ఎడ్యు న్యూస్ | education news | Sakshi
Sakshi News home page

ఎడ్యు న్యూస్

Published Mon, Feb 24 2014 12:02 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఎడ్యు న్యూస్ - Sakshi

ఎడ్యు న్యూస్

ఐఐఎంల నుంచి త్వరలో ఈ-లెర్నింగ్ పోర్టల్స్

 దేశంలోని ప్రఖ్యాత మేనేజ్ మెంట్ విద్యా సంస్థలు అందించే పాఠాలను ఇకపై ఆన్‌లైన్‌లో ఎవరైనా చదువుకొనే అవకాశం అందుబాటు లోకి రానుంది. ఈ మేరకు ఈ-లెర్నింగ్ పోర్టళ్లను త్వరలో ప్రారంభించాలని 13 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు నిర్ణయించాయి. వీటిని రూపొందించే బాధ్యతను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ.. ఐఐఎం-కలకత్తా బోర్డు చైర్మన్ అజిత్ బాలకృష్ణన్‌కు అప్పగించినట్లు సమాచారం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు ఇప్పటికే ఎన్‌పీటీఈఎల్ పేరుతో పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో వీడియో కోర్సులు ఉన్నాయి.
 
 నిమ్‌సెట్-2014

 మన రాష్ట్రంలో వరంగల్‌తోపాటు దేశవ్యాప్తంగా 11 నగరాల్లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)ల్లో 2014-15 సంవత్సరానికి గాను ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి ఎన్‌ఐటీ-అగర్తలా ‘ఎన్‌ఐటీ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(నిమ్‌సెట్-2014)కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
 అర్హతలు: బీఎస్సీ/బీసీఏ/బీఐటీ లేదా బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీలు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
 చివరి తేదీ: ఏప్రిల్ 17,
 పరీక్ష తేదీ: మే 25, 2014
 వెబ్‌సైట్: http://nimcet2014.nita.ac.in
 
 వెల్స్ మౌంటెయిన్ ఫౌండేషన్ ఎంపవర్‌మెంట్

 ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్
 గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించే ప్రతిభ గల విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేసేందుకు వెల్స్ మౌంటెయిన్ ఫౌండేషన్ అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 స్కాలర్‌షిప్: ఏడాదికి 300 డాలర్ల  నుంచి 3000 వేల డాలర్ల వరకు..
 అర్హతలు: సెకండరీ ఎడ్యుకేషన్‌లో మంచి గ్రేడ్లు సాధించి, ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ కోర్సు అభ్యసిస్తూ ఉండాలి.
 దరఖాస్తు: ఆన్‌లైన్/పోస్టు ద్వారా..
 చివరి తేదీ: ఏప్రిల్ 1
 వెబ్‌సైట్: www.wellsmountainfoundation.org
 
 కె.సి.మహీంద్రా స్కాలర్‌షిప్స్

 ఎవరికి: విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించబోయే ప్రతిభావంతులైన విద్యార్థులకు..  
 స్కాలర్‌షిప్: ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు.
 అర్హతలు: ప్రథమ శ్రేణిలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. విదేశాల్లో విద్యా సంస్థల్లో ప్రవేశం లభించి ఉండాలి. లేదా ప్రవేశం కోసం దరఖాస్తు చేసి ఉండాలి.
 దరఖాస్తు: పోస్టు ద్వారా.. చివరి తేదీ: మార్చి 31
 వెబ్‌సైట్: www.kcmet.org
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement