ఐఐటీ ప్రవేశాలలో మార్పులు!
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన విధానాల్లో తాజా మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా ప్రస్తుతం ఐఐటీల్లో ప్రవేశాలకు అమలు చేస్తున్న.. ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుల్లో టాప్-20 పర్సంటైల్ అనే నిబంధనకు ప్రత్యామ్నాయం చూసే దిశగా జాయింట్ అడ్మిషన్ బోర్డ్ యోచిస్తోంది. 2012 నుంచి అమలు చేస్తున్న టాప్-20 పర్సంటైల్ నిబంధన విషయంలో విద్యార్థుల్లో నిరసన కొనసాగుతూనే ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వచ్చినా బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవక ఎందరో విద్యార్థులు ఐఐటీలో సీటు అవకాశం కోల్పోయారు. ఇదే విషయంపై ఐఐటీ డెరైక్టర్లతో కూడిన జాయింట్ అడ్మిషన్ బోర్డ్ ప్రత్యామ్నాయాలను రూపొందించేందుకు ఉపక్రమించింది. త్వరలో జరిగే జేఏబీ మలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మార్పులకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2015 నుంచే అమలు చేయనున్నట్లు సమాచారం.
ఐఆర్‌ఎంఏలో.. పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్
దేశంలో ప్రముఖ బీస్కూల్.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ - ఆనంద్.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (పీఆర్‌ఎం) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: 50 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం) మార్కులతో 10+2+3 విద్యా విధానంలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు.. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: క్యాట్-2014లో వచ్చిన స్కోర్ ఆధారంగా.. ఐఆర్‌ఎంఏ ప్రవేశపరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2014
వెబ్‌సైట్: www.irma.ac.in