్ష వరకు స్టైఫండ్ కూడా ఇస్తారు. రూ.50 కోట్లకు యాహూ కొనుక్కుంది ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు మంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందుతున్నారు. వార్షిక వేతనాలు కనీసం రూ.6 లక్షలు, గరిష్టంగా రూ.1.2 కోట్లు అందుతున్నాయి. ఇటీవల మా సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన బుక్‌పాడ్ అనే స్టార్టప్‌ను.. యాహూ రూ.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ముగ్గురూ కూడా మన తెలుగువారే కావడం గర్వించదగిన విషయం. నేను కూడా కోర్సు పూర్తయ్యాక మూడు, నాలుగేళ్లు ఉద్యోగం చేస్తాను. తర్వాత సొంత కంపెనీని ఏర్పాటు చేస్తా. -
ఐఐటీ ప్రవేశాలలో మార్పులు!
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన విధానాల్లో తాజా మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా ప్రస్తుతం ఐఐటీల్లో ప్రవేశాలకు అమలు చేస్తున్న.. ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుల్లో టాప్-20 పర్సంటైల్ అనే నిబంధనకు ప్రత్యామ్నాయం చూసే దిశగా జాయింట్ అడ్మిషన్ బోర్డ్ యోచిస్తోంది. 2012 నుంచి అమలు చేస్తున్న టాప్-20 పర్సంటైల్ నిబంధన విషయంలో విద్యార్థుల్లో నిరసన కొనసాగుతూనే ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వచ్చినా బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవక ఎందరో విద్యార్థులు ఐఐటీలో సీటు అవకాశం కోల్పోయారు. ఇదే విషయంపై ఐఐటీ డెరైక్టర్లతో కూడిన జాయింట్ అడ్మిషన్ బోర్డ్ ప్రత్యామ్నాయాలను రూపొందించేందుకు ఉపక్రమించింది. త్వరలో జరిగే జేఏబీ మలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మార్పులకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2015 నుంచే అమలు చేయనున్నట్లు సమాచారం. ఐఆర్‌ఎంఏలో.. పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్మెంట్ దేశంలో ప్రముఖ బీస్కూల్.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ - ఆనంద్.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్మెంట్ (పీఆర్ఎం) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: 50 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం) మార్కులతో 10+2+3 విద్యా విధానంలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు.. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: క్యాట్-2014లో వచ్చిన స్కోర్ ఆధారంగా.. ఐఆర్ఎంఏ ప్రవేశపరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ ఆధారంగా ప్రవేశం ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2014 వెబ్సైట్: www.irma.ac.in -
కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి
మై క్యాంపస్ లైఫ్- ఐఐటీ - ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటి. ఇంజనీరింగ్ కోర్సుల్లో అత్యుత్తమ బోధన, పరిశోధనలకు పెట్టింది పేరు. ఇటీవల క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ జాబితాలో ప్రపంచంలోనే 235వ స్థానంలో నిలిచింది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న చలమలశెట్టి యువ నాగ సాయి అవినాశ్ కార్తీక్ తన క్యాంపస్ లైఫ్ విశేషాలను, ప్రత్యేకతలను వివరిస్తున్నారిలా.. మాది హైదరాబాద్. విద్యానగర్‌లో ఉంటాం. నాన్న నాగోల్‌లో టీవీఎస్ షోరూమ్‌ను నిర్వహిస్తున్నారు. అమ్మ గృహిణి. అక్క యూఎస్‌లోని రైట్ స్టేట్ యూనివర్సిటీ - ఒహియోలో ఎంఎస్ చేస్తోంది. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే విద్యనభ్యసించాను. పదో తరగతిలో 557 మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 979 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయిలో 389, అడ్వాన్స్‌డ్‌లో 69, బీఆర్క్‌లో 14వ ర్యాంకులు వచ్చాయి. కమిటీ పరిశీలిస్తుంటుంది ప్రవేశం లభించిన వారందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. ఒక్కో రూమ్‌కు ముగ్గురు చొప్పున ఉంటారు. రూమ్‌లో స్టడీ టేబుల్, బెడ్, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ప్రతి హాస్టల్‌కు కామన్రూమ్లో భాగంగా పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ ఉంటాయి. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. ఒక కమిటీ క్యాంపస్ అంతా తిరుగుతూ పరిశీలిస్తుంటుంది. ర్యాగింగ్ జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. క్యాంపస్‌లో 250 మంది తెలుగు విద్యార్థులే క్యాంపస్‌లో తెలుగు విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆ యా బ్రాంచ్‌లు.. సబ్జెక్టులకనుగుణంగా షెడ్యూల్ ను బట్టి క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంట ల నుంచి 2 గంటల వరకు లంచ్ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 వరకు డిన్నర్. భోజనంలో రెండు కూరలు, రైస్, చపాతీ వడ్డిస్తారు. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు అల్పాహారం ఇస్తారు. వారంలో రెండు రోజులు సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉంటాయి.హాస్టల్‌కు వార్డెన్‌గా ప్రొఫెసర్ ఉంటారు. అప్పుడప్పుడు హాస్టల్, క్యాంటీన్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకుంటారు. ఫుడ్ నాణ్యతను పరిశీలిస్తారు. వార్డెన్‌ను అడిగి సబ్జెక్టు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వార్డెన్ కాకుండా ఒక కేర్‌టేకర్ కూడా ఉంటారు. సీనియర్ల సహకారం ఎంతో తరగతిలో బోధన బాగుంటుంది. ఫ్యాకల్టీ బాగా చెబుతారు. స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతారు. ఇతర విద్యా సంస్థల ప్రొఫెసర్లు కూడా వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటారు. ఎంత గ్రేడింగ్ ఇవ్వాలి? ఎన్ని మార్కులు కేటాయించాలి? ఎలా బోధించాలి? వంటి అంశాలన్నీ ప్రొఫెసర్ల చేతిలోనే ఉంటాయి. బోధనలో భాగంగా అవసరమైతే ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ), పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, వీడియో వంటివాటిని కూడా ప్రొఫెసర్లు వినియోగిస్తారు. ఫ్యాకల్టీపైన, చదివే కోర్సుపైన విద్యార్థులు ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. యూజర్ ఐడీతో వెబ్సైట్లో లాగినై కోర్సు ఎలా ఉంది? ప్రొఫెసర్లు పాఠాలు ఎలా బోధిస్తున్నారు వంటి అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలు తెలియజేయొచ్చు. సీనియర్ స్టూడెంట్స్ అకడమిక్‌గా ఎదురయ్యే సందేహాలు, ఫ్యూచర్ కెరీర్ ప్లాన్స్, జాబ్ ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం వంటి వాటిపై సహాయసహకారాలు అందిస్తారు. ప్రతి సెమిస్టర్లో 7 కంటే ఎక్కువ సీజీపీఏ రావాలి నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్‌కు అన్నీ కలుపుకుని దాదాపు రూ.75,000 వరకు ఖర్చు అవుతుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5 లక్షలు లోపు ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తారు. ఇందులో భాగంగా ట్యూషన్ ఫీజులో ఎక్కువ భాగం మినహాయింపు ఉంటుంది. స్కాలర్షిప్ పొందాలంటే ప్రతి సెమిస్టర్లో 7 కంటే ఎక్కువ సీజీపీఏ పొందాల్సి ఉంటుంది. 7 కంటే తక్కువ సీజీపీఏ ఉంటే స్కాలర్షిప్ అందించరు. ఎయిమ్స్‌లో ఉచిత వైద్యం క్యాంపస్‌లో ఆడుకోవడానికి క్రీడా మైదానాలెన్నో ఉన్నాయి. ఇంకా అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఆడిటోరియం, లైబ్రరీ, ల్యాబ్‌లు; బ్యాంకు లు, ఏటీఎంలు కొలువుదీరాయి. విద్యార్థులు అస్వస్థతకు గురైతే 24 గంటలు సేవలందించే ఆస్పత్రి క్యాంపస్‌లో ఉంది. చిన్నపాటి వ్యాధులకు ఢిల్లీలోని ప్రఖ్యాత వైద్య సంస్థ ఎయిమ్స్‌లో ఉచిత వైద్యం అందిస్తారు. క్యాంపస్.. కలర్‌ఫుల్ క్యాంపస్‌లో ప్రతి ఏటా వివిధ ఫెస్ట్‌లు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది మార్చిలో టెక్నికల్ ఫెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా నాలుగు రోజులపాటు టెక్నాలజీ సంబంధిత అంశాలపై పోటీలు, గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. దేశవిదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఈ ఫెస్ట్‌కు హాజరవుతారు. ఏటా అక్టోబర్‌లో కల్చరల్ ఫెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇవేకాకుండా ఐఐటీల వరకు ప్రత్యేకంగా ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. క్యాంపస్‌లో దీపావళి, హోళి వంటి పండుగలను బాగా చేస్తాం. శని, ఆదివారాలు క్లాసులుండవు. అప్పుడప్పుడు ఢిల్లీ, ఆగ్రా పరిసర ప్రాంతాలను సందర్శించి మానసిక ఉల్లాసం పొందుతాం. కంపెనీలు ఫండింగ్ చేస్తాయి క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ కూడా ఉంది. కొత్త స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునేవారికి వివిధ కంపెనీలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా వివిధ కంపెనీల హెడ్లు క్యాంపస్‌కు వస్తారు. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే కంపెనీలు ఫండింగ్ సదుపాయం కల్పిస్తాయి. సెల్ ఆధ్వర్యంలో గెడైన్స్, ఇతర సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫేస్బుక్ వంటి కంపెనీలు ప్రతిభా వంతులకు ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి. సివిల్స్ రాస్తా బీటెక్ పూర్తయ్యాక ఒకటి లేదా రెండేళ్లు ఉద్యోగం చేస్తాను. ఆ తర్వాత సివిల్స్ రాయాలనుకుంటున్నా. -
ప్రవేశాలు
ఐఐటీ మద్రాస్‌లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) డిప్లొమా అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: ఫిట్టర్, షీట్‌మెటల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, మెకానిక్ (మెషిన్ టూల్ మెయింటనెన్స్, డీజిల్, మోటార్ వెహికల్), ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. అర్హతలు: మెకానికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 5 వెబ్సైట్: www.iitm.ac.in అంకాలజీలో పోస్ట్ బేసిక్ డిప్లొమా తిరువనంతపురంలోని రీజనల్ కేన్సర్ సెంటర్, పోస్ట్-బేసిక్ డిప్లొమా ఇన్ అంకాలజీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ అంకాలజీ నర్సింగ్ కాలపరిమితి: ఏడాది అర్హతలు: బీఎస్సీ(నర్సింగ్) లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీలో డిప్లొమా ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 12 వెబ్సైట్: http://www.rcctvm.org -
ఉద్యోగాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన పారాదీప్ రిఫైనరీ ప్రాజెక్ట్ 113 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: కెమికల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఇన్స్ట్రుమెంటేషన్ అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 10 వెబ్సైట్: www.paradiprefinery.in పీడీఐఎల్ నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ (పీడీఐఎల్), కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * చీఫ్ ఇంజనీర్ * అడిషనల్ చీఫ్ ఇంజనీర్ * డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ * డిప్యూటీ మేనేజర్ * సీనియర్ ఆఫీసర్ * సీనియర్ ఇంజనీర్ అర్హతలు తదితర పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. చివరి తేది: సెప్టెంబరు 10 వెబ్సైట్: http://careers.pdilin.com ఐఐటీ, హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ తాత్కాలిక పద్ధతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్, అకౌంట్స్, ఇంగ్లిష్, అడ్మినిస్ట్రేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా పంపాలి. చివరి తేది: సెప్టెంబరు 1 ఇ-మెయిల్: teqip@iith.ac.in వెబ్సైట్: www.iith.ac.in -
ఇక మార్కెట్లోకి ఫాల్కన్ బ్లేడ్ బ్యాట్లు
ముంబై ఐఐటీ విద్యార్థుల సృష్టి ముంబై: క్రికెట్లో ఇక నవతరం బ్యాట్లు రానున్నాయి. విదేశీ పర్యటనల్లో భారత ఆటగాళ్లు బంతిని ఎడ్జ్ చేయబోయి వికెట్ కీపర్ చేతుల్లో, స్లిప్ ఫీల్డర్లకు క్యాచ్‌లు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ సమస్యకు ఆధునిక రీతిలో పరిష్కారం కనుగొనేందుకు ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన విద్యార్థులు నడుం బిగించారు. బ్యాట్ల చివర్ల (ఎడ్జ్)ను పునర్నిర్మాణం చేయాలని భావించారు. తమ ఆలోచనలకు పదును పెట్టి ఐసీసీ సూత్రాలను అనుసరించి ‘ఫాల్కన్ బ్లేడ్’ పేరిట కొత్త తరహా బ్యాట్లను తయారుచేశారు. బంతి బ్యాట్ చివరన తాకగానే అది పక్కకు వెళ్లి ఫీల్డర్ల చేతిలో పడకుండా నేరుగా కింది వైపునకు వెళ్లేటట్లు బ్యాట్ స్వరూపాన్ని మార్చారు. పక్క నుంచి చూస్తే విమానం రెక్క మాదిరిగా ఈ బ్యాట్ నిర్మాణం ఉంటుంది. ఈ డిజైన్‌ను మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కూడా ఆమోదించింది. వచ్చే ఏడాది ఈ బ్యాట్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి చాలా తేలిగ్గా ఉండడమే కాకుండా గాల్లో వేగంగా కదులుతాయి. పక్క నుంచి చూస్తే బ్యాట్ మధ్య భాగం సంప్రదాయ బ్యాట్కన్నా కాస్త ఎక్కువగా ఉబ్బినట్టు ఉండి కింద షార్ప్‌గా ఉంటుంది. -
మళ్లీ అదే అన్యాయం!
ఐఐటీ అభ్యర్థులకు టాప్-20 పర్సంటైల్ గండం తెలుగు విద్యార్థులకు 92 శాతం కటాఫ్ ఇంటర్ రెండేళ్లకు 920 లేదా సెకండ్ ఇయర్లో 492 మార్కులు ఉంటేనే సీటు ఇతర రాష్ట్రాల పోల్చితే మనోళ్లకే అత్యధిక కటాఫ్ అస్సాం విద్యార్థులకు 292మార్కులు వస్తే చాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానంతో తీవ్ర అన్యాయం హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యా సంస్థల్లో అడ్మిషన్ల వ్యవహారం మళ్లీ వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ విషయంలో గందరగోళం తలెత్తగా.. తాజాగా మరో విషయం తెలుగు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిబంధనల ప్రకారం అడ్వాన్స్‌డ్‌లో సాధించిన మార్కులతో పాటు ఆయా రాష్ట్రాల బోర్డులు నిర్వహించిన ఇంటర్మీడియట్ మార్కుల ప్రకారం టాప్-20 పర్సంటైల్‌లో ఉంటేనే ఐఐటీలో సీటు పొందేందుకు అర్హులవుతారు. ఒకవేళ టాప్ 20 పర్సంటైల్ జాబితాలో లేకపోతే సదరు విద్యార్థికి ఐఐటీ అడ్మిషన్ దక్కదన్నమాట! ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సీబీఎస్ఈ అధికారులు వివిధ రాష్ట్రాల టాప్-20 పర్సంటైల్‌కు సంబంధించిన కటాఫ్ మార్కులను ప్రకటించారు. దీని ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 1000 మార్కులకు గాను జనరల్ అభ్యర్థికి కనీసం 920 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒక్క ద్వితీయ సంవత్సరం మార్కులనే పరిగణనలోకి తీసుకుంటే 530 మార్కులకు గాను 492 కంటే ఎక్కువ మార్కులు రావాలి. అలాంటి విద్యార్థులే ఐఐటీలో చేరేందుకు అర్హులు. ఇంటర్లో ఈ మేరకు టాప్-20 పర్సంటైల్ కటాఫ్ మార్కులు(92 శాతం) సాధించకుంటే.. ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించినా ప్రయోజనం ఉండదు. అయితే ఇతర రాష్ట్రాల్లో చూస్తే ఈ కటాఫ్ చాలా తక్కువగా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి మెరిట్‌తో ప్రవేశాలు కల్పించాల్సిన ఐఐటీల్లో ఇలాంటి పొంతన లేని విధానాలతో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇతర రాష్ట్ర విద్యార్థులతో పోల్చుకుంటే రాష్ట్ర విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినా ఐఐటీలో సీటు పొందలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇంటర్ లేదా 12వ తరగతి మార్కులను ఇప్పటికీ పంపించని వారి విషయంలో మాత్రం కటాఫ్ మార్కులు మరో రకంగా ఉన్నాయి. సీబీఎస్ఈ అర్హత పరీక్షలో ప్రకటించిన మేరకు జనరల్ అభ్యర్థికి 83.2% మార్కులు వస్తే చాలు!. సీబీఎస్ఈ విధానాన్నే అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయకుండా ఒక్కో రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోని పోటీని బట్టి కటాఫ్ మార్కులను నిర్ణయించడం సమస్యకు కారణం అవుతోంది. దీనిపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాగా, మన ఇంటర్ బోర్డు విద్యార్థులకు సీబీఎస్ఈ రెండు రకాల అవకాశం కల్పించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్కులను మాత్రమే కటాఫ్ కోసం చూపించవచ్చు లేదా రెండేళ్ల మార్కులనూ పరిగణనలోకి తీసుకునేందుకు చూపించుకోవచ్చు. మార్కులు ఇవ్వకుంటే సీబీఎస్ఈ కటాఫ్ వర్తించనుంది. దీని ప్రకారం ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 83.2%, ఓబీసీకి 82 %, ఎస్సీలకు 74%, ఎస్టీలకు 73.2 శాతం మార్కులు వస్తే చాలు. పాలిటెక్నిక్ విద్యార్థులకు షాక్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లకు సీబీఎస్ఈ షాక్ ఇచ్చింది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించినప్పటికీ వారు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్/బీఆర్క్/బీప్లానింగ్‌లో చేరేందుకు అనర్హులని తాజాగా పేర్కొంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం వారికి 12వ తరగతి సర్టిఫికెట్ లేనందున పాలిటెక్నిక్ విద్యార్థులు అనర్హులని స్పష్టం చేసింది. మరోవైపు 12వ తరగతి/తత్సమాన పరీక్ష మార్కులను ధ్రువీకరించేందుకు చేసేందుకు గడువును జులై 3 వరకు పొడిగించింది. గత నెల 27 వరకు మొదట్లో చివరి తేదీగా ప్రకటించినా దానిని సోమవారం వరకు పొడగించింది. తాజాగా 3వ తేదీ వరకు మళ్లీ పొడిగించింది. దీనిప్రకారం జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను ఈ నెల 7న ప్రకటించనుంది. ఈ మేరకు ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు సెంట్రల్ సీట్ అలాట్మెంట్ బోర్డు గతంలో ప్రకటించిన ప్రవేశాల షెడ్యూల్ మారనుంది. -
విద్య.. ఉద్యోగ సమాచారం.. మీకోసం
జాబ్స్, అడ్మిషన్స అల్టర్స్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు పోస్టులు: అసిస్టెంట్ స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్ పోస్టుల సంఖ్య: 7 అర్హత: అసిస్టెంట్ స్టోర్ కీపర్‌కు ఇంటర్మీడియెట్, ఫోటోగ్రాఫర్‌కు పదో తరగతి ఉండాలి. నిర్దేశిత అనుభవం తప్పనిసరి వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: వెబ్సైట్లో లభిస్తాయి. చివరి తేది: జూలై 31 వెబ్సైట్: http://cgwb.gov.in/ బయోటెక్నాలజీ ఫినిషింగ్ స్కూల్-బెంగళూరు కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ కాలపరిమితి: ఏడాది అర్హతలు: బయోటెక్నాలజీ/బయో ఇన్ఫర్మాటిక్స్/ మైక్రో బయాలజీ/బయో కెమిస్ట్రీలో పీజీ/బీఈ/బీటెక్/బీ ఫార్మసీ లేదా అగ్రికల్చర్/వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ/ఎంబీబీఎస్/బీడీఎస్ ఎంపిక: ఆన్లైన్ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా... చివరి తేది: జూలై 15 వెబ్సైట్: http://www.btfskarnataka.org/ ఈవెంట్స్ నైపుణ్యాలకు పరీక్ష.. టెక్నోత్లాన్’14 పాఠశాల విద్యార్థుల్లో టెక్నాలజీ పరంగా ప్రేరణ కల్పించే ఉద్దేశంతో ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) - గువహటి విద్యార్థుల బృందం... టెక్నోత్లాన్ అనే ఇంటర్నేషనల్ స్కూల్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోంది. విద్యార్థులు తమ ఆవిష్కరణలను, సృజనాత్మకత నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ ఈవెంట్ వేదికగా నిలుస్తోంది. ఏటా నిర్వహించే యాన్యువల్ టెక్నో-మేనేజ్మెంట్ ఫెస్టివల్లో భాగంగా ఐఐటీ - గువాహటి విద్యార్థులు ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. టెక్నోత్లాన్లో రెండు దశలుంటాయి. ప్రిలిమ్స్: జూలై 13 మెయిన్స్: సెప్టెంబరు 4 నుంచి 7 వరకు అర్హత: తొమ్మిది నుంచి 12వ తరగతి(ఇంటర్మీడియెట్ కూడా) విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులను జూనియర్ స్క్వాడ్‌గా, 11, 12(ఇంటర్మీడియెట్) తరగతుల వారిని హాట్స్ స్క్వాడ్‌గా విభజించారు. పరీక్ష: తార్కిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, ప్రయోగాత్మక పరిశీలనల ఆధారంగా పరీక్ష పత్రాలను రూపొందిస్తారు. ఒకే స్క్వాడ్‌కు చెందిన ఇద్దరు జట్టుగా పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఒక్కో స్క్వాడ్ నుంచి 50 జట్టులను ఎంపిక చేసి ఐఐటీ గువాహటిలో నిర్వహించే మెయిన్స్‌కు ఆహ్వానిస్తారు. చాంపియన్‌షిప్ సొంతం చేసుకున్న విద్యార్థులకు లాప్‌టాప్‌లు, ఇతర బహుమతులను అందజేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ technothlon.techniche.org లేదా 8897316367(రోహిత్), 8008999261(మధు)ను సంప్రదించొచ్చు. జాబ్ స్కిల్స్ స్టార్ట్అప్ కంపెనీలో చేరాలంటే..? మార్కెట్లో నిలదొక్కుకొని విజయవంతంగా కొనసాగుతున్న కంపెనీలో పనిచేయడం కంటే అప్పుడే ప్రారంభమైన కొత్త సంస్థ(స్టార్ట్ అప్)లో పనిచేయడం నిజంగా ఒక సవాలే. ఉత్సాహం, నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కెరీర్‌కు స్టార్ట్అప్ కంపెనీలు బలమైన పునాదిరాయిగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే కొత్త కంపెనీలో ప్రతిభ చూపితే ఎదుగుదల వేగంగా ఉంటుంది. చొరవ తీసుకొని పనిచేయడం, బృందంలో ఇతరులను కలుపుకొనిపోవడం వంటి సానుకూల లక్షణాలుంటే కొత్త కంపెనీలో సులువుగా గుర్తింపు పొందుతారు. సంస్థ వ్యవస్థాపకులు అనుభవజ్ఞులై ఉంటారు కాబట్టి వారి నుంచి ప్రత్యక్షంగా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. స్టార్ట్అప్లు స్కిల్స్ కలిగిన అభ్యర్థులు నియమించుకొని, వారిని తమ అవసరాలకు తగ్గట్లుగా మార్చుకుంటున్నాయి. ఉద్యోగుల ఎంపికలో కొత్త కంపెనీలు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అవేమిటంటే.. సేల్స్ ఆప్టిట్యూడ్ ఉందా? కొత్త కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఉత్పత్తుల అమ్మకాలపైనే. అందుకే వస్తువులను విక్రయించగల శక్తి సామర్థ్యాలున్న అభ్యర్థులకు అవి పెద్దపీట వేస్తున్నాయి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, వినియోగదారులను ఒప్పించగల నేర్పు ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏ కోర్సు చదివినా సరే.. పదేళ్ల క్రితం కొత్త కంపెనీలు తమ వ్యాపారానికి సంబంధించిన కోర్సులు చదివినవారినే నియమించుకొనేవి. ఉదాహరణకు ఇంజనీరింగ్ పరికరాలను ఉత్పత్తి చేసే సంస్థలు ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసించినవారిని మాత్రమే ఉద్యోగంలో చేర్చుకొనేవి. ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోయింది. కంపెనీలు క్రాస్వర్టికల్ స్కిల్స్‌కు పెద్దపీట వేస్తున్నాయి. అంటే.. కామర్స్, ప్యూర్ సైన్స్, కంప్యూటర్స్ సైన్స్ వంటి భిన్నమైన కోర్సులు చదివినవారిని కూడా నియమించుకుంటున్నాయి. త్వరగా నేర్చుకోగలరా? స్టార్ట్అప్ కంపెనీల్లో పనిచేసేవారు సాధ్యమైనంత వరకు పొరపాట్లు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే చిన్నచిన్న తప్పులే కొత్త కంపెనీని కష్టాల్లోకి నెడతాయి. కాబట్టి తమ ఉద్యోగులు కొత్త విషయాలను త్వరగా, సమగ్రంగా నేర్చుకొని, అమలు చేసేవారై ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. నేర్చుకొనే విషయంలో వెనుకబడి ఉన్నవారిని వదిలించుకొనేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. పరిస్థితులకు తగ్గట్టు మారాలి కొత్త సంస్థలో కొన్నిసార్లు ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. వాటిని తట్టుకొని పనిచేసే సామర్థ్యం ఉద్యోగుల్లో ఉండాలి. పరిస్థితులను అనుగుణంగా మసలుకొనే తెలివితేటలు అవసరం. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరంగా పనిచేసేవారికి మంచి గుర్తింపు ఉంటుంది. నేటి విద్యలో... బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్: రీజనింగ్ ఎబిలిటీ సివిల్స్ ప్రిలిమ్స్ - పేపర్ 1: ఎకానమీ.. పేజీలను sakshieducation@gmail.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఎడ్యు న్యూస్
ఐఐఎంల నుంచి త్వరలో ఈ-లెర్నింగ్ పోర్టల్స్ దేశంలోని ప్రఖ్యాత మేనేజ్ మెంట్ విద్యా సంస్థలు అందించే పాఠాలను ఇకపై ఆన్లైన్లో ఎవరైనా చదువుకొనే అవకాశం అందుబాటు లోకి రానుంది. ఈ మేరకు ఈ-లెర్నింగ్ పోర్టళ్లను త్వరలో ప్రారంభించాలని 13 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు నిర్ణయించాయి. వీటిని రూపొందించే బాధ్యతను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ.. ఐఐఎం-కలకత్తా బోర్డు చైర్మన్ అజిత్ బాలకృష్ణన్‌కు అప్పగించినట్లు సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు ఇప్పటికే ఎన్పీటీఈఎల్ పేరుతో పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో వీడియో కోర్సులు ఉన్నాయి. నిమ్‌సెట్-2014 మన రాష్ట్రంలో వరంగల్‌తోపాటు దేశవ్యాప్తంగా 11 నగరాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)ల్లో 2014-15 సంవత్సరానికి గాను ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి ఎన్ఐటీ-అగర్తలా ‘ఎన్ఐటీ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(నిమ్‌సెట్-2014)కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హతలు: బీఎస్సీ/బీసీఏ/బీఐటీ లేదా బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీలు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ: ఏప్రిల్ 17, పరీక్ష తేదీ: మే 25, 2014 వెబ్సైట్: http://nimcet2014.nita.ac.in వెల్స్ మౌంటెయిన్ ఫౌండేషన్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించే ప్రతిభ గల విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేసేందుకు వెల్స్ మౌంటెయిన్ ఫౌండేషన్ అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్కాలర్షిప్: ఏడాదికి 300 డాలర్ల నుంచి 3000 వేల డాలర్ల వరకు.. అర్హతలు: సెకండరీ ఎడ్యుకేషన్‌లో మంచి గ్రేడ్లు సాధించి, ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ కోర్సు అభ్యసిస్తూ ఉండాలి. దరఖాస్తు: ఆన్లైన్/పోస్టు ద్వారా.. చివరి తేదీ: ఏప్రిల్ 1 వెబ్సైట్: www.wellsmountainfoundation.org కె.సి.మహీంద్రా స్కాలర్షిప్స్ ఎవరికి: విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించబోయే ప్రతిభావంతులైన విద్యార్థులకు.. స్కాలర్షిప్: ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు. అర్హతలు: ప్రథమ శ్రేణిలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. విదేశాల్లో విద్యా సంస్థల్లో ప్రవేశం లభించి ఉండాలి. లేదా ప్రవేశం కోసం దరఖాస్తు చేసి ఉండాలి. దరఖాస్తు: పోస్టు ద్వారా.. చివరి తేదీ: మార్చి 31 వెబ్సైట్: www.kcmet.org