విద్య.. ఉద్యోగ సమాచారం.. మీకోసం | Employment, Education news for students special | Sakshi
Sakshi News home page

విద్య.. ఉద్యోగ సమాచారం.. మీకోసం

Published Tue, Jun 24 2014 5:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

విద్య.. ఉద్యోగ సమాచారం.. మీకోసం

విద్య.. ఉద్యోగ సమాచారం.. మీకోసం

జాబ్స్, అడ్మిషన్‌‌స అల్టర్స్
 సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు
 పోస్టులు: అసిస్టెంట్ స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్
 పోస్టుల సంఖ్య: 7
 అర్హత: అసిస్టెంట్ స్టోర్ కీపర్‌కు ఇంటర్మీడియెట్, ఫోటోగ్రాఫర్‌కు పదో తరగతి ఉండాలి. నిర్దేశిత అనుభవం తప్పనిసరి
 వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి.       చివరి తేది: జూలై 31
 వెబ్‌సైట్: http://cgwb.gov.in/
 
 బయోటెక్నాలజీ ఫినిషింగ్ స్కూల్-బెంగళూరు
 కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ
 కాలపరిమితి: ఏడాది
 అర్హతలు: బయోటెక్నాలజీ/బయో ఇన్ఫర్మాటిక్స్/ మైక్రో బయాలజీ/బయో కెమిస్ట్రీలో పీజీ/బీఈ/బీటెక్/బీ ఫార్మసీ లేదా అగ్రికల్చర్/వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ/ఎంబీబీఎస్/బీడీఎస్
 ఎంపిక: ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా...    చివరి తేది: జూలై 15
 వెబ్‌సైట్: http://www.btfskarnataka.org/
 
 ఈవెంట్స్
 నైపుణ్యాలకు పరీక్ష.. టెక్నోత్లాన్’14
 పాఠశాల విద్యార్థుల్లో టెక్నాలజీ పరంగా ప్రేరణ కల్పించే ఉద్దేశంతో ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) - గువహటి విద్యార్థుల బృందం... టెక్నోత్లాన్ అనే ఇంటర్నేషనల్ స్కూల్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోంది. విద్యార్థులు తమ ఆవిష్కరణలను, సృజనాత్మకత నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ ఈవెంట్  వేదికగా నిలుస్తోంది. ఏటా నిర్వహించే యాన్యువల్ టెక్నో-మేనేజ్‌మెంట్ ఫెస్టివల్‌లో భాగంగా ఐఐటీ - గువాహటి విద్యార్థులు ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.
 
 టెక్నోత్లాన్‌లో రెండు దశలుంటాయి.
 ప్రిలిమ్స్: జూలై 13
 మెయిన్స్: సెప్టెంబరు 4 నుంచి 7 వరకు
 అర్హత:
 తొమ్మిది నుంచి 12వ తరగతి(ఇంటర్మీడియెట్ కూడా) విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులను జూనియర్ స్క్వాడ్‌గా, 11, 12(ఇంటర్మీడియెట్) తరగతుల వారిని హాట్స్ స్క్వాడ్‌గా విభజించారు.
 పరీక్ష:
 తార్కిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, ప్రయోగాత్మక పరిశీలనల ఆధారంగా పరీక్ష పత్రాలను రూపొందిస్తారు. ఒకే స్క్వాడ్‌కు చెందిన ఇద్దరు జట్టుగా పరీక్షను రాయాల్సి ఉంటుంది.  ఒక్కో స్క్వాడ్ నుంచి 50 జట్టులను ఎంపిక చేసి ఐఐటీ గువాహటిలో నిర్వహించే మెయిన్స్‌కు ఆహ్వానిస్తారు. చాంపియన్‌షిప్ సొంతం చేసుకున్న విద్యార్థులకు లాప్‌టాప్‌లు, ఇతర బహుమతులను అందజేస్తారు.
  పూర్తి వివరాలకు వెబ్‌సైట్ technothlon.techniche.org లేదా 8897316367(రోహిత్), 8008999261(మధు)ను సంప్రదించొచ్చు.
 
 జాబ్ స్కిల్స్
 స్టార్ట్‌అప్ కంపెనీలో చేరాలంటే..?
 మార్కెట్‌లో నిలదొక్కుకొని విజయవంతంగా కొనసాగుతున్న కంపెనీలో పనిచేయడం కంటే అప్పుడే ప్రారంభమైన కొత్త సంస్థ(స్టార్ట్ అప్)లో పనిచేయడం నిజంగా ఒక సవాలే. ఉత్సాహం, నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కెరీర్‌కు స్టార్ట్‌అప్ కంపెనీలు బలమైన పునాదిరాయిగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే కొత్త కంపెనీలో ప్రతిభ చూపితే ఎదుగుదల వేగంగా ఉంటుంది.
 చొరవ తీసుకొని పనిచేయడం, బృందంలో ఇతరులను కలుపుకొనిపోవడం వంటి సానుకూల లక్షణాలుంటే కొత్త కంపెనీలో సులువుగా గుర్తింపు పొందుతారు. సంస్థ వ్యవస్థాపకులు అనుభవజ్ఞులై ఉంటారు కాబట్టి వారి నుంచి ప్రత్యక్షంగా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. స్టార్ట్‌అప్‌లు స్కిల్స్ కలిగిన అభ్యర్థులు నియమించుకొని, వారిని తమ అవసరాలకు తగ్గట్లుగా మార్చుకుంటున్నాయి. ఉద్యోగుల ఎంపికలో కొత్త కంపెనీలు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అవేమిటంటే..
 
 సేల్స్ ఆప్టిట్యూడ్ ఉందా?
 కొత్త కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఉత్పత్తుల అమ్మకాలపైనే. అందుకే వస్తువులను విక్రయించగల శక్తి సామర్థ్యాలున్న అభ్యర్థులకు అవి పెద్దపీట వేస్తున్నాయి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, వినియోగదారులను ఒప్పించగల నేర్పు ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయి.
 
 ఏ కోర్సు చదివినా సరే..

 పదేళ్ల క్రితం కొత్త కంపెనీలు తమ వ్యాపారానికి సంబంధించిన కోర్సులు చదివినవారినే నియమించుకొనేవి. ఉదాహరణకు ఇంజనీరింగ్ పరికరాలను ఉత్పత్తి చేసే సంస్థలు ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసించినవారిని మాత్రమే ఉద్యోగంలో చేర్చుకొనేవి. ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోయింది. కంపెనీలు క్రాస్‌వర్టికల్ స్కిల్స్‌కు పెద్దపీట వేస్తున్నాయి. అంటే.. కామర్స్, ప్యూర్ సైన్స్, కంప్యూటర్స్ సైన్స్ వంటి భిన్నమైన కోర్సులు చదివినవారిని కూడా నియమించుకుంటున్నాయి.
 
 త్వరగా నేర్చుకోగలరా?
 స్టార్ట్‌అప్ కంపెనీల్లో పనిచేసేవారు సాధ్యమైనంత వరకు పొరపాట్లు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే చిన్నచిన్న తప్పులే కొత్త కంపెనీని కష్టాల్లోకి నెడతాయి. కాబట్టి తమ ఉద్యోగులు కొత్త విషయాలను త్వరగా, సమగ్రంగా నేర్చుకొని, అమలు చేసేవారై ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. నేర్చుకొనే విషయంలో వెనుకబడి ఉన్నవారిని వదిలించుకొనేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు.
 
 పరిస్థితులకు తగ్గట్టు మారాలి

 కొత్త సంస్థలో కొన్నిసార్లు ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. వాటిని తట్టుకొని పనిచేసే సామర్థ్యం ఉద్యోగుల్లో ఉండాలి. పరిస్థితులను అనుగుణంగా మసలుకొనే తెలివితేటలు అవసరం.  క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరంగా పనిచేసేవారికి మంచి గుర్తింపు ఉంటుంది.
 
 నేటి విద్యలో...
     బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్: రీజనింగ్ ఎబిలిటీ
     సివిల్స్ ప్రిలిమ్స్ - పేపర్ 1: ఎకానమీ..     పేజీలను sakshieducation@gmail.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement